చిత్రం అరె భళారే విచిత్రం…

డిసెంబర్ 12, 2010
నా అమెరికా అనుభవాల్లో విడ దీయలేని భాగం రోజు ఆఫీసు కి వెళ్ళటం. మా పక్క ఇంటి మిత్రుడు రోజు నాకు లిఫ్ట్ ఇవ్వటం, తనతో మల్లా సాయంత్రం ఇంటికి రావటం.ఎందుకండి ఆయనకు ఇబ్బంది ఏ బస్సు లోనో వెళ్ళచ్చు కదా అని మీరు అడగటం లో తప్పు లేదు. కాని ఇక్కడ బస్సు ఉంటేనే కదా వెళ్ళటానికి. మన దేశం లో ఏ మారు మూల పల్లేటూల్లోనో బస్సు సౌకర్యం లేదు అంటే ఇంకా నామోషి గా అని పిస్తుంది. కాని మన అగ్రరాజ్యం లో కొన్ని అర్బన్ ప్రాంతాలకు ( దాదాపు అన్ని  అని చదూకోవచ్చు) బస్సు సౌకర్యమే లేదంటే నమ్ముతారా. మొన్నటి దాక నేను నమ్మలే…
ఇండియా లో ఫలానా విధాన నిర్నయాల్లోనో, లేక ఫలానా కొత్త జీ వో ల్లోనో ఫలానా కంపెనీ ప్రభావం ఉంది అది ఉంది ఇది ఉంది అనుకుంటున్నామే,మరి ఈ దేశం నిర్ణయాలన్నీ కంపెనీ లే డిసైడ్ చేస్తాయంటే నమ్మ గలరా…ఈ బస్సు ఉదంతం గొప్ప మేలు కొలుపు. అమెరికా గొప్పంతా, ఇక్కడి కంపనీలదే కదా. గబక్కన అమెరికా అనుకుంటే మీకు గుర్తొచ్చేది లిబెర్టి బొమ్మ,ఒక శ్వేత సౌధం, తర్వాత మేక డోనాల్డ్ ఏ  కదా… 😉
సరే,ఇక విషయాని కొస్తే, జనరల్ మోటారు , ఫోర్డు, ఇత్యాది కంపెనీలన్నీ ఉన్న ఈ దేశం లో బస్సు సౌకర్యం ఉంటె, మరి వీళ్ళు పడీ పడీ ఉత్పత్తి చేస్తున్న కార్లన్నీ ఎవరు కొంటారు. అందుకని, అసలు బస్సు లేక పోతే, అందరు చచ్చి నట్టు కారు కొనాల్సిందే. పెళ్ళాం మొగుడు సద్యోగాలు వెలగపెట్టే ఈ దేశం లో ఒక్కో ఇంట్లో ౨-౩ కార్లు ఉండటం కూడా కద్దు. వెయ్యి డాలర్లు వచ్చే పని చేస్తున్నా,అప్పో సొప్పో చేసి కార్ కొనక పోతే కుదరదంతే. ఇక్కడ జనాభా పెరుగుతుంది అంటే, మన కార్ కంపెనీలకు కస్టమర్ లు పెరుగుతున్నట్టే.
మరి ఇంతలా కార్లు కొంటె,వీటన్నిటికి పెట్రోల్ ఎక్కడ్నుంచి వస్తుంది. మనోళ్ళు ప్రపంచం మీద పడీ ఏదో పెట్రోల్ బాగా ఉన్న దేశం మీద అధిపత్యం తెచ్చు కోవాలె.దానికి వాడు దీపావళి బాంబులు కాలుస్తున్నా అణుబాంబు అని చెప్పాలే. అసలే అగ్ర రాజ్యం బాబాయ్ ఇది తప్పు అంటే ఎందుకొచ్చిన తంటా అని, మిగతా దేశాలన్నీ,గాంధీ మూడు కోతులలా వివిధ భంగిమల్లో సెట్ అయిపోతాయి.
ఇంకా ఎవడన్న ఏమన్నా అంటే, గణాంకాలు ఎలా ఉన్నా, ఇండియా చైనా ల మీద పడీ పడీ ఏడుపు మొదలెట్టాలే. యేమని, అయ్యా మీరంతా కార్లు కొనేసి కార్బన్ ఉద్గారాలు పెంచేస్తున్నారు అని.
ఇండియా లో ఎవడన్న నానో కార్ కొంటె, ఏదో బోఇంగ్ కొన్నట్టు కట్టింగ్ ఇవ్వాలే.
ఎందుకొచ్చిన బాధ చెప్పండి.సరే ఏమన్నా అంటే అన్నాం అంటారు కాని, ఈ పనికి మాలిన పనులు మానేసి, ప్రపంచం తో పాటు నడవచ్చు కదా..అసలే పెట్రోల్ లేదురా మగడా…అంటే ౧౦ కార్లు కొంటా అన్నాడట..పబ్లిక్ బస్సులు పెంచి, కార్ పూలింగు అలవాటు చెయ్యక పోతే…ప్రపంచం లో పెట్రోలంతా, వీళ్ళకే చాలదు.

అమెరికతలు-2..

నవంబర్ 26, 2010
౨-౩ రోజులుంచి అటు ఇటు తిరుగుతూ  సరిగ్గా నిద్రలేదేమో, బాగా నిద్ర పట్టేసింది. లెగిచి చూద్దును కదా ఏ దేశం మీదున్నామో తెలియక పోయినా  తెల్లారినట్టు తెలిసింది. వాచి చూసుకుంటే ఒక ౮ గంటలు నిద్రేసాం  అని అర్ధం అయ్యింది. బ్రేక్ ఫాస్టు అవి కానిచ్చి, పక్కనున్న బాబాయి గారితో లోకాభిరామాయణం మొదలెట్టాను. ఆయన అదే మొదటి సారి యు.ఎస్ పిల్లల దగ్గరకు వెళ్తున్నారని తెలిసింది.లావేట్రి దగ్గర కునికి పాట్లు పడుతున్న ఇద్దర్ని చూపించి, అదేంటబ్బాయి అందరు ఇక్కడే నిలబడక పొతే బైటకేల్లోచ్చు కదా…అన్నాడు.అప్పుడే ఏదో కొంచెం ఉన్న నిద్ర మత్తంతా దెబ్బకి యెగిరి పోయింది.
విమానం లో సందడి అంతా సీమ టపా కాయలదే. ఇటు పరిగెత్తి అటు పరిగెత్తి, తల్లి దండ్రులను నానా హైరానా పెడుతున్నారు. మనోల్లలాగా ఒక దెబ్బేస్తే, గమ్ముగా ఉండే ఘటాలు కాకపోయె. అదీ కాక, అమెరికా లో ఉన్న చట్టాల ప్రకారం, వీళ్ళను రెండు దేబ్బలేస్తే, అదేదో నెంబర్ కి ఫోన్ చేసి తల్లిదండ్రుల మీద కూడా కంప్లైంట్ చేసెయ్యచ్చు.ఎందుకొచ్చిన గొడవ అని, ప్లీజ్ కన్నా, కం హియర్ అని ఒకా యన బ్రతిమాలుతుంటే, హే బడ్డి, ప్లీజ్  డూ దట్ అని ఇంకో కాయన బామాలుతున్నాడు. అయినా వాళ్ళు అంత సులభం గా వింటే, విమానం లో సందడి ఏముంది.
మొత్తానికి చికాగో చేరాము.ఇప్పుడే మొదలవుతున్న చలి కాలం. విమానాశ్రయం లోనికి ప్రవేశించే ద్వారం దగ్గర ఎలా వచ్చిందో చలి గాలి గిలిగింతలు పెట్టింది.అమెరికాకు స్వాగతం నేస్తం…ఇమ్మిగ్రేషన్ పనులు ముగించుకుని బైట పడే సరికి, నా లింకు విమానం కాస్తా తుర్రున పోయింది. అమెరికన్ ఎయిర్ లైన్స్ కౌంటరు లో పిల్ల యు మిస్సేడ్ ఇట్ బై  టెన్ మినిట్స్ అని పళ్లన్నీ బైట పెట్టి చెప్పింది. నా ఫ్లైట్ మిస్ ఐతే ఈమె కెందు కింత ఆనందమో…లేక టీవీ లో వార్తలు చదివే వాళ్ళలాగా అలవాటయి పోయిందేమో.సరే తల్లి ఎప్పుడు ఫ్లైట్ మల్లి అని ఏడవలేక ఒక చచ్చు నవ్వు నవ్వి అడిగాను. ఇంకో ౨ గంటల్లో అని చెప్పింది.
ఇంకేం చేస్తాం, కే.ఎఫ్.సి లో ఏదో కొన్ని వేపుడు దుంపలు, మరి టొమాటో సాసు తలగేసు కొని కుర్చీ లో కూల బడ్డాను.ఇంత బతుకు బతికి అన్నట్టు, యెంత మొనగాడైనా, ఈ దేశం లో ఈ చెత్తంతా  తినాల్సిందే…ఎదవ జీవితం
పక్క సీట్ లో ఒక తెలుగు అమ్మాయి. వాళ్ళ స్నేహితులు.కార్తిక మాసం అంట…యేవో పళ్ళు,దుంపలు తెచ్చుకుంది.ఆహ ఏ దేశమేగిన, యందు కాలిడినా, తల పాగా తీసి గౌరవించాల్సిందే ఇలాంటి వాళ్ళని  ( హాట్స్ ఆఫ్ కు నా తెలుగీకరింత…పోయిన టపా లో మిత్రుల కోరిక మేరకు,సాద్యమైనంత వరకు తెలుగు లోనే రాద్దామని చిన్న ప్రయత్నం 😉 )
డిట్రాయిట్ చేరే టప్పటికి ౫ అయింది. బ్రతుకు జీవుడు ..ఇక హోటల్ కెళ్ళి బజ్జుంటాను అని లోపల్నించి గోలేట్టేస్తున్నాడు. లగేజు చూద్దును కదా..ఒక బాగు మిస్సింగ్…ఎయిర్ లైన్స్ వాళ్ళను అడిగితె, ఇదేమన్న కొత్తా అన్నట్టు మొహం పెట్టి, వచ్చే ఫ్లైట్ లో రావచ్చు ఇంకో గంట పడుతుంది, లేకుంటే, ౨ రోజుల్లో మీ అడ్రస్సు కు పంపుతాము.అన్నది.ఏమి చేస్తాం, ఇంకో గంట వెయిటింగ్ అన్న మాట.
యునైటెడ్ స్టేట్స్ అఫ్ ఆంధ్ర ( యు.ఎస్.ఏ లో ఉన్న మన తెలుగోళ్ళ సంతతి ని చూసి కళ్ళు కుట్టి, మా తమిళ కొలీగు చేసిన కామెంట్) లో తెలుగోల్లకేం తక్కువ.మళ్ళా ఒక తెలుగాయన.డిట్రాయిట్ లో కన్సుల్టేన్సీ ఉందట.అక్కడే పరిచయం అయ్యాడు. కాసేపట్లోనే, ఇది వరకు జాబు మార్కెట్, ఇప్పుడు పరిస్తితి అదీ ఇదీ అని బాగా ఊదర కొట్టేసాడు.ఎంతలా అంటే ఇంకాసేపుంటే నేనే హెచ్౧ కి అప్లై చేసేటట్టు అబ్బే చాల ఈజీ అండీ…మా ఆఫీసు లో నిన్ననే ౪ హెచ్ ౧ లు చేసాము. అన్నాడు.నా వివరాలు కనుక్కున్నాడు.ఫోన్ నెంబర్ తీస్కున్నాడు. వీకెండ్ ప్లాన్స్ ఏంటి కలుద్దాం బ్రదర్ అన్నాడు. అమాయకున్డను, నిజమే అనుకుంటిని, ఇంత వరకు మాట మంతీ లేదు. నా నెంబర్ తీస్కున్నంత తొందరగా మీ కార్డు ఇస్తారా అన్నా స్పందించలేదు. అబ్బే మీ నెంబర్ ఉంది గా..నేనే పిక్ చేస్కుంటాను…అని వాగ్దానం చేసాడు. ఇంతలో వాళ్ళ స్నేహితుడు రావటం తో బాయ్ చెప్పి బయలు దేరాడు. అంటే, అయ్యవారికి మంచి టైం పాస్ గాడు దొరికాడన్నా మాట ( నాక్కా దండోయ్   ).
ఇంతలో నా బాగేజు రావటం తో ప్రాణం లేచొచ్చి నట్టయ్యి, వడి వడి గా బైట పడి,హోటల్ చేరాను.
అదండీ, ఈ సారి నా ప్రయాణం లో పదనిసలు, అపసవ్యం గా గార్ధభ రాగం లో సాగాయి…మళ్ళా ఇంకో టపా లో  కలుద్దాం…ప్రస్తుతానికి ఇటు అటు కాని టైం జోన్ లో నా నిద్రా ప్రపంచం లో తిరుగాడుతున్నా …డోంట్ డిస్టర్బ్…

అమెరికతలు….

నవంబర్ 25, 2010
౨౦ నవంబర్ ౨౦౧౦.
అమెరికా కు మరో ప్రయాణం.అమ్మ, నాన్న అక్క వాళ్ళ ఫ్యామిలీ విమానాశ్రయం కి నాతొ పాటు వచ్చారు.వెళ్ళేటప్పుడు ఎప్పట్లాగే అమ్మ కళ్ళలో చెమ్మ.మొదటి సారి నాది అదే ఫీలింగ్.ఇంతకూ ముందెప్పుడూ ఈ ఫీలింగ్ లేదు.ప్రయాణాలు కొత్త కాకున్నా, ఈ సారెందుకో ఎప్పట్లాంటి ఉత్సాహం లేదు. ఉద్యోగ పరం గా, ఆర్దికం గా ఈ ప్రయాణం ఏంతో ముఖ్యమైంది కావచ్చు.కాని, వ్యక్తిగతం గా ఏదో కోల్పోతున్న ఫీలింగ్.అక్కడ సంపాదించేది, ఇక్కడ కోల్పోతున్న దాని కన్నా తక్కువేమో, ఇది నష్టం వచ్చే వ్యాపారమేమో…
చెక్-ఇన్ లో ఎక్కువ బరువున్న బాగేజీ నన్ను వెక్కిరించింది.డు ఐ నీడ్ టు పే ఎనీ తింగ్? అర్ధోక్తిలో అడిగాను. ౨ కిలోలకి ఏమి కదతారులే? జవాబు కూడా అర్దోక్తి లోనే ఇచ్చింది కౌంటర్ లో అమ్మాయి. మొత్తానికి  కొంచెం ఎక్కువ బరువున్న ఆవకాయ పచ్చడి పాస్ అయిపొయింది.ఇమ్మిగ్రెషున్ ముందు యౌజర్ చార్జి కౌంటర్. కట్టి మూడేళ్ళు దాటిన విమానాశ్రయం కి ఇప్పుడు ఈ తద్దినము ఏమిటో ఏలిన వారికే తెలియాలి. తెనాలి రామ లింగ సినిమాలో చాకలి రంగడు అన్నట్టు, ఏలినోల్లు చల్లగా చూస్తె ఎవరి పని వాళ్ళు చక్కగా చేసుకుంటారు, అదీ సంగతి. 

కాని ఇక్కడో కొసమెరుపు.ఎయిర్  ఇండియా వాళ్ళు రాత్రి ౧౨:౩౦ కి అఘోరించిన మిస్సేడ్ కాల్ కి ఉత్సాహవంతుడనగు టచే నేను కాల్ బ్యాక్ చేసి ఈ విషయము కనుక్కున్నాను కాబట్టి, తగు పైకము సమర్పించ గలిగితిని.నా వుత్స్తాహవంతులు కాని జనం అక్కడ బిక్క మొహం వేసినారు.౮౫౦ రూప్యంములు తక్కువ రొక్కము కానీ చేతనను, సదరు విమానాశ్రయం వారు చిల్లర దుకాణము వాని వలె డెబిట్/క్రెడిట్ కార్డులు అంగీకరించని కారణమున, ఆ కౌంటరు నందు రాజకీయ సభకు జన సమీకరణ చేసి నట్టు జనం పోగయినారు.నేను కట్టను అని భీష్మించే వాళ్ళు కొందరైతే, బాబ్బాబు ఎంతో కొంత తీస్కోన్డురూ అని బతిమాలేవాళ్ళు కొందరు.గ్రంధి గారి మంత్రాంగం వాళ్ళనేమీ చేసారో మరి. 

