అయిన వాళ్ళకు కంచాల్లో..కాని వాళ్ళకు ఆకుల్లో..

రాజీనామా చెయ్యలేదని తే.దే.పా ను రాజకీయ జాక్ నుంచి బహిష్కరించారు. కొదందారం చెప్పేదేమిటంటే వాళ్ళు ఎవరూ రాజీనామా చెయ్యడానికి ఇష్టపడలేదు కాబట్టి వాళ్ళు మన ఉద్యమానికి ఉపయోగపడరు అని. గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆయన పక్కన మన కే.సి.ఆర్. మరి ఆయన రాజీనామా చెయ్యక్కర్లేదా…ఇది కొంచెం పిడకల వేట బ్లాగ్ విషయమే కాని, అక్కడ జరిగేది రామాయణం కాదు..కొదందారం రాముడు కాదు కాబట్టి మంచి కామెడీ విషయమే..
ఇది అది కాదు అన్ని విషయాల్లో తెలంగాణా ను వెతుక్కుని అదేదో అనుకుని మనకేదో చెప్పి ఇంకొటేదో అయ్యాక వెనక్కు తగ్గటం మన జాక్ వాళ్ళకు అలవాటై పోయింది. ఇది ఒక మహోద్రుత ఉద్యమం దారి నుండి మంచి కామెడీ సీన్స్ పండించే, మన మీడియా వాళ్లకి మసాల న్యూస్ అందిచే వేదిక గ తయారయ్యింది.నా పాత బ్లాగ్ లో ( మేడి పండు…) చెప్పినట్టు, జనాలకు వీళ్ళ గోల అర్ధం కాకుండా పోయే రోజులు ఎన్నో రోజులు లేవు. మచ్చుకు తెలంగాణా ఇంటర్ పేపర్లు రుద్దటం తెలంగాణా లోనే జరగాలి అనటం, మల్ల జనం ఏమనుకుంటారో అని వెనక్కు తగ్గటం, ఆంధ్ర వస్తు భాహిష్కరణ అనటం, లిస్టు తాయారు చేస్తాం అని మల్ల అప్పుడెప్పుడో కే.ఏ.పాల్ అభ్యర్దుల లిస్టు పోయినట్టు  ఈ లిస్టు ఏ మయిందో కోడందరం కే తెలియాలి.  ఇంకో గొప్ప విషయం ఏమి టంటే గురు గారు తెలంగాణా వ్యతిరేకుల ఆస్తుల లిస్టు తాయారు చేస్తారట. ఇలాంటి చర్యల మాటల వెనుక ఏదో చేసేసేయ్యలని వుబలాటం ఉత్సుకత తప్ప సహేతుకత కన పడదు.
యదా జాక్ తధా క్రాక్   అనే పిచ్చి జనాలు చాల మంది…ధరలు పెరిగినాయ్ రా మగడా అని వాల్లెవరో ధర్నా చేస్తుంటే వాళ్ళ దగ్గర తెలంగాణా వూసేందుకు, నిర్హేతుకమే కదా…వాళ్ళ సభ ను అడ్డుకున్నదే కాక మల్లా మమ్మల్ని తన్నారు..క్షమాపణ చెప్పలే అని లొల్లి… వంక దొరకనమ్మ డొంక పట్టుకు ఏడ్చినట్టు..ఇంకో గొప్ప పని…చిరంజీవి విద్యుత్ సమస్యల పై వినతి పత్రం ఇవ్వటానికి విద్యుత్ సౌద కు వెళ్తే లిఫ్ట్ కి పవర్ ఆపేసి అదేదో ఘనకార్యం చేసి నట్టు టీ.వీ లకు ఎక్కే ప్రభుద్దులు..నా ఉద్దేశ్యం బాబు, చిరు గొప్ప వ్యక్తులని మంచి వాళ్ళని చెప్పటం కాదు….నిరసన తెలిపే పద్దతులు మాత్రం ఇవి కావని..
ప్రజాస్వామ్యం లో ప్రతి వ్యక్తి కీ భావప్రకటనా స్వేచ్చ ఉన్నప్పుడు మిగతా గొంతులు ఎందుకు నొక్కేస్తున్నారు..రాష్ట్రం లో ఒక్క తెలంగాణా వాదమే వినిపించాలి అనటం మన మెదళ్ళు బొద్దింక సైజు లో ఉన్నాయి అని మల్లి మల్లి చెప్పు కోవటమే…ఇలాంటి చర్యలు ప్రకటనలు ఆంధ్ర బాల్ థాకరే లనే గుర్తుకు తెస్తాయి…
ఈ పోకడలు జాక్ పూర్తిగా టీ.ఆర్.ఎస్ అజెండా లోకే వెళ్తుందని స్పష్టం చేస్తున్నాయి..అందరు రాజీనామా చెయ్యమనే కే.సి.ఆర్, తను చెల్లెమ్మ రాములమ్మ ఎందుకు రాజీనామా చెయ్యరో చెప్పరు. అయ్యవారు మరి లోక్సభ లో తెలంగాణా వాణి యిని పిస్తారేమో అని జనం మభ్య పడొచ్చు గాక…ఆయన  మంత్రి గా ఉన్నప్పుడే అటేపు పొతే వొట్టు…..మరి కొదందారం కి అలాటి బ్రమలేమన్న ఉన్నాయా…ఏమో…గదేందో తెలంగాణా టీ.వీ అంట వాళ్ళని కనోక్కొని మల్లా జెప్త….

5 వ్యాఖ్యలు to “అయిన వాళ్ళకు కంచాల్లో..కాని వాళ్ళకు ఆకుల్లో..”

  1. namdikesh Says:

    జనాల గొర్రె మనస్తత్వవం ఈ తెలంగాణా మేధావులకి బగా తెలుసు.

  2. ramesh Says:

    మీరు పైన చెప్పినవన్ని కప్పి పుచ్చుకోడానికి అల్రేడి నిన్న మొదలెట్టేసాడు ప్రజల్ను రెచగొట్టడం
    తెలంగాణ ప్రజలు వీడు మట్లాడే భూతులుకు అహ ఒహొ అని కేరింతలు చప్ప్పట్లు !!

  3. GolMal Says:

    KodaDa Ram is frustrated like KCR. These buffoons can not continue long.

  4. krishna Says:

    JAC is fully influenced by cong n TRS ,they just want to target TDP

  5. శ్రీవాసుకి Says:

    ఇదో మెగా డొక్కు సీరియల్ అంతు పొంతు ఉండదు 2014 వరకు. చూడగలిగిన వాళ్ళకి చూసినంత వినోదం.

వ్యాఖ్యానించండి