అమ్మో బొమ్మ…

ఒక ౨-౩ ఏళ్ళు అయి ఉంటుందేమో ఒంగోలు లో ౧-౨ వారాలు ఏకబిగిన ఉండి. ఈ సారి మా మేనేజర్ గారి పుణ్యమా అని ఆ అవకాశం దక్కింది. కొంచెం నింపాదిగా ఊరంతా తిరిగి ( పెద్ద ఊరేం కాదులెండి) విషయాలు తెలుసుకోవడానికి, డిగ్రీ కాలం నాటి దోస్తులను కలుసుకోవడానికి. ఆ నాటి స్మృతులు నెమరు వేసుకోవడానికి.కొంచెం పరిశీలించి చూస్తే మా వూరికి కొత్త ట్యాగ్ తగిలించవచ్చు అనిపించింది. విగ్రహాల పట్టణం అని. మన నాయకుల విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ, రోడ్ మద్యలో, చౌరస్తా దగ్గర, మీ వీధి మొదట్లో, ఎక్కడ కొంచెం జాగా ఉంటె అక్కడ. ఇందు గల దండులేడని ప్రహ్లాదుని లా మీరు వెతుక్కో అక్కర్లేదు. కేంద్ర నాయకుల నుంచి వీధి వార్డ్ మెంబెర్ నాయకుల దాక అందర్నీ సంతృప్తి పరచేసారు. కొంచెం అజాగ్రత్త గ మాములు రోడ్ మీద పోయినట్టు పొయ్యారో ఏ ఇందిరా గాంధీ నో రాజీవ్ నో మీరు ముద్దెట్టుకోవడం తద్యం. ఈ రోగం యెంత వరకు పాకిందంటే కొన్ని రోడ్లు చూస్తె అవి జనం కోసం కాదు విగ్రహాల కోసమే అన్నట్టుంటాయి. అన్ని రోగాలకు ఒకటే కారణం అన్నట్టు ఈ దురావస్త కు మన జాతీయ అంతర్జాతీయ పార్టీ ( నాయకురాలు ఇంపోర్టెడ్ ఫ్రొం ఇటలీ ఏ కదా) కి ప్రాంతీయ తెలుగు రోషం పార్టీ కి మద్య నడుస్తున్న బొమ్మల పొటీనే. వాళ్ళు ఒక బొమ్మ పెడితే వీళ్ళు రెండు పెట్టాలి. అదీ నడి రోడ్డు మీదే. ఐన జనం వాళ్ళ సొంత స్తలం లో ఇల్లు కట్టు కోవటానికి ఎన్నో రూల్స్ వాళ్ళ శ్రాద్ధం అని దేబరించే మునిసిపాలిటి వాళ్ళు,( ఆ చేతిలో పడాల్సింది పడే దాకా నే లెండి ) వీటన్నిటికి అనుమతులు ఎలా ఇస్తున్నారో అనేది మా ఇంటి ముందు ఉన్న శిలాఫలకం లేని గుర్తు తెలియని బొమ్మ మీద ఒట్టు, నాకైతే అర్ధం కాలా. ఎక్కడి దాక నో ఎందుకు మా ఇల్లు కట్టే టప్పుడు అన్ని అనుమతులు ఉండి, సమర్పయామి అంతా అయ్యాక ఒక మునిసిపాలిటి ఉద్యోగి కెవరికో మామూలు అందలేదని ఆయన మా ఇంటికి వచ్చి ౯౦% పూర్తయిన ఇల్లు నిభందనలు పాటించ లేదని, కూలగొట్టాలి అని భరతనాట్యం చెయ్యడం నాకు ఇంకా గుర్తుంది. మరి వీళ్ళ బొమ్మలు ఆ category లోకి రావా. ఇంకా హాస్యా స్పదమైన విషయం ఏమి టంటే, కొన్ని విగ్రహాలు మీరు గుర్తు పట్టలేరు. ఆయన ఎవరో అక్కడెందుకు పెట్టారో శిలాఫలకం ఉంటె చదివి ఓహో ఆయనా అనుకోవచ్చు…ఆ ఫలకం ఎవ్వరైనా ఇంట్లో వేస్కో వటానికి స్వాహా చేసారా…ఆ బొమ్మ ఎవరిదో ఎవరికీ తెలీదు. మరి మీ పేరు కింద రాసుకున్నా ఎవరికి ఎటు వంటి అనుమానం రాదు. ;౦ మరి ఇలాంటి బొమ్మలు పెట్టే కన్నా, ఆ బొమ్మలకు వాడిన సిమెంటు కొంచెం రోడ్లు మరమ్మత్తు చేయడానికి వాడితే పుణ్యం పురుషార్ధం. మా వూర్లో ఆలాంటి శ్రద్ధ అవసర మైన రోడ్లు లెక్కకు మిక్కిలి. లగే రహో మున్నాభాయ్ లో గాంధీ charector చెప్పిన డైలాగ్ గుర్తుకొస్తుంది. అదేదో సందర్భం లో ఎవరో తన విగ్రహం పగుల కొట్టారని తెలుసుకొని,దేశం లో తన విగ్రాహాలన్ని పగులకోట్టినా పర్లేదు అంటుంది. అలాంటి జన హృదయ నేతలకు ఇలా జనాలను ఇబ్బంది పెట్టి ఇదెక్కడి ముదనస్తపు…….అనిపించుకునే అవసరం లేదు.మరి ఈ సద్బుద్ధి మన నాయకులకు ఎప్పుడొస్తుందో…అసలు బుద్ది అనేది ఉంటే కదా అంటారా ……