ఇమ్మిగ్రేషన్ లో ఇంకో చిత్రం. డ్యూటీ దిగిపోయ్యే హడావుడి లో ఉన్న మహాతల్లి, వర్క్ వీసా మీద కొట్టాల్సిన ముద్ర విసిటర్ వీసా మీద కొట్టింది. ఆమె విసిరేసిన తర్వాత పీ.ఎస్.ఎల్.వీ రాకెట్టు వలె నా పైకి దూసుకొస్తున్న పస్స్పోర్టు ను స్లిప్స్ లో రాహుల్ ద్రావిడ్ క్యాచ్ పట్టినట్టు ఒడుపుగా పట్టి, ఆ తప్పు గమనించి కౌంటరు మూసి వడివడి గా వెళ్తున్న ఆమె వెంట బడి అడిగితె అదేమీ కాదు లే, అమెరికా వాళ్ళు చూసే వేస్తారు వాళ్ళకు చెప్పు అని అభయం ఇచ్చింది.
ఎంతైనా వాళ్ళమీద యెంత గురి.డిల్లి నుంచి బిల్లి లు తిరిగే గల్లిల దాక..హతోస్మి.
ఇక విమానాశ్రయం లో తినదగ్గ పదార్దాలున్న ఒకే ఒక పూటకూళ్ళ ఇంట్లో ఒక్కొక్కింటి ధర ౨-౩ డాలర్లు మన కరన్సీ లో మార్చి పెట్టినారు.బైట ౫ రుప్యంములకు దొరికే ఇడ్లి ఇక్కడ దాని సిగదరగ ౨౫ రూపాయలు అయి కూర్చున్నది. ప్రతి విషయం లో అమెరికా ను పోలో మని ఫాలో అయిపొయ్యే మన జనం ఇందులో ఎందుకు కారు. పెద్ద పెద్ద విమానాశ్రయంలలో కూడా కి.ఎఫ్.సి.,మేక దోనల్డు లాంటి వోటేలులు బైట రేట్ లే వసూలు చేస్తాయి. అబ్బే అలాంటి చెడ్డ అలవాట్లు మనకెందుకూ.
సరేలే ఏదొకటి అని సగటు భారతీయ ప్రయనీకుని లా ఆరోజు రాత్రి భోజన కార్యక్రమమును “మమ” అనిపించి,నా టెర్మినల్ దగ్గరకు వచ్చాను.నా పక్క సీట్ లో తెలుగు జంట.చికాగో వెళ్తున్నార్ష.గమ్మత్తేమిటంటే, ఆ అమ్మాయి ఇన్ఫోసిస్ లో ఉద్యోగి .మూడేళ్ళుగా ఉంటున్నారట.అతను డిపెండెంట్ వీసా.లేచింది మహిళాలోకం.నెత్తికి టవల్ కట్టుకుని అన్న గారు పిండి రుబ్బుతున్న దృశ్యం కాన్పించింది.
మనిషి మనిషి దీ ఒక చరిత్ర అన్నట్టు, ఇక్కడ ఒక్కక్కళ్ళ దీ ఒక్కో కధ.కొడుకులు,కూతుళ్ళ దగ్గరకెళ్ళే పెద్దోళ్ళు,మొగుళ్ళ ఉద్యోగ రీత్యా వెళ్ళే పెళ్ళాలు,విద్యార్దులు ఉద్యోగార్దులు ఒక్కరేమిటి రక రకాలు.
౯ కి రావాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ మామూలు గానే ౨ గంటలు ఆలీసమైనాది. జనం పిచ్చ పాటి మొదలెట్టినారు.విజయవాడ  రంగా రావు ౧౦ ఏళ్ళుగా వేర్మౌంట్ లో స్తిర పడ్డ దరిమిలా,వనస్తలిపురం నుంచి మొదటి సారి  అమెరికా వెళ్తున్న వెంకట్ రావు కు అక్కడి డ్రైవింగ్ లైసెన్సు దాని కధ కమామీషు ఊదర గొట్టేస్తున్నాడు.గుడివాడ గుర్నాధం వాళ్ళ అమ్మాయి ని చూసి రావటానికి బైలుదేరాడు.అక్కడ ఆడంగులు మందు సిగరెట్టు ఊదేస్తారషగా..అని నోరు నొక్కుకున్నాడు.బెజావాడ భోగారావు కిష్ణ భగవానుడిలా చిద్విలాసం చేస్తూ, అవన్నీ మామూలే గురూ గారు అంటున్నాడు.
ఈ చిత్రాలు చూసే టప్పటికి అదుగో ఎయిర్ ఇండియా ఫ్లైట్ రానే వచ్చింది.రేపో ఎల్లుండో రిటైర్ అయ్యేవయసున్న ఎయిర్ హోస్తేస్స్ “నమస్కారం” చెప్పి ఆహ్వానించింది.సరే నా సీట్ లో కూర్చున్నాను.విమానం బైలు దేరింది.నా హెడ్ ఫోనులో నుంచి శబ్దం రాక పొయ్యే టప్పటికి ఎయిర్ హోస్తేస్స్ ను పిలి చాను. సరిగ్గా  హోల్ లో పెట్టు అదే వస్తుంది. విసురు గా చెప్పి విసా విసా వెళ్లి పోయింది.ముసలావిడ కు చాదస్తం అంటే ఇదే నేమో.నా పక్క సీట్ లో పెద్దాయనకు ఫోను లేదు సీట్ లో ఉండాల్సిన సాకెట్టు లేదు. గొడవ లేని పని.
చూస్తుండ గానే ఢిల్లీ చేరాము.మళ్ళా సెక్యూరిటీ చెక్కు.బ్రతుకు జీవుడా అని రాత్రి ౨:౩౦ గంటలకు చికాగో వెళ్ళే ఫ్లైట్ ఎక్కాము.   మిగతా సంగతులన్ని ఇక్కడ పట్టవు కాని మల్ల చెప్తా..

సృష్టి లో తీయనిది స్నేహమేనోయి..

నవంబర్ 16, 2010
అనుకోకుండా ఒక ఆవకాశం…యు ఎస్ వెళ్ళడానికి…౨-౩ వారాల్లో అంతా ఓ కే అయ్యింది. అంతా చేసి ౨ వారాలే టైం ఉంది..హడావుడి గా మా వూరు బయలుదేరాను.. అమ్మను చూసిరావడానికి..ఆమెకు ఇంకా ఈ విషయం తెలీదు. మా అక్కకు చెప్పాను కొంచెం ముందు నుంచే ప్రిపేర్  చెయ్యమని. అమ్మకి నేను వెళ్ళడం ఇష్టం లేదు.అందుకే ఈ టాపిక్ వచ్చినప్పుడల్లా కొంచెం నా వైపు నుంచి అనుకూలం గా మాట్లాడి కన్విన్సు చెయ్యమని చెప్పాను.ఇంట్లో పరిస్తితి కొంచెం సానుకూలం గానే కనపడింది.
ఆ రోజు దీపావళి. మా అక్క కూతురుదే ఇంట్లో హడావుడి. ఆ వయసులో మనము అంతే నేమో. పొద్దున్నే లేచిన దగ్గర్నుంచి తనకు టపాకాయల ద్యాసే..అవన్నీ చక్కగా పేపర్ మీద పేర్చి, ఎండ లో పెట్టింది. నేను రానను కున్నారేమో  మా నాన్న నాకు టపాకాయలు తాలేదు. దానికి అది చేసిన రాద్దాంతం ఇంతా అంతా కాదు. మా నాన్న మల్ల బజారు కెళ్ళి నా కోటా టపాకాయలు తెచ్చేదాకా ఆయన పైన రాజి లేని పోరాటం చేసింది. నేను తనని అడిగాను, ఏమిటే నీ గోల అని..దానికి అది చెప్పిన సమాధానం ఏంటో తెలుసా..మరి నువ్వు నా టపాకాయలన్ని   కాల్చేస్తేనో అని.
కొంచెం రెడీ అయ్యి,నేను అలా బజారు దారి పట్టాను..మద్యలో గుడి దగ్గర కొచ్చేటప్పటికి ఒరేయ్ ఎప్పుడొచ్చావ్ అన్న పిలుపు విని వెనక్కు తిరిగి చూసాను. మా డిగ్రీ దోస్తులు ఇద్దరు కనపడ్డారు.
చిన్నగా మా గ్రంధాలయం మెట్ల మీద కూలబడ్దాం. మా డిగ్రీ దోస్తుల గురుంచి వాళ్ళవాళ్ళ ఉద్యోగ సద్యోగాల గురుంచి, పెళ్లి ఐన వాళ్ళ కధాకమామీషు నుంచి పెళ్లి కాని ప్రసాదుల వరకు అన్ని మాట్లాడుకున్నాం. అదుగో ఒంటి గంట ఐంది. మల్లా కలుద్దాం అని భారం గా ఇళ్ళకు బయలుదేరాం.
కలిసి మెలిసి తిరిగిన మేము రకరకాల కారణాల వల్ల వేరైనప్పటికి ఆ రోజులు నెమరు వేసుకుంటే, ఏదో గొప్ప ఫీలింగ్. ఏ బాదర బందీ లేకుండా, కాలేజీ ల దగ్గర్నుంచి,కొత్త సినిమా రిలీజ్ ఐన హాల్స్ వరకు, ట్యూషన్ పాయింట్ల నుండి బాబా గుడి వరకు అంతా మాదే హల్చల్. ఎన్నో తీపి గుర్తులు జ్ఞాపకాలు.అందరితో కలిసున్నా, మా తొట్టి గ్యాంగ్ లో ౬  గురం. బాషా,నేను,బ్రంహం,కరీం,సురేంద్ర,రాంబాబు. మా స్నేహానికి మొదటి మెట్టు ట్యూషన్ పాయింట్. చివరి వరసలో మాకు చాల స్వతంత్రం ఉండేది. పంతులు గారిపై సెటైర్లు వెయ్యడం మొదలు, పక్క వరసలో అమ్మాయిల మీద కామెంట్ల దాక వెనక వరస వాళ్ళదే ముందడుగు. అలా అని కోతి గుంపు అని జమ కట్టేయ్యకండి. మేము రొజూ పోటీలు పడి చదివే వాళ్ళం. కాలం తో పాటు మా స్నేహం మరింత దృడ పడింది.
ఫైనల్ ఇయర్ లో మాకు ఇంకా మంచి పోటి ఏర్పడింది..అయినా అది కేవలం చదువుల వరకే పరిమితం. బ్రంహం కి జ్వరం వస్తే వాడి నోట్స్ రాసి పెట్టడం, ౪ ఏళ్ళ నుంచి బాష లైన్ వేస్తున్న అమ్మాయికి లవ్ లెటర్ ఇవ్వటానికి తోడూ వెళ్ళడం, తర్వాత రోజు వాళ్ళ అన్న మమ్మల్ను వెతుక్కుంటూ వస్తే, పక్క వీది లోనుంచి శివ సినిమాలో సైకిల్ చేజ్ లాగ బైట పడటం అన్ని గుర్తొచ్చాయి.ఆ జ్ఞాపకాలు గురుతులు నన్ను పలకరించాయి 

ఆనాటి ఆ స్నేహమానంద గీతం అని పాడాలని పించింది. సరే అల్లాగే ఇల్లు చేరాను.మా ఇంటి ముందు అప్పుడే ఆగిన ఆటో నుంచి దిగిన పర్సనాలిటీని చూసి ఉబ్బి తబ్బిబ్బైనాను. మధు. మా మేనత్త కొడుకు. వాళ్ళు మా వూరు నుంచి ౨౫౦ కి.మీ. దూరం లో ఉంటారు.తను వ్రుత్తి రీత్యా బళ్ళారి లో ఉంటాడు. తన వైఫ్ ఇక్కడే ఉద్యోగం చేస్తుండటం తో పండగకు పబ్బానికి తనకు తప్పని ప్రయాణాలు..తనకు నేను మా వూరు వస్తున్నట్టు తెలుసు..కాని తనకు కుదరదని చెప్పాడు .వాడికి ఇద్దరు పిల్లలు.. పెద్దోడు చాల గోడవేట్టేస్తున్నాడు రా.. ఈ సారి నిన్ను కలవటం కుదరదేమో…వాడి గొంతులో ఏదో మూల చిన్న బాధ..పర్లేదు లేరా..మల్లా కలుద్దాం..అయినా ఫోన్ లో రోజు మాట్లాడుకుంటాం కదా..పెద్ద ఆరిందా లాగా నా ఓదార్పు. నన్ను చూడగానే అన్నాడు, మల్లా ఎన్నాళ్ళకు చూస్తానో అని వచ్చేసాను రా..అని.
నేను చాల ఆనంద పడ్డాను.నేను జీవితం లో ఏదైనా దాచకుండా చెప్పానంటే అది వాడికే. వాడు ఇంకా ఒక అడుగు మున్డుకేసాడు.ఇంట్లో ప్రతి చిన్న పెద్ద విషయం నాతొ చెప్పుకొని స్వాంతన పొందటం నాకు తెలుసు.మా స్నేహం మాకు ఊహ తెలిసినప్పటిది. నాకు మొదటి స్నేహితుడు వాడు…
వాళ్ల పిల్లల చదువులు ఆరోగ్యాలు,వాడి ఉద్యోగం ముచట్లు అన్ని తెలుసుకుంటూ భోంచేసాము. 

రాత్రి కుదుపుల ప్రయాణం మమ్మల్ని చక్కగా నిద్ర పుచ్చింది.వాడిని బస్సు స్టాండ్ లో వదిలి రావటానికి బైలు దేరాను.కేవలం నన్ను చూడ్డానికే కుటుంబం తో పండగ సంబరాలను  వదులుకొని వచ్చిన వాడికి నేనేమివ్వగలను…స్వచ్చమైన స్నేహం తప్ప.వాడితో కొంచెం సమయం గడపటం తప్ప. చిన్నగా నడవటం ప్రారంభించాం.అది కూడా వాడితో ఇంకొంచెం సేపు గడపాలని చిన్న ఆస వల్ల. మా ఇద్దరికీ మా వూరు తో ఎన్నో జ్ఞాపకాలు..ప్రతి వీది ప్రతి మలుపు ఏదో ఒక ఊహను తట్టి లేపుతాయి.అది ఇదీ మాట్లాడుకుంటూ మొత్తానికి బస్సు స్టాప్ చేరాము.
వాడికి ౪ గంటల బస్సు. అది దాటితే మల్లా ఇంకో గంట దాక బస్సు లేదు. ౩:౪౫ కి బస్సు స్టాండ్ చేరాము. కరెంటు బూకింగ్ లో టికెట్ తీస్కోని ప్లాట్ ఫారం మీద కొచ్చాము. మా మాటలు సమయా భావం చూసుకోలేదు. కాసేపటికి అర్ధం అయ్యింది, మేము మాట్లాడే విషయాల వెనుక కేవలం వాడితో ఇంకా సేపు గడపాలనే ఉద్దేశ్యమే ఉందని.ఒక వైపు వాడికి ఆలస్యం అవుతుందని తెలుస్తున్నా నేను ఆసక్తుడనయ్యాను.ఇంకో అర్ద గంట గడిచింది. అప్పుడే వెళ్తావా నేస్తం, మల్లా ఎప్పుడు కనపడతావో,నీ మాటలు వినే అదృష్టం నీతో గడిపే ఆ కాస్త సమయం మల్లా ఎప్పుడు దొరుకుతుందో..ఇదే భావం ఇద్దరిలో…నేనే ఆ ప్రవాహాన్ని ఆపాను.నాకు తెలుసు, తన వైఫ్ పిల్లలు తన గురుంచి ఎదురు చూస్తారని. సరే మరి ఉంటా అన్నానే కాని వాడి మొహం లో దోబూచులాడిన  భావం నన్నిక మాట్లడనీయ లేదు. వాడు వెంటనే సర్దుకున్నాడు. నాకని పించింది..నా మొహం లో కూడా అదే ఫీలింగ్ ఏమో..బస్సు వైపు భారం గా కదిలాడు. టాటా చెప్తు చెయ్యి పైకెత్తాను.  ఆలాగే సగం లో ఆగిపోయింది. 

మృతిలోన ముగిసినా చితి లో న రగిలినా కడతేరి పోనిదీ మధురాను బంధం
ఎద వీది పోనిది మమతాను రాగం…
ఎప్పుడో విన్న చిన్న కవిత చెవుల్లో మారు మోగింది…

లంచా తురానాం న భయం న లజ్జ….

సెప్టెంబర్ 26, 2010

నవంబర్ 21 ,2016.

౧౨ లాలూచి పథ్,కొత్త ఢిల్లీ.

సాముహిక లంచం క్రీడల ప్రారంభోత్సవం  నేడు..

Blocked Games Road.. No Entry… పక్కనే సిగ్న్ బోర్డ్ వేలాడుతుంది..ఆ రోడ్ కి.. సరిగ్గా క్రీడా ప్రాంగణానికి వెళ్ళాలంటే వేరే రోడ్ లో వెళ్ళాలి.కొంచెం దూరం అవుతుంది  ఆ దారి.ముందు నేను అదే దారి లో వెళ్దాం అనుకుంటే, నా దోస్త్ ఎవరో చెప్తే ఈ దారిని వచ్చాను. కాని, రోడ్ బ్లాక్ బోర్డ్ ఉంది …అప్పుడు చూద్దును కదా…ఈ రోడ్ లో బ్రంహాండ మైన రద్దీ..అందరూ ఇదే దారిలో క్రీడా ప్రాంగణానికి వెళ్తునారు. సరే నేను నా కార్ ని ఇదే రోడ్ లో కి తిప్పాను. బోర్డ్ తీయ్యటం మర్చి పోయారేమో…రోడ్ చివరలో అర్దమైంది అసలు సంగతి. అక్కడి ట్రాఫిక్ పోలీసు చక్కగా ప్రతి వాహనాన్ని ఆపి, పదో పరకో జేబులో వేస్కొని పంపిస్తున్నాడు. ఈ బోర్డ్ అతిక్రమించి నందుకేమో..పొద్దున్నే పెనాల్టి ఏంట్రా బాబు అనుకుంటూ నేను అతని పక్కనే ఆపి విండోస్ దించాను.గుట్కా నమిలి నమిలి, అదేదో రంగులో మారి పోయిన పళ్లన్నీ,నేనేదో డెంటిస్ట్ అన్నట్టు చూపిస్తూ..సౌ రూపాయే అన్నాడు..నేనిచ్చిన నోటు జేబులో వేస్కుని పోమ్మన్నట్టు చెయ్యి ఊపాడు. రసీదు ఇస్తాడేమో అని వెయిట్ చేస్తున్న నాకు అప్పుడర్దమైంది. అయ్యవారు ఇక్కడ మంచి లాభ సాటి వ్యాపారం నడుపుతున్నారని.

సరే కార్ పార్క్ చేసి మెయిన్ గేటు దగ్గరకు వచ్చాను.టికెట్స్ సొల్ద్ ఆఫ్..బోర్డ్ నన్ను వెక్కిరించింది. అయ్యో ఎలాగా అని చూస్తుంటే, వాడెవడో టికెట్ల కట్ట పట్టుకుని గోడ వార గనిలబడి ఉండటం.జనం వాడి మీద పడి, కొనటం చూసాను. దగ్గర కెళ్ళి అడిగాను. టికెట్టు  ౫౦౦౦. బేరం మొదలెట్టాను..వాడు నేనేదో వాడి జేబు కొట్టేసినట్టు మొహం పెట్టి, మేనేజర్ సాబ్ కోభి ఇసీమే ఖిలాన హాయ్ సాబ్..అన్నాడు.ఆహా..ఇది కదా లంచావతారం అంటే. టికెట్లు అన్ని బ్లాక్ లోనే అమ్ముతున్నారు.అందులో అందరు పదో పరకో పుచ్చు కుంటున్నారు. సరేలే అని ఆ డబ్బు వాడి చేతిలో కుక్కి ఎంట్రన్సు దగ్గరకి వచ్చాను. టికెట్టు తీస్కున్న వాడు అదేదో రహస్యం చెప్తున్నట్టు వంగి, ఆగే భైటన హై క్యా..౫౦౦ లగేగా అన్నాడు. ఓహో ఈ సౌలభ్యం కూడా ఉందా నాయనా..సరే..ఆ ౫౦౦ వాడి చేతిలో పెట్టాను. పక్కనే ఉన్న కుర్రాడిని నాతొ పాటు పంపాడు.నేను కొన్న టికెట్టు కన్నా ౧౦ లైన్లు ముందు ఒక సీట్ లో కూర్చో బెట్టాడు వాడు. ఆహ..ఇక్కడినుంచి బాగా కానీ పిస్తుంది. ఇప్పుడే మహా మహులంతా వేదిక నేక్కారు. ప్రదాని, రాష్ట్రపతి, వగైరా వగైరా…అయ్యవారు పెద్ద స్పీచ్ ఇవ్వడం ప్రారంబించారు.ఈ క్రీడలు ఇక్కడ జరపటం గొప్ప విషయం అని, ఏంటో కష్టపడి మన క్రీడా మంత్రి అంతర్జాతీయ మద్దత్తు తో వీటిని ఇక్కడకు తీస్కోచారని. అదేంటి, పొద్దున్న విన్న సి.యెన్.యెన్ లో అలా చెప్పారు. మనోళ్ళు అన్ని దేశాల ప్రతినిదుల్ని డబ్బుతో కొనేసి, ఈ క్రీడలను సంపాదించారని.పెద్దాయన చెప్తుంటే ఇదే నిజం అయి వుంటుంది. వెదవలు , మన గొప్పతనం చూసి వోర్వలేదు విదేశి మీడియా

అదేంటి, పెద్దాయన అలా వొరిగి పోతున్నాడు. అప్పుడు గమనించాను.ఒరిగి పోతుంది పెద్దాయన కాదు. సభ ప్రాంగణం అని.కుప్పకూలి పోయింది. కూర్చున్న వాళ్ళు కూర్చునాట్లే దిగబడి పోయారు. అటు ఇటు పరిగెత్తు తున్న సెక్యూరిటీ వాళ్ళు, అంతా గందర గోళం. మొత్తానికి జంబో సైజు రాజకీయ నాయకులని పైకి లేపడం సెక్యూరిటీ వాళ్ళ వాళ్ళ కూడా కావటం లేదు. ౧/౨ గంట నడిచిన తర్వాత,అమ్బులన్సు లో అందరిని పక్కనే ఉన్న హాస్పిటల్ కి తరలించారు. ఇంతలో ఆయన సైజు కి తగ్గట్టు జనం ముద్దు గా పిల్చుకునే ఖడ్గమృగం నాయకుడు ప్రారంబోత్సవం అయింది అనిపించాడు. లేట్ ది గేమ్స్ స్టార్ట్..

మొదటి పోటీ..౧౦౦ మీటర్ల పరుగు పందెం. మనోళ్ళు ఎప్పుడు విదేశాల్లో జరిగినప్పుడు గెలవని పందెం. ఈ సారి మన దేశం నిర్వహిస్తుందని ఈ కంపు గొట్టే క్రీడా గ్రామాని కి మేము రాము అని కొందరు,శాంతి బద్రతల సమస్య ఉందని మరి కొందరు మానేయడం తో ఈ సారైనా మనకు పతకం వస్తుందేమో. ప్రారంభం అయ్యింది. ౫౦ మీటర్లు మనోడు ఆ చుట్టూ పక్కల కనిపించాలా…కాని అదేంటో సినిమాలో హీరో పరిగెత్తు తుంటే మిగత వాళ్ళు మెల్లగా పరిగెత్తి నట్టు మనోడు పరిగెత్తు తున్నాడు అనేకంటే మిగతా వాళ్ళు మెల్లగా పరిగెత్తు తున్నారని పించింది. మొతానికి ఏది ఏమైనా మనోడు వెంట్రుక వాసి లో గెలుపొందాడు అండి. ఆహ..అప్పుడు చూడాలి..జనం కుర్చిలలో నుండి లేచి కుప్పి గంతులు గోలా..

అదీ ఇదీ కలిపి మద్యాన్నం ప్రాంతానికి జరిగిన అన్ని పోటీలలో మనోల్లదే గెలుపు.. అదేంటి చెప్మా..మిగతా దేశాల్లో పోటీలు జరిగినపుడు..గొప్పగా రాణించే విదేశీ క్రీడాకారులు మన దేశం లో యెందుకిలా..మన వాతావరణం సరి పడి ఉండదు..అంతే అయి వుంటుంది..

మిగతా స్టేడియం లలో మనోళ్ళు ఎలా ఆడుతున్నారో విందాం అని నా మొబైల్ లో రేడియో ఆన్ చేశా..సిగ్నల్ వెతుకుతుంటే వినపడ్డది బీ.బీ.సి. సరే మన గొప్పతనం వీల్లేమి చెప్పుకుంటూన్నారో విందాం అని వింటున్నా..అదేంటి. ౧౪ లంచావతారం రోడ్ లో ఉన్న మేహుల్ గాంధీ ఎనిమిదో నెల   కడుపులో ఉన్న యువనేత భావి భారత ప్రదాని  జీబెల్ గాంధీ పేరు పెట్టిన స్టేడియం లో రన్నింగ్ రేస్ మైదానం లో నీళ్ళు ఉండటం తో ౨ క్రీడాకారులు జారి పడ్డారని, నాసిరకం పోల్ విరగటం తో జారి పడ్డ పోల్వాల్ట్  క్రీడాకారుడి నడుము కూడా విరిగిందని..అవాకులు చెవాకులు…ఈ విదేశి మీడియా ఎప్పుడు ఇంతే..మన గొప్ప తనం చూసి కళ్ళలో నిప్పులు పోస్కుంటారు.

అంతలో డబ  డబ అని శబ్దం..అదేంటి మబ్బు లేకుండా ఉరుములు…పైకి చూసా…స్టేడియం కప్పు ఒక వైపుకు ఒరుగుతుంది.అబ్బే..అదేదో సెక్యూరిటీ చెక్ అయివుంటుంది.లేక పొతే మొన్న కట్టింది అప్పుడే కూల్తుందా…ఇంతలో నేన్ను కూర్చున్న వైపు కూడా శబ్దం వినిపించింది.పైకి చూద్దును కదా..

కళ్ళు తెరిచే టప్పటికి ఫ్యాన్ తిరుగుతుంది. ఎక్కడున్నాను నేను…ఏదో నొప్పి గా ఉండటం తో తడుము కొని చుస్కున్న..తలకు తల పాగా చుట్టినట్టు…అబ్బో ఇదేంటి…హాస్పిటల్ లో ఉన్నా  అని అర్ధం అయ్యింది…మెల్లగా లేచి రూం లోంచి బైటకు వచ్చా..

రిసెప్షన్ లో జనం అటు ఇటు పరిగెత్తు తున్నారు. మా ఆయన ఎక్కడ అని ఒకావిడ..మా అన్నగారు అని ఒకాయన…చాల మంది కి దెబ్బలు తగిలి నట్టున్నాయి.ఎవర్ని కదిలించిన అసలేం జరిగిందో ఎవరు చెప్పట్లే. ఈ హడావుడి నుంచి దూరం గా లాన్ లో కూర్చున్నాను. పేపర్ ఒకటి కొని అసలేమైందో అన్న ఉత్సుకత తో చదవటం మొదలెట్టా..నిన్న స్టేడియం కూలటం వాళ్ళ ౫౦౦ వందల మంది చని పొయ్యారని..౧౦౦౦౦ మంది గాయ పడ్డారని వార్త…నాసిరకం నిర్మాణాల వల్లే ఇదంతా జరిగిందని విదేశి మీడియా బోగట్ట..ఇదంతా మాములే అని ముక్య మంత్రి వివరణ. స్పోర్ట్స్ పేజిలో మనోళ్ళు ౧౦౦ కి ౯౦ పతకాలు గెలిచారని వార్త..కిందనే విదేశి పత్రికల శూల శోధన…విదేశీ క్రీదాకారులన్దర్నీ మన అధికారులు కోనేసారని..అందుకే మనకు ఇన్ని పతకాల పంట అని…

ఛీ ఈ విదేశి మీడియా ఎప్పుడు ఇంతే అని అన్ని పార్టీల సంయుక్త ప్రకటన…దీన్ని  బలపరుస్తూ..రాజధాని లో అక్కడక్కడా విదేశి మీడియా ఆఫీసుల మీద జోమ్రాస్ పార్టీ దాడులు…తిక్క కుదరాలి సన్నాసులకి….ఏదో ఆ పార్టీ ఈ పార్టీ ఇచ్చిన పదో పరకో పుచ్చుకొని స్వదేశి మీడియా లాగ  వాళ్ళు చెప్పింది చెప్పక..దేశాన్ని వుద్దరిద్దాం అని బయలు దేరితే ఇలాగే అవుతుంది.

వారం  రోజుల తర్వాత ఇంకో వార్తా చదివాను పేపర్లో. ముగింపు ఉత్సవాలలో ఆకాశం నుంచి పూలు చల్లుతున్న మొన్ననే క్రుష్య దేశం నుంచి  కొన్నబుగ్-౪౨౦ విమానం  పక్కనే ఉన్న పొలాల్లో కూలి పోయింది. పోనీలెండి మల్ల ఇంకో కాంట్రాక్టు పిలవచ్చు..మల్లా దానిపైన మన నీటి ఏనుగు  నాయకుడు ఇంతో అంతో ఎనకేసుకోవచ్చు…సర్వే జనా సుఖినో భవంతు..


వయ్య బాబోయ్…

ఆగస్ట్ 21, 2010
లిఫ్ట్ బటన్ నొక్కాను. పైనుంచి బీప్ శబ్దం వినపడుతుంది. లిఫ్ట్ వచ్చి ఆగింది. డోర్ తీస్కోని లోపలి కెల్లాను. సెల్లార్ బటన్ నొక్కాను.లిఫ్ట్ మెల్లగా కిందకు కదులుతుంది. ౨ ఫ్ల్లోర్ కిర్రు మన్న శబ్దం. బైట బోరునకురుస్తున్న వాన ఇంకా తగ్గినట్టు లేదు. ఒక పఫ్ కొడదామని కింద బడ్డి కొట్టు దగ్గరకు వెళ్తున్నాను. బైట మసక వెలుతురు లో ఒక రూపం. అస్పష్టం గా,మనిషి రూపం. నైట్ గౌన్ వేసుకున్న అమ్మాయి.ఇప్పుడే తల స్నానం చేసిందేమో, జుట్టు తుడుచు కోవడానికి బైట కొచ్చి నట్టుంది.  ౧ ఫ్లోర్ మెల్లగా కిందకు దిగుతుంది లిఫ్ట్.బైట ఎవరో కుడి వైపు నుండి ఎడమ వైపుకు వెళ్ళారు. నేను కొంచెం ఆశ్చర్య పోయ్యా. అదే అమ్మాయి, అదేమిటి ఇందాకే కదా ౨ ఫ్లోర్ లో ఉంది అనుకున్నా. ఏమన్నా ఆట ఆడుతుందా అంటే ఇంకెవరు లేరు. ఇంత రాత్రి పూట, ఇదేమి ఆనందం. గ్రౌండ్ ఫ్లోర్ మల్ల అదే అమ్మాయి. ఈ సారి నన్నే చూస్తుంది. తనకు నాకు మద్య ౨ డోర్లు. కటకటాల మద్య లోంచి కొంచెం బయపడుతూనే చూసా. సగం మొహం జుట్టు కప్పేసింది. మంచి కలర్ ఏమో చాల బాగా కనపడింది మిగతా బాగం. కాదు కలర్ కాదు అదేదో, రోగం వచ్చి పాలి పోయి నట్టు.తెల్లగా, అదేదో రకం గా. గుంటల్లో ఉన్నకళ్ళు, నా మొహం లో ఏదో వెతుకుతున్నట్టు. చెప్పొద్దూ, కొంచెం భయం  వేసింది. మరీ దగ్గర గా ఉన్నామేమో, ఆమె వంటి నుంచి అదేదో వాసన. ఏదో శవం నుంచి వస్తున్నట్టు. ఇంతలో కిర్రు మంటూ లిఫ్ట్ ఆగింది.
వాచ్ మాన్  కుక్క ఎప్పుడు ఆ  లిఫ్ట్ పక్కనే పడుకుంటుంది. తలుపు తీసుకొని బైటకి రాగానే, నా వైపు చూసింది. ఇంత వరకు అది అలా మొరగటం నేను వినలేదు. భయానకం గా అరుస్తూ పరిగెత్తి పోయింది. అది నన్ను కాదు నా వెనక చూస్తుందని అర్ధం అయ్యింది. ఎవరో వెనక నిలబడ్డట్టు అలికిడి.సెల్లార్ లో వాన దెబ్బ కి చల్లటి గాలి వీస్తున్నా, నా నుదుటి మీద చెమట చెంప మీదకు జారటం తెలుస్తూనే ఉంది. నా గుండె వేగం గా కొట్టు కుంటుంది. మెల్లగా తల పక్కకు తిప్పి చూసా. ఎవరు లేరు కాని అదేదో నీడ కదిలి నట్టు అనిపించింది. చప్పున ముందుకు తిరిగాను. సెల్లార్ లో చల్లటి గాలి మొహాన కొట్టింది.మెల్లగా బైటకు నడుస్తున్నాను. జోరున గాలి వాన. మా మియాపూర్ లో ఈ దెబ్బకి ఎప్పుడు కరెంట్ పోతుందో తెలీదు. కార్ల మద్య నుంచి నడుస్తున్నాను.దూరం లో వాచ్ మాన్ రాములు ఇల్లు. చిన్న లైట్ కనపడుతుంది. దాని పక్కనే, బడ్డి కొట్టు.
చుట్టు పక్కల వాళ్ళు అప్పుడప్పుడు అక్కడ అవి ఇవి కొనడానికి రావటం కద్దు.నేను వెళ్ళే టప్పటికి ఎవరో అమ్మాయి ఆ కొట్టు వాడితో మాట్లాడుతోంది.ఏదో కొంటుంది కామోసు. నేను సిగరెట్టు తీస్కోని డబ్బులివ్వ బోతూ ఎధాలాపం గా అటు చూసాను. అవే కళ్ళు. కాని ముక్కు లో నుంచి ఏదో ద్రవం కారు తోంది. చిక్కగా,రక్తమే అది…అప్పుడే కరెంట్ పోయిందేమో, కొట్టువాడు వెలిగించిన కొవ్వొత్తి గాలికి రెప రెప లాడుతుంది.ఆ వెలుతురూ లోంచి ముఖం మీద పడ్డ జుట్టు లోంచి లీల గా కాన పడుతుంది ఆమె మొహం.ఇందాక చూసినప్పుడు కళ్ళు ఉన్న ప్రాంతం లో అదే ఆకారం లో  తెల్లగా, ఉన్న కనుగుడ్లు నాలో భయాన్ని రేకెత్తించాయి.ఉన్నట్టుండి ఒక కంట్లోంచి వచ్చిన పేడ పురుగు చిన్నగా పాకి ఇంకో కంట్లో కి వెళ్ళింది.
బాబోయ్..చిన్నగా నా నోట్లోంచి వచ్చిన కేక అక్కడే ఆగి పోయింది. ఇంకేమన్నా కావాలా అన్ని కొట్టు వాడి మాటలతో ఈ లోకం లోకి వచ్చాను.వాడికి డబ్బులు ఇచ్చి ఇటు చూసేంతలో మాయ మైంది.ఆ చీకట్లో కళ్ళు మిటకరించి చూసాను. దూరం గా స్మశానం లో ఏదో నీడ కదిలి పోతుంది. మా అపార్ట్మెంట్ కి స్మశానానికి మద్య ఎత్తైన ప్రహరీ గోడ ఉంది. మనుష్యులు దూకే అవకాశం లేదు. ఆ ఆకారం అలా ఆగి, నా వైపు చూసినట్టు అనిపించింది. వన్ను లో వణుకు మొదలైంది. బాగా రాత్రి అయిందేమో, కొట్టు వాడు కొట్టు మూసేసి,బయలుదేరాడు. చుట్టు పక్కల నిర్మానుష్యం.భోరున వాన. గాలి. కరెంట్ పోవడం తో కన్ను పొడుచుకున్న కానరాని చీకటి. generator ఉన్నవాళ్ళ అపార్ట్మెంట్ లోంచి వెలుతురూ పడుతోంది.నెమ్మది గా మెట్ల వైపు నడిచాను.