7 వ్యాఖ్యలు to “అమ్మో బొమ్మ…”

  1. Chandu Says:

    Nice post.
    Maa oorilo koodaa (Narasaraopet) ilaane undi lendi. Keengrace vaallu pettarani vaaallu, jilugu desam vaallu pettaarani veellu, ekkada padite akkada pettesi vigrahaalu, Govt. hospital daggara traffic penchesaru. Govt. hopital road lo 2 NTR vigrahaalunnai. Paapam aayana laa undadu aa vigraham. Peru choosi telusukovalasinde.

    Sarlendi, aa manushulni manam emee cheyyalem, kaneesam vigrahaala meedainaa peda neellu challi mana kasi teerchukundaam. Manchi vaadai prajaa seva cheste poola dandalu veddaam. 🙂

    Chandu

  2. Kalyani Says:

    మీ వేదన అర్ధవంతంగా ఉంది. బొమ్మలు, జెండాలు, మొదలెట్టి వదిలేసిన బస్స్ షెల్టర్లు, తవ్వి వదిలేసిన సైడ్ కాలవ గుంటలు వీటిని పట్టించుకోవాల్సిన మునిసిపాలిటీ కేవలం మధ్యతరగతి ఇళ్ళు (భవనాలు కాదు) మీద పది దోచుకుతినడం, అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసినా ఇంకా ఇంకా బల్ల కింద చేతులు పెట్టి వేధించుకు తినడం. సామాన్య ప్రజలు ఏం చేయాలి? ఇలా బ్లాగుల్లోనో, వార్తా పత్రికల్లో ఏ చివర పేజీలో ఒక మూలనో మనం బాధని వెళ్ళగక్కుకోడం తప్ప మనం ఏమన్నా చేయగలమా???

  3. subhadra Says:

    good post..

  4. kvsv Says:

    మన దగ్గర కలెక్షన్ చేసినట్టు పార్టీ ల దగ్గర ఈ వుద్యోగస్తులు particular గా muncipality ల్లో అడగలేరు అడిగారా పుచ్చే లేచిపోద్ది..అదే నందీ పీఠం కదిలి పోడ్డి..అందుకే ఏ పార్టీ వాళ్ళు ఏ బొమ్మ పెట్టినా పోస్టర్ లు వేసినా నోరు మూసుకుని కూర్చుంతటారు…

  5. Nutakki Raghavendra Rao Says:

    మీ వేదన అరణ్య రోదన.యీ దేశం లో ఓట్ల రాజకీయాలున్నంతకాలం ధన సంపాదనకే రాజకీయులున్నంతకాలం,
    అధికారం కొరకు పెట్టిన పెట్టుబడులు గంటల్లో శాతాలు లెక్కించి వసూలు చేసుకోకుండా వుంటారా రాజకీయ వుద్దండులు. విగ్రహారాధన తో సమాజాలనే సమాధులుగా మార్చే రాజకీయ సంవిధాన సమరంలో ఇదెంతని మాష్టారూ మీ మనసును కలత పెట్టుకుంటారు? ప్రజలు అలవాటుపడ్డారు. పాపం మీ మాట వింటె వాళ్ళు నొచ్చుకుంటారు. శ్రేయోభిలాషి….నూతక్కి

  6. avinash Says:

    nijam cheppau bro….maa ongole ni nasanam chesthunnaruuuuuuuu

వ్యాఖ్యానించండి