గ్రౌండ్ ఫ్లోర్ దాటాక వినిపించింది. సన్నని ఏడుపు.కర్ణ కటోరంగా.చిన్నగా ప్రారంభమై,కాసేపటి తరవాత ఆగిపోతుంది. తెరలు తెరలు గా, నిదానం గా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాను.౧ ఫ్లోర్ మెట్ల మీద కుర్చుని ఉంది. ఆమె. అదే నైట్ గౌన్, కాని ఆమె కాళ్ళ దగ్గరనుంచి ఏదో కారి మెట్లమీద పారుతుంది. చిక్కటి రక్తం, అదే శవం వాసన. ఉన్నట్టుండి ధైర్యం పున్జుకున్నాను.వడి వడి గా ఆమె పక్కనుంచి పోదామని.ముంగాళ్ళ మీద కుర్చుని సన్నగా ఏడుస్తోంది. తల వొడిలో పెట్టుకోవడం తో ఏమి ముఖం కన పడట్లేదు. ఆమె కూర్చున్న మెట్టు దగ్గరకి రాగానే తలెత్తి చూసింది. అప్పుడు గమనించాను ఆమె పళ్ళు.నల్లగా గార పట్టి, నోట్లోంచి ఆకు పచ్చటి రంగులో…గబా గబా మేట్లేక్కబోయాను. ఆమె నన్ను వెంబడించింది. ఆమె ఆ మెట్ల మీద విచిత్రం గా పాకుతుంది. చేతులు ముందు మెట్ల మీద పెట్టి, పైకి పాకుతుంది చిన్న పిల్లల్లా. ఇంకో మెట్టు,  నా కాలు అందుకుంది.గట్టిగా పట్టి లాగింది.

నా పట్టు సడలింది. నేను జారి పోవడం నాకు తెలుస్తుంది.వెనక్కి చూసాను. చిత్రమైన శబ్దం చేస్తూ, ఆమె నా పైకి వస్తుంది. మెట్ల మీద పడి పోయాను. క్రమక్రమం గా ఆమె నా మీద కోస్తోంది. భయంకరమైన ఆమె మొహం నా మొహం మీదకు…

దిగ్గున లేచి కూర్చున్నాను. వళ్ళంతా తడిచి పోయింది. మంచం కింద పడి ఉన్నాను.చిన్నగా బాటిల్ అందుకుని మొత్తం తాగేశాను. ఓ…ఇదంతా కలా…బతికించావు దేవుడా…ఆనుకొని ఒకసారి గడియారం చూసాను. ౩:౦౦ AM  మల్లా చిన్నగా నిద్రకుపక్రమించాను.మా రూం వాళ్ళంతా, ఊళ్లకు వేల్లారేమో ఒక్కన్నే ఉన్నాను.

టింగ్ టింగ్ డోర్ బెల్.ఈ టైం లో ఎవరు…కొంపదీసి…బయ పడుతూనే,కీ హోల్ లోంచి చూసాను. అవే కళ్ళు…అదే మొహం…ఆశ గా కీ హోల్ ని చూస్తుంది…

(ఇప్పుడే చుసిన హారర్ సినిమా కి నా పైత్యం జోడించి 😉 )

మియాపూర్ కి గలియా….

ఆగస్ట్ 4, 2010
“*(*#(&*@(@*(@*(#@”    నా డ్రైవింగ్ ట్రైనేర్ నోట్లోంచి జాలు వారిన తిట్ల పురాణం. సన్నగా రివటల ఉంటాడు వెంకటేష్.మనిషికి మించిన కోపం వచ్చేస్తుంది తనకి, ఎవరైనా దారికి అడ్డం గా దూరినప్పుడు. పొద్దున్నే లేపెస్తాడు ౭ గంటలకల్లా, అదేదో కొంప మునిగినట్టు. అదీకూడా ౨ రింగుల మిస్సుడ్ కాల్ తో.కొత్తల్లో తెలియక లిఫ్ట్ చేసే వాడ్ని.మొన్నెప్పుడో చెప్పాడు, డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు ఇచ్చేది నెలకు ౫౦౦ అని , మొబైల్ బిల్లుకి. నాకు వాళ్ళిచ్చే దానికన్నా ఎక్కువోస్తున్దన్నా బిల్లు అని.అప్పట్నుంచి లిఫ్ట్ చెయ్యడం మానేసా. కాని, రోజుకో స్తలం లో నన్ను పిక్ చేసుకునే వాడు. ఒక రోజు పోలీసు స్టేషన్ ముందు ఐతే మరో రోజు బస్టాండ్ పక్కన, ఇంకో రోజు మియాపూర్ సర్కిల్ లో. ఈ బాధ పడలేక తను మిస్సుడ్ కాల్ ఇవ్వగానే, నేనే ఫోన్ చెయ్యడం మొదలెట్టా.

పని  మీద చాల శ్రద్ద,వెంకట్ కి.కార్ ని కూడా తన సొంతది గా చూసుకుంటాడు.ఎక్కువ స్పీడ్ పోనీయడు. ప్రతీది ఓపిక గ చెప్తాడు. ఆతను విసుగు పడ్డ గా చూడలేదు. నాతొ పాటు నేర్చుకోడాని కి  వచ్చే మార్వాడి ఆంటీ, పదే పదే క్లచ్ నొక్కకుండా, బ్రేక్ వేసినా,ఓపిగ్గా ఐస నహి ఆంటీజి అని చెప్పేవాడు.ఆమె లౌక్యం గా, గాడి తో రుక్ గయాన భాయి, మే వహి ట్రై కర్ రహి తి అనేస్తుంది.బొద్దు మీసాల తాతయ్య, ౨౪ గంటలు బబుల్ గం నమిలే పక్కింటి బాబి అందరు, మనోడి సహనానికి పరీక్ష పెట్టేవాళ్ళే. తాతయ్య అప్పుడప్పుడు కళ్ళజోడు మరిచి పొయ్యేవాడు. రోడ్ మీద దాక వచ్చి,మల్లా అపార్ట్మెంట్ దాక వెల్ల లేక, అబ్బే అవి చలవ జోల్లబ్బి, మరేం పర్లేదు అనేసేవాడు. అప్పుడు చూడాలి మన వెంకట్ పాట్లు. తాతయ్య  నడిపే టప్పుడు స్టీరింగ్ దాదాపు వెంకట్ చేతిలోనే ఉండేది.

వెంకట్  డ్రైవర్ పక్క సీట్ లో కూచుంటాడు. స్టీరింగ్ మన చేతిలో ఉన్నా, ఒక చేత్తో తనుకూడా పట్టుకునే ఉంటాడు.మన కాళ్ళ దగ్గర ఉన్నట్టే, తన దగ్గర కుడా, క్లాత్చ్,బ్రేకు, అక్సులరేటార్ ఉంటాయి. అంటే, మనం మిస్ ఐన చోట తను కూడా వాడొచ్చు అన్నమాట, ఇవి మూడు. ఒక సారి స్టీరింగ్ మనకు ఇచ్చాక, తను సౌంజ్ఞలు చేసే వాడు. చెయ్యి కుడి వైపు కు తిప్పితే కుడికి వెళ్ళాలి, ఎడమ వైపుకు తిప్పితే ఎడమకు.
మొన్నక సారి ముక్కు గోక్కున్నాడు వెంకట్. నాకేమి చెయ్యాలో తోచలేదు. ఏమి చెయ్యాలో తెలియక ఒక కొశ్చన్ మార్క్ మొహం పెట్టాను.వెంటనే అది గమనించి అదేమీ లేదులే అన్నట్టు ఒక నవ్వు నవ్వాడు.
ఇంతలో ఒక ౧౮ ఏళ్ళ కుర్రోడు బైక్ మీద జుయ్ అని పక్క నుంచి కట్ కొట్టుకొచ్చి,మా కార్ ముందు కొచ్చాడు.ఇక చూస్కోండి, మనోడికి కోపం ముంచు కొచ్చింది.*#ఉ*ఓ@&#*(^@($ అని ఏదో తిట్టాడు. ఈ హడావుడి లో మా మార్వాడి ఆంటీ బ్రేక్ మీద కాలు వేసి చాపాక్ మని నొక్కేసింది. ఇంకేముంది, మద్య దారి లో మన బండి ఛగ్ ఛగ్ మని ఆగి పోయింది. వెనక వచ్చే ౭ సీటర్ బొయ్య్ మని హారన్ కొట్టాడు. నిజం చెప్పాలంటే కొడుతూనే ఉన్నాడు.అదేదో చిన్న పిల్లోడి చేతికి హారన్ ఇచ్చి నట్టు. వెంకట్ వెనక సీట్ లో ఉన్న నన్ను, బబ్లు గాడ్ని దిగి దొబ్బమన్నాడు.( సరిగ్గా ఇలాగె చెప్పాడు) ఏమి చేస్తాం,దిగి తోస్తుంటే, దాని దుంప దెగ, కదిలి చావదె. వెంకట్ అదేదో పెద్ద కిటుకు కనిపెట్టి నట్టు, ఆంటీ జి బ్రేక్ సే పావ్ నికలో అని అరిచాడు.ఆంటీ తన దిన స్టైల్ లో మే భి వహి సోచ్ రహి తీ అని ఇకిలించింది.మొతానికి దాన్ని కదిలించే టప్పటికి యెన్.టీ.ఆర్, ఎం.జీ.ఆర్ దిగొచ్చారు.

నిజం చెప్పొద్దూ, ఈ మియాపూర్ రోడ్ల మీద నడిపినోడు, ప్రపంచం లో ఎక్కడైనా single హ్యాండ్ తో నడిపెయ్యోచ్చు.ఇక్కడ దాదాపు సర్కస్ చేసినట్టే.ఎవడు ఎప్పుడు ఎక్కడనుంచి వూడి పడతాడో తెలియదు.మొన్నకసారి, ఒక స్కూల్ పిల్లోడు భుజాలకు బాగ్ తగిలించు కొని సైకిల్ తొక్కుకుంటూ మాకు అడ్డం, వచ్చాడు. వాడికన్నా ఒక ౨-౩ రెట్లు ఎక్కువ బరువు ఉంటుందేమో ఆ బాగ్.వెనక్కు ఒంగి పోయాడు, అంత లోనే స్కూల్ టైం అయ్యిందేమో, హడావుడి గా తొక్కుతున్నాడు.ఇంతలో మరో బైక్ బాద్ష వయ్యారం గా కట్ కొట్టి మమ్మల్ని ఓవర్ టేకు చేసారు. మరో బామ్మ గారు కూరగాయల కవర్ పట్టుకొని అటు చూడకుండా, నా దారి రహ దారి అన్నట్టు మా కార్ కు అడ్డం గా వచ్చేసింది.ఇంకా జుయి మని మన కార్ ని దాదాపు ముద్దెట్టుకుంటూ వెళ్ళే ౭ సీటర్ ఆటోలు, సిటీ బస్సులు సరే సరి.

ఇంకా చూస్కో నా సామి రంగ అడుగడుక్కి, బ్రేక్ వేస్కోడం, గేరు మార్చుకోవడం, సరిగ్గా అది కార్లోనే  వీడియో తీస్తే, పిచ్చోళ్ళు కారు నడుపుతున్నట్టే ఉంటుంది.మద్య మద్యలో , జన్మ మెత్తితిరా కారు నడిపితిరా అని పాడాలనిపిస్తుంది మరి ఏమనుకున్నారు మియాపూర్ కి గలియా అంటే…

నిన్న..నేడు…

జూలై 18, 2010
నిన్న పొద్దున్నే లేవగానే, మళ్ళీ తెల్లారిందా అన్న భావం వచ్చేది.మల్లా అదే దరిద్రగొట్టు ఆఫీసు, అవే తొక్కలో పనులు……ఏదో రెడీ అయ్యాం అనిపించి రోడ్డు మీద పడితే, ఆఫీసు టైం లో
ట్రాఫిక్ సంగతి చెప్పేదేముంది…హాయి గా కార్లో పోదాం అంటే,పెట్రోల్ ధర ఆకసాన్నంటుతుంది. ఆ పెద్దాయన్ని గడ్డం లాగి, వీపు మీద నాలుగు గుభి,గుభి మని కుమ్మాలని పిస్తుంది. సరే,ఏ షేర్ ఆటో లోనో కూలబడితే, మన అదృష్టానికి తోడూ,ఎవరో మగానుభావుడు(మా తమిళ కొలీగు ఇలాగే అంటాడు)  అదే టైం కి ఎక్కడికో బయలుదేరతాడు. వాడి కోసం, మన అటు ౪ కి.మీ. ఇటు నాలుగు కీ.మీ ట్రాఫిక్ ఆపేస్తారు. ఆఫీసు కెళ్ళే వాళ్ళ బాధలు పట్టవా…అయినా,కాస్త ఆఫీసు టైం తర్వాత బయలు దేరచ్చు కదా. ఆ కార్లోంచి బైటకి లాగి బుర్ర రామ కీర్తన పాడిస్తేనా…నా సామి రంగా..ఆయన వల్ల  ౧/౨ గంట లేటు….ఆఫీసు భవనం చూడగానే మల్లా వచ్చేసామా, ఏదైనా సునామి వచ్చి ఇదెందుకు కొట్టక పోదురా భగవంతుడా,  ఎదుట మా మానేజరు, గుడ్ మార్నింగ్ చెప్తే, ఒక సగం నవ్వు నవ్వారు. లేటుగా వచ్చావు అని చెప్పడమేమో…ఆ నవ్వు భావమేమి మల్లిఖార్జునా….

ఇక పని, నా డెస్క్ కొన్నేళ్లుగా ఎవరు క్లీన్ చెయ్యలేదేమో, ఇలాంటి చోట పని చేస్తే ఎలర్జీలు ఖాయం..ఇక సిస్టం ఆన్ చెయ్యగానే, పని పని పని…ఎప్పటికి తరగని పని..ఆన్ సైటు  వాడికి మనం పంపినదేమి నచ్చదు..ఇలా కాకపొతే అలా అలా కాకపొతే ఇంకో లా అని, వీడి దుంపతెగ.. రోజుకో తొక్కలో కొత్త పని, రోజుకో ఫార్మాటు….మల్లి చేసి, తిప్పి తిప్పి చేసి, అదే చేసి..అసంతృప్తి ముందు పుట్టి తర్వాత వీడు పుట్టాడేమో…ఇక మన వాళ్ళ సంగతి…మహా సీనియర్ ఒకాయన..ఉలకడు..పలకడు..బంగారం షాప్ పక్కన మురుగు కాలవలో బగారం రజను వెతికే వాడిలా, ౨౪ గంటలు ఆ మోనిటర్ లో మొహం పట్టుకుని ఉంటాడు..ఏదన్నా సందేహం వచ్చి అడిగితె, ఇది కూడా తెలియదా అన్నట్టు చూసి, నేను బిజీ రేపు డిస్కస్ చేద్దాం అంటాడు…ఆ రేపు ఎన్ని సినిమాల్లో రేపులైపోయినా రాదు..ఇంకా మన కింద వాళ్ళ సంగతి…వాడు సీట్ లో కన్నా, కాంటీన్ లో ఉప్పర మీటింగుల్లో ఎక్కువ పని చేస్తాడు…ఇలాంటి వాడి చేత పని  చేఇంచ దానికి బిన్ లాడెన్ రావాలేమో… ఈ కంపెనీ ని దేవుడే కాపాడాలి…ఇక మా మీటింగులు…వాళ్ళు అడిగే ప్రశ్నలకి, ఈ జీతానికి ఇంతే పని అని గట్టి గా అరవాలనిపిస్తుంది..

ఇంకా నేడు..కొంచెం రెఫ్రెషింగ్ గా అనిపించింది..పొద్దున్న లేవగానే…ఏదో తెలియని ఉత్సాహం…గభాలున రెడీ అయ్యి, బయలు  దేరాను ఒక అరగంట ముందే…అదే కలిసొచ్చింది..కరెక్ట్ గా టైం కి ఆఫీసు చేరాను..నిన్న వాన పడ్డదేమో…దానిదెబ్బకి, బాగా క్లీన్ అయి పోయి, ఇప్పటి ఎండ కాంతి లో మిల మిలా మెరిసిపోతుంది..మా ఆఫీసు భవనం…ఎవడు కట్టాడో కాని మంచి అభిరుచి…..

మా మానేజరు..నేను గుడ్ మార్నింగ్ చెప్పినా తల పైకేత్తలేదు…బిజీ గా ఉన్నాడేమో..ఆన్ సైట్ వాడు,కొత్త చెత్త పని పంపాడు…పాపం దేశం కాని దేశం లో ఆ తెల్లోళ్ళ మద్య యెంత కష్టపడుతున్నాడో బిడ్డ…నా జేబులో కర్చీఫ్ తీసి మోనిటర్ ని సుబ్రం గా తుడిచాను. నా స్క్రీన్ మద్య లో ఎప్పుడూ కాన పడే పెద్ద చుక్క..మోనిటర్ ప్రాబ్లం వల్ల కాదని అప్పుడే తెలిసింది..నా పక్కన సీనియర్ ఏదో అడిగితె మళ్ళా రేపన్నాడు..ఆ రేపు కోసం ఎదురు చూడాల్సిందే..పాపం చాల కిందా మీద పడుతుంటాడు..ఆయనకీ, టైం ఉండాలి కదా..ఇక మా కింద వాడి ని కాంటీన్ లోనే పట్టుకుని, ఏమి చెయ్యల్లో బాగా డిస్కస్ చేశా…ఆ చిప్స్ కరకర లో ఏమి విన్నాడో..ఏమో…అయినా కొత్త వాడు కదా..కొంచెం టైం పడుతుంది…వీడు జనజీవన స్రవంతి లో కలవడానికి…

వీడి సిగ తరగా…వీడికేం పొయ్యేకాలం వచ్చింది..ఇందాకటి దాక బానే ఉన్నాడు గా అందర్నీ తిట్టు కుంటూ…అనుకుంటున్నారా…

ఈ రోజే మాకు ఇంక్రిమెంట్ వచ్చింది లెండి…

టాల్ స్టాయ్ -కోసక్కులు

జూలై 13, 2010
మొన్న పుస్తకాలు సర్దుతుంటే కనపడ్డది ఆ పుస్తకం.చిన్నదే  ఐన పొందికైన అట్ట.చూడగానే ఆకర్షనీయం గా, పోనిలే ఒకసారి చదువుదూ అన్నట్టు  ఉంటుంది. పైన కోసక్కులు అన్న పేరు,మధ్యలో చేతులు కట్టుకుని చదువు తావాలేదా అన్నట్టు  చూస్తున్న బరివి గడ్డం తాతయ్య.కింద ఆయన పేరు..ఇంకెవరు నా అల్ టైం ఫేవరేట్ టాల్ స్టాయ్.
 
రష్యా పుస్తకాలతో నా పరిచయం నా చిన్నప్పటిది.మా నాన్న కమ్యునిస్టు భావాలను గౌరవించేవారు.ఆ భావ జాలానికి అనుగుణంగా ఎప్పుడైనా రష్యా బుక్ exhibition వస్తే నాన్న రక రకాల పుస్తకాలు తెచ్చేవారు.వాటిలో చిన్న పిల్లల కదల పుస్తకాల నుండి, రష్యా చరిత్ర, విప్లవం మొదలైనవి కూడా ఉండేవి. అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చే మా మధు బావ గాడికి నాకు ఈ పుస్తకాల దగ్గర డిష్యుం డిష్యుం జరిగేది.
 
ఇక కోసక్కుల విషయాని కొస్తే, నేను డిగ్రీ లో ఉన్నప్పుడు అనుకుంటా..ఒక బుక్ exhibition  లో చూసాను. అప్పటికి సోవిఎట్ విచ్చిన్న మై పోయింది.అలాంటి పుస్తకాలు రావటం ఆగిపోయింది.ఏదో పాత పుస్తకాల వరసలో కాన పడ్డ టాల్ స్టాయ్ తాత నన్ను పలకరించాడు.వార్ అండ్ పీసు లాంటి నవలలు రాసాడని తెలుసు కాబట్టి గబాల్న కొనేసాను.అదే నేను ఆయన పెద్ద అభిమాని అవటానికి ప్రారంభం అవుతుందని నాకు తెలియదు.
ఈ కదా ఒక చిన్న లవ్ స్టొరీ. ఒలేనిన్ అనే మన హీరో, మంచి డబ్బున్న కుటుంబం లో పుడతాడు.మాస్కో లో బాగా అప్పులు చేసి, ఎవరికి మొహం చూపించడం ఇష్టం లేక ఆ అప్పులు తీర్చడానికైన అన్నట్టు అర్మి లో చేరతాడు. కావాలని ఆ వూరు నుంచి దూరం గా పోదామని దేశ పోలిమేరల్లో పోస్టింగ్ తీసుకుంటాడు. వెళ్తూ వెళ్తూ తన దోస్తులకు చిన్న పార్టీ ఇస్తాడు.ఈ సందర్భం లో ఆ సన్నివేశాలు, బార్ లో దృశ్యాలు,బైట గుర్రబ్బండి వాడి పాట్లు,ఒలేనిన్ పూర్వ పరిచయాల్లో తలుక్కున మెరిసే మాస్కో అందగత్తెల గురించి రచయిత వర్ణన కళ్ళకు కడుతుంది.ఇక ప్రయాణం పొడుగునా అతని మనఃస్తితి,దోబూచులాడే పాత సంగతులు, రా రమ్మని పిలిచే పర్వత శ్రేణులు, విశాల మైన దేశము లో పోలి మేరలదాక సాగే ప్రయాణం చదవదగ్గవే.
 
 
ఇక అసలు కధ విషయాని కొస్తే, మన హీరో ఒక చిన్న కుగ్రామం లో పడతాడు. అక్కడి అనాగరిక జాతి పేరు కోసక్కులు. పొలిమేరలు రక్షించే సైన్యం లో వాళ్ళ జనాభా ఎక్కువే. అక్కడి జనం, వాళ్ళ ఆచార వ్యవహారాలు, ఆర్దిక తారతమ్యాలు, రచయిత కళ్ళకు కట్టిస్తాడు. హీరో ఉన్న చిన్న ఇల్లు అక్కడి గ్రామ పెద్దది. ఆయన, ఆయన పెళ్ళాం మన హీరో ని చూసి ముచ్చట పడతారు. మన హీరో వాళ్ళ అమ్మాయి ని చూసి ప్రేమ లో పడతాడు. మొరటుగా, పొలాల్లో పనిచేసి ఆ పిల్ల పొగరు, బింకం మన హీరో గారికి బాగా నచ్చేస్తాయి. ఆ పల్లెటూళ్ళో మంచి కాలక్షేపం ఒరేష్కా.ఎప్పుడో సైన్యం లో పనిచేసినా ఆ ముసలాయనకు నవల పోడుగూతున తాగటం వేటాడటం తెప్ప వేరే పని ఉన్నట్టుకన పడదు. మన హీరో భావాలు పసిగట్టి, ప్రోత్సహిస్తాడు,మంచి supporting  charector అన్నమాట.ఇక హీరోఇన్ విషయానికొస్తే ఆ పిల్ల కు లూక అనేవాడి మీద మనసు. ఆ వయసుకు తగ్గ చిలిపితనం తో ఒలేనిన్ ని కొన్ని సార్లు ప్రోత్సహిస్తున్నట్టు కనపడ్డా,ఎక్కడా మనసు పడ్డట్టు అనిపించదు.
 
ఇవన్ని అర్ధం అయ్యాక మన హీరో గారు డల్ ఐపోతారు.మనసులోనే తన ప్రేమ ను దాచుకుంటాడు. ఇవన్ని మరిచి పోవటానికి మరింత తాగుడు కి , ఎరోష్క తో వేట కి బైలు దేరతాడు. కాని మద్యలో దారి తప్పుతాడు.నిర్జన మైన అడవి లో ఎటు పోవాలో తెలియని స్తితి లో తన పరిస్తితి గురించి ఆలోచిస్తాడు.
ఇక్కడ, ౨-౩ పేజీలు చాలండి, ఒక రచయిత యెంత విషయం ఉన్నవాడో చెప్పటానికి.టాల్ స్టాయ్ ఆ అడవి ని వర్ణించే విధానం,ఆ ప్రపంచం లో ఆ నిర్జనారణ్యం లో అతను యెంత చిన్న వస్తువో అన్న భావం హీరో కు స్పురిస్తుంది.తన బాధ క్షణభంగురం అని, జీవితం చాల విశాల మైన దాని, అతనికి జ్ఞానోదయం అవుతుంది.ఇలాంటి వర్ణన , ఆ రచన లో  పట్టు చదవాల్సిందే కాని వర్ణించలేము. ఆ పేజీలు నేను ఎన్ని సార్లు చదివానో లెక్కలేదు.
 
ఇక ఉపసంహారాని కొస్తే, ఒలేనిన్, ఆ ప్రాంతాన్ని ఒదిలి దూరం గా పోతాడు. అది వ్రుతిరీత్యా అని మిగిలిన పాత్రలు నమ్మినా, కేవలం హీరొయిన్ నుంచి దూరం గ వెళ్ళే ప్రయత్నం అని మనకు తెలుస్తూనే ఉంటుంది. మల్లా ప్రయాణం మొదలవుతుంది. మల్లా అవే దారులు, అవే దృశ్యాలు, అవే పర్వత శ్రేణులు…
 
జీవితం గొప్పతనం చాటి చెప్పే ఈ నవల, బాధలన్ని చిన్నవే అంటుంది. టాల్ స్టాయ్ సొంత కధ అని ముందు మాటలో ఎవరో అన్నారు. అదీ నిజమే అని పిస్తుంది. ఎందుకంటె, ఈ నవల ఒక దృశ్య కావ్యం. సొంత అనుభావాలుంటే కాని, ఎవరు అలా రాయలేరేమో….

జరా బద్రం అన్నో…

జూలై 3, 2010
చిన్నప్పుడు చదుకున్న పంచతంత్రం కధ.ఒక వూళ్ళో ఒక సన్యాసి. ఆయన ఆ ఇల్లు ఈ ఇల్లు తిరిగి అడుక్కోచ్చిన దంతా ఒక జోలె లో పెట్టి, చిలక్కొయ్య కి తగిలించే వాడట. అదే ఇంట్లో ఒక ఎలకల గుంపు. హిరణ్యకుడనే వాడు దానికి రాజు. వాడు చిన్న చిన్న గా ఆ జోలె లో పదార్ధాలు కాజేయటం నేర్చుకున్నాడు. ఆ సన్యాసి అదేమీ పట్టించు కోలేదు. ఇక ఈ ఎలకల ఆగడాలు ఎక్కువయ్యాయి.అవే ఆ ఇంటి యజమానుల్లా ప్రవర్తించడం మొదలెట్టాయి.తిన్నంత తిని మిగతాది చుట్టూ చల్లి, జోలె కు కన్నాలు పెట్టి, నానా రభస చేసాయి.
అల జరుగుతుండగా, ఒక నాడు ఈ సన్యాసి స్నేహితుడొకడు అతన్ని చూడడానికి వస్తాడు. వీనితో మాట్లాడుతున్నా, మన సన్యాసి ద్యాసంతా ఆ జోలె మీదే ఉండింది. ఆ స్నేహితుడది గమనించి, విషయం కనుక్కుంటాడు. ఏదో మాయో పాయం చేసి, ఆ జోలె ఎలుకలకు అందకుండా చేస్తాడు. ఆ దెబ్బ కి ఎలుకల రాజు కి అతని పరివారానికి తిండి దొరక్క, పలాయనం చిత్తగిస్తారు. నిన్నా ఈరోజు జరిగిన జరుగుతున్న,సంఘటనలు  చూస్తుంటే, నాకు ఈ కధ గుర్తుకొచ్చింది.
పేనుకి పెత్తనం ఇచ్చినట్టు, ఇన్నాళ్ళు ఈ జనం మన ఘనత వహించిన నాయకుల ఉన్మత్త ప్రేలాపనలు ఊక దంపుల్లు విని విని విసిగెత్తి పోయి వున్నా తరుణం లో ఈ.సి నిజం గా శభాష్ ఐన పని చేస్తుంది. రౌతు చేతగాని వాడితే గుర్రం ౩ కాళ్ళ తో పరిగెత్తి ఇంకేదో భాగం తో సకిలించిందని మనోళ్ళు ఊరకే అనలేదు. మైకు కాన పడగానే అదేదో పిచ్చి కుక్క కరిసినట్టు వాళ్ళను వీళ్ళను వీలయితే అందర్నీ ఎసేస్తాం కుమ్మేస్తాం అనే వాళ్ళకు ఇది చెంపదెబ్బ. డబ్బు మద్యం వెదజల్లి ఏదో గెలిచాం అనిపించుకొని, చట్ట సభల్లో కేవలం ప్రమాణ స్వీకారం చెయ్యడానికే వెళ్లి, మల్ల ౫ ఏళ్ళు జనాలకు కనపడని వీళ్ళు ఎక్కడుంటే ఏముంది లెండి. ప్రజాస్వామ్యానికేమీ నష్టం కలగదు.కాని జనం కొంత కామెడీ మిస్ అవుతారు అంతే….

ఇట్లు మీ శ్రేయోభిలాషి, రోశయ్య నగర్.

జూన్ 19, 2010

అదేనండి మా ఒంగోలు.రేపో మాపో మన ప్రియతమ ము.మ మీద పైవాల్లకు దయ కలిగితే, ప్రకాశం రోశయ్య జిల్లా అయి పోవచ్చు.ఒంగోలు ఏ రోశయ్య నగరో, రోసి వాడో అయి పోవచ్చు.ఏమీ, కడప వై.ఎస్.ఆర్ జిల్లా అయి నప్పుడు ఇదెందుకుకాదు.భేషుగ్గా అవ్వచ్చు.అయినా , ఈ లెక్కన కొన్నాళ్ళకు విశాఖ తిక్కరామ జిల్లా అవ్వచ్చు,విజయనగరం బొత్స జిల్లా అవ్వచ్చు.వీల్లెమన్న చిన్న చితక నాయకులా సమస్యే లేదు.ఐన ఇప్పుడు చిరంజీవి కూడా మనోడే కదా, కృష్ణ జిల్లా చిరు జిల్లా చేస్తే పోలా.

ఎన్నో శతాబ్దాలు గా ఏర్పడ్డ జిల్లాల పేర్లు, ఆ ప్రాంత చరిత్ర ను ప్రతిబింబిస్తాయి.వంగవోలు ఒంగోలు అయినట్టే, దేవుని గడప కడప అన్నటు. కోల్కత్త పేరు మార్చినా, ముంబై పేరు మార్చినా నాకు నచ్చలేదు.ఎందుకంటె, రకరకాల కారణాలవల్ల ప్రాంతాల పేర్లు మార్పుకు లోను కావటం సహజం.కనట కెనడా అయినట్టు.మరి దానిని మల్ల కనట అనటం కొంచెం ఇబ్బందికరము, అనవసరము కూడా. మరి ఆ విషయమే అలావుంటే, మనం ఇంకొంచెం ముందడుగేసాము. పురాతన ప్రాంతాల పేర్లు మార్చి, మనోల్ల పేర్లు పెట్టుకుంటూ పొతే కొన్నాలకు ఒక విజయవాడ మిగలదు ఒక అమరావతి  మిగలదు.

మాయావతి బొమ్మలు పెట్టుకుందని నసిగే ముందు మనమేమి చేస్తున్నామో పునరావలోకనం చేసుకుంటే మంచిది.ఈ పేరు మార్పు వల్ల, ఎవరికి లాభం.ఒక్క కొత్త ఉద్యోగమైన పుడుతుందా.ఏమైనా వీసమెత్తు అభివృద్ధి జరిగిందా.బొమ్మలు పెట్టి పేర్లు మార్చి మనం సాదించే దేమిటో. రోడ్డు మీద ట్రాఫ్ఫిక్ సమస్యలు సృష్టించడం తప్ప.మన చరిత్ర మనమే మరిచి పోవడం తప్ప.అయినా ఈ నాటి నాయకులు ఇంకొక ఎన్నికల తర్వాత జనాలకు గుర్తుంటార అనేది వంద కోట్ల ప్రశ్న.అలాంటప్పుడు వందల ఏళ్ళ నుంచి వస్తున్న పేర్లని మార్చడం అవసరమా?? ఈ నాటి నాయకులలో  ఏ ఒక్కరికి అంత విషయం లేదు అనేది నిర్వివాదాంశం.

నా భయం ఏమి టంటే, మన పురాతన పార్టీ లో ముసలోల్లకేమి కొదవ లేదు.రేపో ఎల్లుండో ఎవరైనా బాల్చి తన్నేస్తే, ఈ సారి ఏ జిల్లాకు మూడుతుందో

మా ఇంట్లో పావురాలు

జూన్ 4, 2010

 ఒక రోజు ఉదయం.బాల్కనీ లో ఏదో శబ్దం అయినట్టుంటే వెళ్లి చూసాను. పావురం ఒకటి మా బాల్కనీ లో గూడు కడుతుంది.ఒక పుల్ల అక్కడ పెట్టి మళ్ళీ తుర్రున యెగిరి పోయింది.మల్ల కొంచెం సేపటికి ఎక్కడి నుంచో ఇంకో పుల్ల పట్టు కొచ్చింది.వాటినన్నిటిని, పద్దతి గా అమరుస్తుంది. మద్య మద్య లో నీకేం పని ఇక్కడ అన్నట్టు నన్నో చూపు చూస్తుంది.ఆఫీసు కి టైం కావటం తో దాన్ని అల్లా వదిలి బైటి కొచ్చాను. నాకు రొజూ బాల్కానీ లో కూర్చొని పేపర్ చదవటం అలవాటు కావటం వల్ల రొజూ ఆ పావురాల జంటని పరిశీలిస్తూ వచ్చాను.౨-౩ రోజుల తర్వాత గూడు చక్కగా అమరింది. ఆడ పావురం రెండు చిన్ని చిన్ని గుడ్లు పెట్టి,పొందిక గా వాటిపై కూర్చుంది.ఆహారం వ్యవహారం మగ పావురం పని ఏమో, అది ఇక్కడా అక్కడా తిరుగుతుందేమో.హత విధీ, పావురాల్లో కూడా ఇదే తంతా అనిపించింది. 🙂

రెండు పావురాలు ఎంతో అందం గా ఉన్నాయి కదా అనుకుంటూ ఎందుకో నేల వైపు చూసాను.రామ,రామ మా ఇంటి వోనరు ఆ దృశ్యం చూసి వుంటే, బాల్కనీ చువ్వలు వంచుకుని మూడో అంతస్తు నుంచి దూకేస్తాడేమో అనిపించింది. ఎంతో ముచ్చట పడి వేయించుకున్న తెల్లని టైల్సు మీద, పావురాలు బాత్రూం ఇత్యాదివి కట్టుకున్నట్టు లేదు తమ ఇంట్లో.పాపం కదా కొత్త జంట అని నేనే కొంచెం శ్రమదానం చేసి శుబ్రం చేసాను.
ఇలా రొజూ నడిచి పోతుంది. కొన్ని రోజుల తర్వాత, పావురాలు బాల్కనీ మొత్తం మాదే అన్నట్టు ప్రవర్తించడం మొదలెట్టాయి. ఏదో ఒక మూల పేపర్ చదువుకుంటున్న నన్ను మొదట్లో గుడ్లు ఎట్టు కేల్లెవాడిలా చూసేది ఆడ పావురం. వాటి భాష లో కొంచెం ఘాటు గానే తిడుతున్నట్టు అప్పుడప్పుడు అనుమానం కలిగేది.కొన్నాళ్ళ తర్వాత, బాల్కనీ డోర్ తియ్యం గాల్నే మగపావురం థిస్ ల్యాండ్ బెలొంగ్స్ టూ అస్ అన్నట్టు మీద మీద కోచ్చేది.మా స్నేహితుడోకాయన చల్ల గాలి కోసం తలుపు తీసాడో లేదో ఆయన మొహం మీద పికాసో బొమ్మ వేసినంత పని చేసింది. అదే చివరాఖరు సారి, మల్ల ఆ బాల్కనీ తలుపు తియ్యలేదు కొన్ని రోజులు. ల్యాండ్ వోనెర్ మీద ఆక్రమణ దారుని దురాక్రమణ లా పావురాలు మా బాల్కనీ ఆక్రమించేశాయి. నేనే అప్పుడప్పుడు, తలుపు కొంచెం తీసి దొంగ లా చూస్తూ ఉండేవాడిని.మగ పావురం బైటి కేల్లిందని నిర్దారించు కున్నాక, అప్పుడప్పుడు శుబ్రత పరిశుబ్రత కార్యక్రమం చేపట్టేవాడిని.
ఒక రోజు ఉదయం, జాగింగ్ కెళ్ళి వచ్చేటప్పటికి పావురాల కూతల్లో తేడ వినిపించింది. రెండు కన్నా ఎక్కువే ఉన్నాయి, పొద్దున్నే కిట్టి పార్టీ ఏమన్నా పెట్టాయ అనుకుంటూ,తలుపు సందు లోంచి తొంగి చూసాను.చిన్ని చిన్ని పావురాలు రెండు వాళ్ల అమ్మ దగ్గర ఏదో తింటూ అరుస్తున్నాయి. ఒకటి నల్లది ఒకటి కొంచెం తెల్లది. ఆడది మొగది అనాలేమో.యెంత ముద్దు గా ఉన్నాయో, ఒకసారి ఎత్తు కుందాం అని బైట పడ్డ అడుగు, తెలుగు సినిమా చివర్లో హీరో విలన్ ని చూసి నట్టు మగ పావురం చూస్తుండటం తో ఆగిపోయింది. ఇప్పుడు ఈ దిశ్కుం దిశ్కుం ఎందుకు లే అని మల్ల లోపలి కెల్లాను, తలుపు మెల్లగా మూసి.
చెప్పద్దూ, భలే ఆనందం వేసింది. బాల్కనీ ఆక్రమించినందుకు, మీదు మిక్కిలి కంపు చేసినందుకు, దాన్ని శుబ్రం చేసినందుకు తెగ తిట్టుకుంటూ ఉండే వాడిని. అదంతా  బుజ్జి  తెల్ల పావురాన్ని చూసే టప్పటికి హుష్ కాకి సారీ హుష్ పావురం అని యెగిరి పోయింది. ఇంకో ఆనందం ఏమిటి అంటే, ఎలాగు పిల్లలు పుట్టాయి కదా, బాల్కనీ ఖాళి చేస్తాయి లే అని.కొన్ని రోజులు ఓపిక పడదాం చిన్న పిల్లలు ఎలా వెళ్తాయి అని నన్ను నేను సమర్దిన్చుకున్నాను. సరే, కొన్నాళ్ళు ఇలానే గడుపుదాం అని. కాని, రాను రాను పరిస్తితి అద్వాన్నం అయింది.పెద్ద చిన్న పని కట్టుకుని బాల్కనీ అంతా ఆక్రమించి ఇంకెందుకు లెండి…కడుపు చించు కుంటే ఫాంట్ మీద పడుతుంది.
మా బుజ్జి పావురాలు పెద్దవి అయ్యాయి.కొంచెం కొంచెం ఎగరటం ప్రాక్టిస్ చేస్తున్నాయి.ఆహా,కొంచెం ఎగరటం, మల్లా బాల్కనీ లోకి రావటం.తల్లి కావాలని దాన్ని నెట్టేస్తుంది.చిన్న పిల్లలేమో భయం భయం గా రెక్కలు ఆడించి మల్లా వెనక్కోచ్చేస్తున్నాయి. నా అభిమాన తెల్ల పావురం, మాంచి దూరం ఎగురుతుంది. శభాష్ అనుకున్నాను.అలా యెగిరి యెగిరి ఎల్లి పోండి, పిల్లల్లారా.మళ్ళా రాకండి అని అత్మాశరతుడు లోపలెక్కడో అరుస్తున్నాడు.తదాస్తు.
ప్రాజెక్ట్ పని మీద ౩ వారాలు బెంగుళూరు వెళ్ళటంతో, మా పావురాలేమైనవో తెలుసుకోలేక పోయాను.తిరిగి వచ్చి తలుపుతీస్తుంటే అనిపించింది. ఆహా, ఈ పాటికి బాల్కనీ ఖాలీ అయిపోయి ఉంటుంది కదా.మల్లా ఒక .౫ గంట మనది కాదు అనుకుంటే, హ్యాపీ గా బాల్కనీ లో కాలు మీద కాలేసుకుని, నోట్లో వేలేసుకుని, మాంచి కాఫీ తాగుతూ, పేపర్ చదువుకోవచ్చు అనుకున్నాను.అదే మూడ్ లో బాల్కనీ తలుపు తీసాను.బాబోయ్, పెద్ద పావురం ఒకటి నా ముహం మీద మాంచి బొమ్మ గీస్తాను అని బయలుదేరింది. మనకి మాంచి ప్రాక్టిస్ కదా, కబుక్కున తపుపేసి,కాసేపు దాన్నే అనుకుని నిలబడ్డాను.రేప్ సీన్ లో హీరోయిన్ విలన్ ని బైటకి తోసి, తలుపు గట్టి గా పట్టుకున్నట్టు. ఇదెలా జరిగింది అని చిన్న విచారణ కమిటి వేసాను.దాంట్లో ప్రదాన investigator  నుంచి బంట్రోతు దాక అన్ని నేనే అనుకోండి. కొండను తవ్వి, పండి కొక్కును పట్టి నట్టు, తేలింది ఏమయ్య అంటే,మా పావురాలు ఖాలీ చేసి వెళ్లి పోయాయి. సదరు ప్రస్తుత జంట సరి కొత్తది.అవి పోగానే, ఖాలీ నే కదా అని ఇవి ఆక్రమిన్చాయన్న మాట..అదీ సంగతి. నేను మల్లి చీపురు చాట పట్టుకుని రెడీ ఐపోయాను, తలుపు ఖాలీ లోంచి తొంగి చూడటానికి 😦

లైలా ఓ లైలా…

మే 21, 2010
తుఫాను…ప్రపంచం అంతా విస్తుపోయి టీవీ మోనిటర్ లకు అతుక్కుపోయి చూస్తుంది. మా వూరు సగం నీళ్ళల్లో మునిగిపోయిందని వార్త. యెంతో మంది మరణించారు. నిరాశ్రయులయ్యారు. కూడు గూడు కొట్టుకు పోగా కట్టు బట్టలతో మిగిలారు. ఇంకా ముప్పు తొలగి పోలేదు. ఒంగోలు చుట్టూ పక్కల సుమారు ౩౨ cm  వర్షపాతం. చుట్టూ పక్కల ౪ చెరువులు ఇప్పుడో ఇంకాసేపటికో గండ్లు పడతాయి అని అన్నారు.
ఊర్లో కరెంటు లేదు రెండు రోజులుగా. తాగటానికే ఇంట్లో నీళ్ళు లేవు. బైట మోకాలు లోతులో నీరు. ఆగకుండా వస్తున్నా కుండపోత.
ఇవన్ని బైట ప్రపంచానికి చాల పెద్ద కష్టాలే. కాని మేము వీటికి అలవాటు పడ్డాం. మా నాన్న గారు చెప్పినట్టు, ఈ వరద ఉదృతి ఇంకో రెండు రోజుల్లో తగ్గిపోతాయి.మల్లా జీవితం మామూలవుతుంది.మా ప్రాంతం తుఫానులను తట్టు కుంటున్నట్టు  , జనం కూడా ఈ పరిస్తితులకు రాటు తేలారెమో? ఏమో…ఇదొక వైరాగ్యం, నైరాస్యానికి పరాకాష్ట ఏమో..ప్రతి ఏడు వచ్చే తుఫానులు ఎదుర్కోడానికి ఏ మాత్రం పద్దతి పాడు లేవు..ఇంకా వస్తాయన్న నమ్మకం లేదు. ఏం.ఎల్.ఏ లు ఏం.పీ లు ఏ రోడ్డు ఎటు మళ్లిస్తే వాళ్ళ ( ఆక్రమించిన) భూములకు రేట్లు పెరుగుతాయో లేక్కేసుకోవటం లో బిజీ గ ఉన్నారాయే…జనం ఎలా చస్తే వాల్లకేమిటి…అంతా అయ్యాక ముసలి కన్నీరు కార్చడానికి రెడీ…మునిగిన కొంపలు, కోల్పోయిన ఉపాది, కొట్టుకు పోయిన వాళ్ళు పోగా మిగిలిన బక్క చిక్కిన జనం, పిల్లలకు పట్టడానికి పాలు కూడా లేక కళ్ళల్లో వత్తులేసుకుని సాయం కోసం చూసే తల్లులు…వీళ్ళందర్నీ పరామర్శించి శవాల మీద వోట్లు ఏరుకోడానికి వస్తారు. అదేదో వీళ్ళ కొంపలు మునిగినట్టు తెగ నటించేస్తారు…
అదే మొదట హెచరిక రాగానే వీళ్ళను తగు ప్రాంతాలకు తరలించడం, లాంటి చర్యలు తూతూ మంత్రం లానే ఉంటాయి…వీటిల్లో మన వోట్లు పక్క పార్టీ వోట్లు లాంటి తర్జన భర్జనలు తప్పనిసరి.ఇదంతా పక్కన పెడితే, ఇంత వర్షపాతం మల్లా సముద్రం పాలే…ఎన్నెన్నో చెరువులు, గుండ్లకమ్మ,వెలిగండ్ల చెవిలో పువ్వు అంటూ ఎన్నో ప్రాజెక్ట్లు, కాని జిల్లా కేంద్రానికే ౩-౪ రోజులకు ఒక రోజు నీళ్ళు. అదీ వాళ్ళ సొమ్మేదో పోయ్నట్టు పొద్దున్న ౪ గంటలకు. పొద్దున్నే లేచి జనం పడే ఇబ్బందులు చూస్తె, ఆ మల (MLA  ని అల్లాగే కొడితే ఇదే వచ్చింది లేఖిని లో 😉 ) మప్(MP ) గాల్లచేత మా వీది మొత్తానికి ఒక రోజు నీళ్ళు మోయించాలని అనిపిస్తుంది. పోనీ ఒక్కరోజైన జనం ఇబ్బందులు వాళ్లకు తెలియాలి కదా.
ఇక పొద్దున్న లెగిస్తే నిత్యావసరాలైన పాలు పప్పు ఉప్పులు కోనేటప్పటికే జనాలకు దేవుడు కనిపిస్తుంటే……దీనికి తోడూ సర్కారు జీతాలు భయంకరం గా పెరిగి పోయినా, జనం రక్తం పీల్చే మన ప్రభుత్వోద్యోగులు…(ఎవరైనా  లంచాలు తీసుకోని మహానుభావులుంటే వాళ్ళ కు శతకోటి దండాలు)…ఇవన్ని చూసి చూసి జనం రాటుదేలి పోయారు…వైరాగ్యం, వేదాంతం ఎవర్ని కదిలించినా…మనం వీటన్నిటికీ అతీతులం…ఈ లైలాలు మజ్నులు వచ్చి ఏమి చేస్తాయండి..ఒక రెండు రోజులుండి  పోతాయి…ఇంత కన్నా పెద్ద భూతాలే ఉన్నాయి జనాలు ఆలోచించడానికి…

బెంగుళూరు బస్సు స్టాండ్

మే 17, 2010
బెంగళూరు బస్సు స్టాండ్ ఏమీ మారలేదు. ౫ ఏళ్ళు అయిందేమో ఇక్కడికి వచ్చి. ఏ మాత్రం తేడ లేదు. అవే ప్లాట్ ఫోరమ్స్,అదే ఆశుబ్రత,అదేదో పెద్ద చెత్త డబ్బా లా ఫీల్ అయి పోయి చెత్త వేసే చెత్త జనం, ఆశుబ్రత వల్ల భరించలేని దుర్ఘందం. స్కూల్ వదిలేక నలు వైపులా పరిగెత్తే పిల్లల్లాగా అడ్డదిడ్డంగా పొయ్యే బస్సులు.ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా మారనిది అదే అలసత్వం,అదే నిరాసక్తత.
ప్రభుత్వాల మాట పక్కన పెడితే మన జనం ౧౦ ఆకులు ఎక్కువే చదివారు. ఎంతైనా ఎడా ప్రజా తదా రాజానే కదా.
ఒకచోట స్తిమితంగా కూర్చోడానికే చాల ఇబ్బంది పడాల్సివచ్చింది.నన్ను తోసుకుంటూ వెళ్ళిన ఒకాయన, వెనక్కితిరిగి అదేదో భాషలో, ఇంకేదో అని విస విసా వెళ్లి పోయాడు, అది సారీ కాదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.ఇంకో మహానుభావుని నోటి పళ్ళ మద్య భాగం నుండి, విచిత్రమైన శబ్దం చేస్తూ బయల్పడిన ఘుట్కా ఫౌంటైన్ నా కాళ్ళను కొంచెం మిస్  చేసి నేల నిండా పరుచుకుంది. కొంచెం సీరియస్ గానే తలెత్తి చూసాను. కొంచెంలో మిస్ అన్న ఫీలింగ్ కనపడింది ఆయన గారి మోహంలో.ఇక చెత్త తీస్కేల్లే బండి నుండి కారిన జల పదార్ధం మేకేన్నాసు గోల్డ్ కి దారి చూపే మ్యాప్ గీచినట్లు చాల దూరం పారింది.నా పక్కన కూర్చున్న భారి ఫ్యామిలీ ఫలహారం చెయ్యడం మొదలెట్టారు..ఇంకా చూస్కోండి నాయనా, ఇక చుట్టూ పక్కల ఎటు చూసిన తిని పారేసిన స్నాక్ పాకెట్లు,తాగి పారేసిన కాఫీ కప్పులు,అక్కడే ఇంకో అరగంట వుంటే,ఆ చెత్త సముద్రంలో మునిగి పోతానన్న చెత్త ఫీలింగ్ రావటంతో,అతి కష్టం మీద దొరికిన సీట్ ను వదిలి, అయిష్టం గా నైనా మెకన్నాస్ గోల్డ్ మ్యాప్ అనుసరిన్చాల్సివచ్చింది.తపక్ మని నెత్తిమీద ఏదో పడటం తో తలెత్తి చూసాను.పై కప్పు కారుతుంది. ఆ ద్రవ పదార్ధం రసాయన విశ్లేషణ మానేసి, శుబ్రం చేస్కో టానికి toilet  లో దూరాను. అక్కడ చూడాల్సిందే, అదేదో చిరంజీవి సినిమా మొదటి ఆటాకు ఉన్నట్టు ఉన్నారు జనం. ఇక లోపల పరిస్తితి చెప్పుకోదగిందే.నేలంతా రక రకాల సువాసనలతో తడి తడి గా ఉంది.అదేవిటో ఇదేవిటో అంటే ఈ బ్లాగ్ గబ్బు కొడుతుందని, గబా గబా పని ముగించుకొని బైటకు వచ్చాను.
ఇక ఇక్కడి ప్రభుత్వ ఘనత. కొన్ని ప్లాట్ ఫోరమ్స్ కి చెత్త డబ్బాలే లేవు. అవి ఉంటేనే,మనోళ్ళు వాటిని వాడటం బహు అరుదు. ఇక లేని చోట్ల పరిస్తితి, అంటా నేను చెప్తే మీరేం చేస్తారు..ఊహించండి.ఉన్న చోట, బాగా బలిసిన రాజకీయ నాయకుని స్విస్స్ బ్యాంకు ఎకౌంటు లా పొంగి పొర్లుతున్నాయి. అశోకుని కాలం నుండి ఎవరూ శుబ్రం చేసినట్టులేదు.మరి ౩ తుపాకులు,౬ బాంబులు అని మన తీవ్రవాద మిత్రులు చెలరేగి పోతున్న కాలం లో ఈ బస్టాండ్ లో భద్రతా ఎలా ఉందయ్యా అంటే,బస్టాండ్ బైట మీకో మెటల్ detector కాన పడుతుంది.కాని దాంట్లోంచి రావటం పోవటం మీ ఇష్టం అనుకోండి.ఎందుకంటె, అంతకుముందు ఉన్న పెద్ద ఎంట్రీ లో ఇదొక చిన్న భాగం మాత్రమె.పక్కనే కూర్చున్న పోలీసాయన కు దీనికన్నా పేపర్ మీదే మక్కువ ఎక్కువున్నట్టుంది. ఆయన లోకం లో ఆయన ఉన్నాడు.హలప్ప మసాల వార్త చదూతున్నాదేమో ఈ లోకం లో మాత్రం లేదు.నాకిక బస్టాండ్ లో ఇంకో పోలీసాయన కనబల్లా.

చెప్పాలంటే చాల ఉంది చెన్న కేశవా అని ఈ బస్టాండ్ ఘనత వర్ణించడానికి ఈ పోస్ట్ సరిపోదని డిసైడ్ అవుతుంటే, నా బస్సు వచ్చింది,ఇక ఉంటా మరి.మీరు కూడా ఎందుకు ఈ చెత్త బ్లాగ్ లో..పని చూస్కోండి.

బేలూర్-అలిబేడు యాత్ర

మే 13, 2010

 

 
పొద్దునే లేవడం యెంత కష్టమైనా, ఎలాగోలా బైలుదేరాం. బస్సు యెక్క గానే మా మిత్రుడు మంచి నిద్ర లోకి జారుకున్నాడు. నాకెందుకో నిద్ర పట్టలేదు.ఈ యాత్ర గురించి ఏంటో కొంత గూగుల్ చేసిన కారణం గా నేమో, అవీ ఇవీ గుర్తొచ్చి కొంచెం excite అయ్యాననే చెప్పొచ్చు. బెంగలూరు దాటాక కనబడ్డ దృశ్యాలు నన్ను నిరాస పరచ లేదు. చుట్టూ అనంత దూరం వరకు పరచుకున్న పచ్చదనం,పొలాలు, చిన్ని చిన్ని గ్రామాలు, కొబ్బరి పోక చెట్ల అంతర సేద్యం అదేదో ప్రణాలికా బద్ధం గా గుంజలు పాటి నట్టు. ఈ పచ్చదనం మద్య పాకి పోతున్న పాము లాగ రోడ్డు, అంటూ పొంతూ లేక సాగుతుంది. రోడ్డు కిరువైపులా బ్రంహాండమైన వృక్షాలు గ్రామ పెద్దలు మనలను ఆహ్వానిస్తున్నట్టున్నాయి.
శ్రావణ బెలగోల సమీపించే కొద్ది, dieting చేసి సన్న బడ్డ అమ్మాయి లా చిక్కింది రోడ్డు. మరీ పక్కింటి దొడ్లోనుండి పోతున్నట్టు సాగింది ప్రయాణం.ఊర్లో ప్రవేసించ గానే కల్యాణి (కోనేరు) స్వగతం పలికింది. పక్కనే కొండ పైకి మెట్ల దారి. ౫౦౦-౬౦౦ మెట్లే కదా అని ఘీన్కరించిన మహానుభావులు సగం దారి లోనే కూలబడ్డారు.వాళ్ళలో నేను ఒకన్నాను కొండి. కొండ లోనే జన్మించాయా అన్నట్టు, సహజ సిద్దం గా ఉన్నాయి మెట్లు. బాహుబలి విగ్రహం స్వచ్చమైన చిరునవ్వు తో మా అలసట మాయమైంది. ప్రాపంచిక విషయాలతో నాకు పనిలేదన్నట్టు, ఊరికి దూరం గా శిఖరాగ్రాన నిలిచి ఉన్న ఏకశిలా విగ్రహం ఆనాటి స్మృతులు నేమరేసుకున్నట్టుంది.
                                                                                                                       ౧౭ మీటర్ల ఎత్తున్న ఈ విగ్రహానికి రోజు అభిషేకం జరుగదట, ఉత్సవ విగ్రహాని కే ఆ భాగ్యం.భరతుడిని యుద్ధం లో ఓడించిన బాహుబలి, ప్రాపంచిక విషయాలకు విరక్తుడై, ఈ కొండ పై తపస్సు చేసి విముక్తుడైనాడని స్తల పురాణం.గంగా సామ్రాజ కాలం లో (౧౧ శతాబ్దం) ప్రతిష్టించిన ఈ విగ్రహం నేటికి అబ్బురపరుస్తుంది.ఎటు వంటి సదుపాయాల్లేని ఆ కాలం లో ఈ విగ్రహ ప్రతిష్ట ఒక చిత్ర మైతే, ఒకే మెట్ల దారి ఉన్న ఈ కొండ పైకి, మహా మస్తకాభిశేక  సమయం లో సంబారాలన్ని పైకి చేర వేయటం ఇంకో ఎత్తు అని పించింది.
మా తదుపరి మజిలి హళిబేడు. ఇరు వైపులా చెట్లు కప్పేసాయ అన్నట్టుంది కొన్ని చోట్ల దారి.పచ్చని పొలాల మద్యలో కాపలా గా కొబ్బరి చెట్లు, ఎత్తు పెరగటం లో వాటికి పోటి పడుతున్న పోక చెట్లు, అక్కడక్కడా నిండు ఘర్భినిల్లాంటి అనాస చెట్లు. విశాలమైన పచ్చిక బయళ్ళలో మేస్తున్న పశువులు, సాంప్రదాయ కట్టు బొట్టులతో మగువలు చిన్ననాటి గుర్తులను తట్టి లేపాయి.ఇటు గాలి అటు పోనీ concrete అరాన్యాల నుండి ఇదొక ఆట విడుపు, మనవైన మూలాలలోకి ప్రయాణం.
హళిబేడు అంటే ద్వంసమైన పట్టణం. ద్వారా సాగారమనే హోయసలుల రాజధాని, బహమనీ దురాక్రమణ వల్ల, దంసమైనది కాబట్టి ఆ పేరు వచ్చింది. హొయసలేశ్వర ఆలయం ఒక అద్బుతం.దాదాపు ౧౦౦ ఏళ్ళు కట్టబడ్డ ఈ ఆలయం అసంపూర్తి గానే మిగిలిపోయింది.ఇది సిమెంట్ అనేది ఉపయోగించకుండా అమరిక పద్దతి లో నిర్మించ బడిన విచిత్రం. రెండు ఆలయాల ప్రాకారం అబ్బురపరుస్తింది. ఆలయాల బైట విగ్రహాలు, శిల్ప సౌందర్యం కదల నివ్వవు.హోయసలేస్వరునికి పూజాదికాలు నేటికి జరుగుతున్నాయి.రెండు నందీస్వరులు  జీవ కళలతో అలరారు తున్నాయి.ఆలయం బైట దేవతామూర్తులు,రామాయణ ఘట్టాలు ఒక రోజు ఐన వెచ్చించి చూడదగ్గవి. ఏనుగు పొట్టలో శివ తాండవం, కృష్ణుడు గోవర్ధనం ఎత్తడం, లాంటి ఘట్టాలు చెప్పదగ్గవి.అసంపూర్తి గా మిగిలిన ఘట్టాలే ఇలా వుంటే పూర్తి ఐతే ఎలా ఉండేవో అన్న ఊహ రాక మానదు.ఈ ఆలయం చుట్టూ పక్కల హోయసలుల శిల్ప సౌందర్యం తో అలరారే ఆలయాలు ౧౦-౧౫ ఉన్నాయట.
బేలూర్ మా చివరి మజిలి. హోయసలుల మొదటి రాజధాని.౧౧ వ శతాబ్దం లో విష్ణు వర్ధనుని చే నిర్మించబడ్డ, చేన్నకేసవ ఆలయం లో నేటికీ పూజాదికాలు జరగటం విశేషం.విజయనగర కాలం లో ఈ ఆలయం జీర్ణోద్దరణ కాబడింది.చేన్నకేసవ విగ్రహం ౨ మీటర్ల ఎత్తు ఉంటుంది.నిజంగానే సుందరుడు ఈ చెన్న కేస్వవుడు.ఆలయం లోని జయ విజయుల విగ్ర హాలు, స్తంభాల పై, ఆలయం పైభాగం లో శిల్ప కల బేలూర్ ఎందుకంత ప్రసిద్ధి పొందిదో తెలియజేస్తాయి.ఆలయం లో ౪౦ స్తంభాలు దేని కదే ప్రత్యేకం.ప్రతి స్తంభం పై చిత్రకళా చూడదగ్గది.
మొత్తానికి ఈ యాత్ర, విజయనగరానికి పూర్వం విరాజిల్లిన హిందూ సామ్రాజ్యం గురించి మంచి పరిచయం.వివిధ కారణాల వల్ల మనకు వారి గురించి మనకు పెద్ద గా తెలియక పోయినా,హోయసలుల కళాదృష్టి,హిందూ ధర్మోద్దారణ కై వారు నిర్మించిన బ్రహ్మాండమైన ఆలయాలు ఈ నాటికీ వారి గొప్ప తనాన్ని చాటుతున్నాయి.

కరునామయులు…

మే 8, 2010
మొన్నామధ్య మన కసాబ్ తీర్పు మీద అదేదో ఛానల్ లో చర్చా కార్యక్రమం. ఒకామె తెగగింజుకోవడం చూసాను.ఉరిశిక్ష వేస్తె, ఆయనకీ తను చేసిన తప్పు తెలియదట…శిక్ష పరివర్తన తేవాలి అని భాధ పడి పోయింది. ఇలాంటి వాళ్ళకు మన దేశం లో తక్కువేమీ లేదు. ఈవిడ ఇంట్లో వాళ్ళో బంధువులో ఆ దాడి లో పోయుంటే ఆమె ఇలా మాట్లాడేద?? సి.ఎస్.టీ లో జరిగిన మారణ హోమం, ప్లాట్ ఫోరం పైన అటు ఇటు చెల్లాచెదరైన మృతదేహాలు, ఎటు చుసిన రక్తం, తామెందుకు చనిపోతున్నమో తెలీక, ఏమి జరుగుతుందో తెలీక ప్రాణాలు విడిచిన ప్రజలు…పిల్లలు, మహిళలు, వ్రుద్దులని తేడాలేక జరిగిన దారుణం…మత పిచ్చి తో మదమెక్కిన మూకల నర మేధం…మీరు దేశభక్తి తో ఆలోచించక పోయినా మానవత్వకోణం లో నైన హృదయ విదారకం.
నారిమన్ హౌస్ లో అమాయకుల ఊచకోత, తాజ్ ముట్టడి ఇవన్ని ఎలా మర్చి పోతారు. సలస్కర్, ఆమ్టే, ఉన్నికృష్ణన్  లాంటి వీరుల బలిదానం, మనమెలా మర్చి పోగలం. మరి వీటన్ని టికి కారణం అయిన వాళ్ళను వదిలెయ్యాలా…
నారిమన్ హౌస్, తాజ్, మరి ఇతర చోట్ల జరిగిన సంఘటనలు ఈ దేశం ఉగ్రవాదులకు యెంత సాఫ్ట్ కార్నెర్ గా మారిందో చెప్పకనే చెప్తున్నాయి. మరి దొరికిన వాడిని కూడా క్షమాభిక్ష లేక పరివ్వర్తన అని వదిలేస్తే, రేపు ఈ ఇలాంటి సంఘటనలు రొజూ జరగోచ్చు. ఇంత జరిగిన మన ఘనత వహించిన న్యాయ వ్యవస్థ కసాబ్ గారికి ఎన్నో బంపర్ ఆఫేర్లు ఇస్తోంది…ఆయన మల్ల supreme కోర్ట్ కి వెళ్ళచ్చు. అక్కడా అదే తీర్పు వస్తే రాష్ట్రపతి క్షమా భిక్ష అడగడానికి ఇలాంటి తిక్క జనానికి మన దేశం లో కొదువ లేదు.
౧౬౧ మంది మరణానికి కారణమైన ఒక కిరాతక ఉగ్రవాదిని ఉరి తియ్యాలి అని డిసైడ్ కావటానికి మనకి ఇన్ని రోజులు పట్టింది. ఐన అది జరుగుతుందో లేదో తెలీదు.ఇలాంటి మానవతా వాదులు కరునామయులు ఉన్న దేశం లో యెంత మంది కసాబ్ లు లాడెన్ లు వచ్చిన మనం వాళ్ళను పరివర్తన చేసి పంపాలి కాని… అనే నసిగే జనాలను ముందు ఉరి తీయ్యాలి. ఇలాంటి  విషయం లో నైన మనం ఐక్యత చూపక పొతే రేపు ఈ సంఘటన మీ వీదిలో మీ ఇంట్లో జరగోచ్చు…అప్పుడు ఆలోచించ డానికి, ఆరోపించడానికి ఏమి మిగలదు…

 

అమ్మో బొమ్మ…

ఏప్రిల్ 15, 2010

ఒక ౨-౩ ఏళ్ళు అయి ఉంటుందేమో ఒంగోలు లో ౧-౨ వారాలు ఏకబిగిన ఉండి. ఈ సారి మా మేనేజర్ గారి పుణ్యమా అని ఆ అవకాశం దక్కింది. కొంచెం నింపాదిగా ఊరంతా తిరిగి ( పెద్ద ఊరేం కాదులెండి) విషయాలు తెలుసుకోవడానికి, డిగ్రీ కాలం నాటి దోస్తులను కలుసుకోవడానికి. ఆ నాటి స్మృతులు నెమరు వేసుకోవడానికి.కొంచెం పరిశీలించి చూస్తే మా వూరికి కొత్త ట్యాగ్ తగిలించవచ్చు అనిపించింది. విగ్రహాల పట్టణం అని. మన నాయకుల విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ, రోడ్ మద్యలో, చౌరస్తా దగ్గర, మీ వీధి మొదట్లో, ఎక్కడ కొంచెం జాగా ఉంటె అక్కడ. ఇందు గల దండులేడని ప్రహ్లాదుని లా మీరు వెతుక్కో అక్కర్లేదు. కేంద్ర నాయకుల నుంచి వీధి వార్డ్ మెంబెర్ నాయకుల దాక అందర్నీ సంతృప్తి పరచేసారు. కొంచెం అజాగ్రత్త గ మాములు రోడ్ మీద పోయినట్టు పొయ్యారో ఏ ఇందిరా గాంధీ నో రాజీవ్ నో మీరు ముద్దెట్టుకోవడం తద్యం. ఈ రోగం యెంత వరకు పాకిందంటే కొన్ని రోడ్లు చూస్తె అవి జనం కోసం కాదు విగ్రహాల కోసమే అన్నట్టుంటాయి. అన్ని రోగాలకు ఒకటే కారణం అన్నట్టు ఈ దురావస్త కు మన జాతీయ అంతర్జాతీయ పార్టీ ( నాయకురాలు ఇంపోర్టెడ్ ఫ్రొం ఇటలీ ఏ కదా) కి ప్రాంతీయ తెలుగు రోషం పార్టీ కి మద్య నడుస్తున్న బొమ్మల పొటీనే. వాళ్ళు ఒక బొమ్మ పెడితే వీళ్ళు రెండు పెట్టాలి. అదీ నడి రోడ్డు మీదే. ఐన జనం వాళ్ళ సొంత స్తలం లో ఇల్లు కట్టు కోవటానికి ఎన్నో రూల్స్ వాళ్ళ శ్రాద్ధం అని దేబరించే మునిసిపాలిటి వాళ్ళు,( ఆ చేతిలో పడాల్సింది పడే దాకా నే లెండి ) వీటన్నిటికి అనుమతులు ఎలా ఇస్తున్నారో అనేది మా ఇంటి ముందు ఉన్న శిలాఫలకం లేని గుర్తు తెలియని బొమ్మ మీద ఒట్టు, నాకైతే అర్ధం కాలా. ఎక్కడి దాక నో ఎందుకు మా ఇల్లు కట్టే టప్పుడు అన్ని అనుమతులు ఉండి, సమర్పయామి అంతా అయ్యాక ఒక మునిసిపాలిటి ఉద్యోగి కెవరికో మామూలు అందలేదని ఆయన మా ఇంటికి వచ్చి ౯౦% పూర్తయిన ఇల్లు నిభందనలు పాటించ లేదని, కూలగొట్టాలి అని భరతనాట్యం చెయ్యడం నాకు ఇంకా గుర్తుంది. మరి వీళ్ళ బొమ్మలు ఆ category లోకి రావా. ఇంకా హాస్యా స్పదమైన విషయం ఏమి టంటే, కొన్ని విగ్రహాలు మీరు గుర్తు పట్టలేరు. ఆయన ఎవరో అక్కడెందుకు పెట్టారో శిలాఫలకం ఉంటె చదివి ఓహో ఆయనా అనుకోవచ్చు…ఆ ఫలకం ఎవ్వరైనా ఇంట్లో వేస్కో వటానికి స్వాహా చేసారా…ఆ బొమ్మ ఎవరిదో ఎవరికీ తెలీదు. మరి మీ పేరు కింద రాసుకున్నా ఎవరికి ఎటు వంటి అనుమానం రాదు. ;౦ మరి ఇలాంటి బొమ్మలు పెట్టే కన్నా, ఆ బొమ్మలకు వాడిన సిమెంటు కొంచెం రోడ్లు మరమ్మత్తు చేయడానికి వాడితే పుణ్యం పురుషార్ధం. మా వూర్లో ఆలాంటి శ్రద్ధ అవసర మైన రోడ్లు లెక్కకు మిక్కిలి. లగే రహో మున్నాభాయ్ లో గాంధీ charector చెప్పిన డైలాగ్ గుర్తుకొస్తుంది. అదేదో సందర్భం లో ఎవరో తన విగ్రహం పగుల కొట్టారని తెలుసుకొని,దేశం లో తన విగ్రాహాలన్ని పగులకోట్టినా పర్లేదు అంటుంది. అలాంటి జన హృదయ నేతలకు ఇలా జనాలను ఇబ్బంది పెట్టి ఇదెక్కడి ముదనస్తపు…….అనిపించుకునే అవసరం లేదు.మరి ఈ సద్బుద్ధి మన నాయకులకు ఎప్పుడొస్తుందో…అసలు బుద్ది అనేది ఉంటే కదా అంటారా ……

అయిన వాళ్ళకు కంచాల్లో..కాని వాళ్ళకు ఆకుల్లో..

మార్చి 14, 2010
రాజీనామా చెయ్యలేదని తే.దే.పా ను రాజకీయ జాక్ నుంచి బహిష్కరించారు. కొదందారం చెప్పేదేమిటంటే వాళ్ళు ఎవరూ రాజీనామా చెయ్యడానికి ఇష్టపడలేదు కాబట్టి వాళ్ళు మన ఉద్యమానికి ఉపయోగపడరు అని. గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆయన పక్కన మన కే.సి.ఆర్. మరి ఆయన రాజీనామా చెయ్యక్కర్లేదా…ఇది కొంచెం పిడకల వేట బ్లాగ్ విషయమే కాని, అక్కడ జరిగేది రామాయణం కాదు..కొదందారం రాముడు కాదు కాబట్టి మంచి కామెడీ విషయమే..
ఇది అది కాదు అన్ని విషయాల్లో తెలంగాణా ను వెతుక్కుని అదేదో అనుకుని మనకేదో చెప్పి ఇంకొటేదో అయ్యాక వెనక్కు తగ్గటం మన జాక్ వాళ్ళకు అలవాటై పోయింది. ఇది ఒక మహోద్రుత ఉద్యమం దారి నుండి మంచి కామెడీ సీన్స్ పండించే, మన మీడియా వాళ్లకి మసాల న్యూస్ అందిచే వేదిక గ తయారయ్యింది.నా పాత బ్లాగ్ లో ( మేడి పండు…) చెప్పినట్టు, జనాలకు వీళ్ళ గోల అర్ధం కాకుండా పోయే రోజులు ఎన్నో రోజులు లేవు. మచ్చుకు తెలంగాణా ఇంటర్ పేపర్లు రుద్దటం తెలంగాణా లోనే జరగాలి అనటం, మల్ల జనం ఏమనుకుంటారో అని వెనక్కు తగ్గటం, ఆంధ్ర వస్తు భాహిష్కరణ అనటం, లిస్టు తాయారు చేస్తాం అని మల్ల అప్పుడెప్పుడో కే.ఏ.పాల్ అభ్యర్దుల లిస్టు పోయినట్టు  ఈ లిస్టు ఏ మయిందో కోడందరం కే తెలియాలి.  ఇంకో గొప్ప విషయం ఏమి టంటే గురు గారు తెలంగాణా వ్యతిరేకుల ఆస్తుల లిస్టు తాయారు చేస్తారట. ఇలాంటి చర్యల మాటల వెనుక ఏదో చేసేసేయ్యలని వుబలాటం ఉత్సుకత తప్ప సహేతుకత కన పడదు.
యదా జాక్ తధా క్రాక్   అనే పిచ్చి జనాలు చాల మంది…ధరలు పెరిగినాయ్ రా మగడా అని వాల్లెవరో ధర్నా చేస్తుంటే వాళ్ళ దగ్గర తెలంగాణా వూసేందుకు, నిర్హేతుకమే కదా…వాళ్ళ సభ ను అడ్డుకున్నదే కాక మల్లా మమ్మల్ని తన్నారు..క్షమాపణ చెప్పలే అని లొల్లి… వంక దొరకనమ్మ డొంక పట్టుకు ఏడ్చినట్టు..ఇంకో గొప్ప పని…చిరంజీవి విద్యుత్ సమస్యల పై వినతి పత్రం ఇవ్వటానికి విద్యుత్ సౌద కు వెళ్తే లిఫ్ట్ కి పవర్ ఆపేసి అదేదో ఘనకార్యం చేసి నట్టు టీ.వీ లకు ఎక్కే ప్రభుద్దులు..నా ఉద్దేశ్యం బాబు, చిరు గొప్ప వ్యక్తులని మంచి వాళ్ళని చెప్పటం కాదు….నిరసన తెలిపే పద్దతులు మాత్రం ఇవి కావని..
ప్రజాస్వామ్యం లో ప్రతి వ్యక్తి కీ భావప్రకటనా స్వేచ్చ ఉన్నప్పుడు మిగతా గొంతులు ఎందుకు నొక్కేస్తున్నారు..రాష్ట్రం లో ఒక్క తెలంగాణా వాదమే వినిపించాలి అనటం మన మెదళ్ళు బొద్దింక సైజు లో ఉన్నాయి అని మల్లి మల్లి చెప్పు కోవటమే…ఇలాంటి చర్యలు ప్రకటనలు ఆంధ్ర బాల్ థాకరే లనే గుర్తుకు తెస్తాయి…
ఈ పోకడలు జాక్ పూర్తిగా టీ.ఆర్.ఎస్ అజెండా లోకే వెళ్తుందని స్పష్టం చేస్తున్నాయి..అందరు రాజీనామా చెయ్యమనే కే.సి.ఆర్, తను చెల్లెమ్మ రాములమ్మ ఎందుకు రాజీనామా చెయ్యరో చెప్పరు. అయ్యవారు మరి లోక్సభ లో తెలంగాణా వాణి యిని పిస్తారేమో అని జనం మభ్య పడొచ్చు గాక…ఆయన  మంత్రి గా ఉన్నప్పుడే అటేపు పొతే వొట్టు…..మరి కొదందారం కి అలాటి బ్రమలేమన్న ఉన్నాయా…ఏమో…గదేందో తెలంగాణా టీ.వీ అంట వాళ్ళని కనోక్కొని మల్లా జెప్త….

గొల్లపూడి గారు…నాకూ అర్ధం కాలేదు…

మార్చి 8, 2010
నేను ఈ విషయం మీద బ్లాగ్ రాద్దామని కొంచెం notes  చేసిపెట్టుకున్నా..కాని ఈ లోగా మన  గొల్లపూడి గారు తన బ్లాగ్ లో ఈ విషయం మీద  భేషైన వ్యాఖ్యానం రాసారు…మల్లా నేను రాసినా ఆయన కన్నా గొప్పగా చెప్పేదేమీ లేదు కాబట్టి…మీరే అది చదవండి ….
http://www.koumudi.net/gollapudi/030810_I_need_to_understand.html

పరమ గురుడు చెప్పిన వాడు పెద్దమనిషి కాదు రా..

మార్చి 6, 2010
రష్యా చరిత్ర లో ఒక సంఘటన. జార్ చక్రవర్తి పీటర్ ఖజానా నింపుకునేందుకు ఒక చిన్నచిట్కా వేస్తారు. ఎవరైతే కొన్ని అంగుళాల కన్నా ఎక్కువ గడ్డం పెంచుతారో వారు నెల వారి గా ప్రభుతవానికి పన్ను కట్టాలి. అప్పట్లో గడ్డం పెంచడం ఒక కులీనుల సరదా, అవసరమున్ను. యెంత గడ్డం ఉంటె అంత పెద్దమనిషి అన్నమాట. మరి చచ్చినట్టు అలాటి వాళ్ళంతా పన్ను కట్టేరు. ఆ డబ్బు వాళ్లతో  వీళ్ళతో యుద్దాలు చెయ్యడానికి మరి పీటర్స్ బుర్గ్ అనే గొప్ప నగరాన్ని కట్ట డానికి ఉపయోగపడింది.
ఈ మద్య నడుస్తున్న చరిత్రను చూస్తే ఎందుకో దీన్ని మన దేశానికి అన్వయిద్దాం అనిపించింది. ఈ రోజుల్లో మన దేశం లో గడ్డం పెంచితే బాబా జుట్టు పెంచితే స్వామీ. గీత, రామ అంటే పరమహంస. నేనే దేవుణ్ణి అంటే భగవాన్. దేవుడి పెళ్ళాం, అనుమానం ఎందుకు అమ్మ భగవాన్. ఇంకా నయం మరిది భగవాన్, కొడుకు భగవాన్ రాలేదెందుకో. వీళ్ళు పోయాక వాళ్ళేమో. ఈ లాజిక్ పనిచేస్తే ఇలా అవడం పెద్ద కష్టం కాదు. ఒక ౪ నెలలు క్షురకుడి దగ్గరకు వెళ్ళాక పొతే సరి…మీరే ఒక స్వామి. పైన పీటర్ లా ఆలోచించిన మన ఖజాన కి  ఎంతో కొంత డబ్బు రాక పోదు.
ఇంకో కధ. పూర్వం ఒక స్వామిజి వాళ్ళ శిష్యులతో  కలిసి అదేదో నది దాటుతున్నారట. అక్కడ ఒక అమ్మాయి నది దాటలేక అవస్త పడుతుంటే స్వామీజీ తన భుజాలపై ఎక్కుంచుకొని నది దాటిన్చారట. నది దాటాక వాళ్ళు నగరమంతా తిరిగి భిక్ష తీస్కుని ఒక చెట్టు కింద కూర్చున్నారు. కాని శిష్యులు సర్వ సంఘ పరిత్యాగి ఐన గురుజి ఇలా చెయ్యడం ఏంటి అని ఆలోచిస్తున్నారట. అప్పుడాయన అబ్బాయిలు నేను ఆ అమ్మాయిని ఎప్పుడో దిన్చేసాను. మీరు ఇంకా నెత్తి నెట్టుకున్నారెందుకు అని అడిగారట.
ఈ గురు వేవడో సత్తే కాలపు మనిషి లా మీకు అనిపించటం లో ఆశ్చర్యం లేదు. ఎందుకని పించదు. గురూజీ అంటే జనం ముందు గీత పారాయణం. రాత్రి కి ఏమిటో మీరీ పాటికి రకరకాల టీవీ చాన్నేల్లలో రక రకాలు గా చూసే ఉంటారు. ఆ nityananda కి నా స్నేహితులు చాల మంది మంచి ఫాన్స్. నన్ను కూడా విన మని రెండు మూడు సార్లు డీ వీ డీ లు గట్త్ర ఇచ్చారు. కాని, టైం కుదరకో టైం బాగుందో మరి నేను చూడలేదు. కాని nityananda చాల శక్తి వంతులు. ఆయన లీల వినోదం చూపించే తీరారు.
ఇక గడ్డం పెరిగిన భగవాన్. మత్తు మందులో మరో ప్రపంచం చూపించే కల్కి. ఆ మత్తు లో ప్రపంచం చూడటం ఏమి ఖర్మ, కొత్త  ప్రపంచం స్తాపించేయ్యోచ్చు. అనుమానమా, మన దాసాజిలను అడగండి. ఆత్మా పరమాత్మ సంగమం అంటే మంచిగా ౪ రౌండ్లు ప్రసాదం పుచ్చుకుంటే ఇట్లే అర్ధం అయిపోతుందట. అమ్మ భగవాన్ సంస్కృత ఘోష కూడా ఆంధ్ర దేశం అంతా విని తరించేసింది.
ఇవన్ని అనవసరం అండి, ఈ బాబా లు భగవాన్ లా వెంట పడి పోయే వాళ్ళందరికీ ఒకటే ప్రశ్న. సర్వ సంఘ పరిత్యాగి కి డబ్బులెందుకు. ప్రపంచాన్నే మార్చే భగవాన్ లకు పైసా లెందుకు. దర్శనం కి ఒక రేటు. ఇంకో డానికి ఇంకో రేటు, ఆ డబ్బులన్నీ పెట్టి అయ్యవారు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితే కొడుకు భగవాన్ ౬-౭ కంపెనీలు నడుపుతున్నారట. మన భక్తులు అది కూడా సమాజ ఉద్దరణ అంటారేమో.
నాకొక అనుమానం. మన nityananda రేపు మల్ల ఒక ప్రెస్ మీటింగ్ పెడతారేమో. ఆ అమ్మాయి కి కామి కాని వాడు మోక్ష గామి కాదు అని భోదిస్తుంటే మీడియా వక్రీకరించింది అని. ఇన్ని నమ్మిన గొర్రెలు అదీ నమ్మినా ఆశ్చర్యం లేదు….
కల్కి దర్శనం…nityanandam…nityanando ranjito rajnithaha 😉