ఇట్లు మీ శ్రేయోభిలాషి, రోశయ్య నగర్.

అదేనండి మా ఒంగోలు.రేపో మాపో మన ప్రియతమ ము.మ మీద పైవాల్లకు దయ కలిగితే, ప్రకాశం రోశయ్య జిల్లా అయి పోవచ్చు.ఒంగోలు ఏ రోశయ్య నగరో, రోసి వాడో అయి పోవచ్చు.ఏమీ, కడప వై.ఎస్.ఆర్ జిల్లా అయి నప్పుడు ఇదెందుకుకాదు.భేషుగ్గా అవ్వచ్చు.అయినా , ఈ లెక్కన కొన్నాళ్ళకు విశాఖ తిక్కరామ జిల్లా అవ్వచ్చు,విజయనగరం బొత్స జిల్లా అవ్వచ్చు.వీల్లెమన్న చిన్న చితక నాయకులా సమస్యే లేదు.ఐన ఇప్పుడు చిరంజీవి కూడా మనోడే కదా, కృష్ణ జిల్లా చిరు జిల్లా చేస్తే పోలా.

ఎన్నో శతాబ్దాలు గా ఏర్పడ్డ జిల్లాల పేర్లు, ఆ ప్రాంత చరిత్ర ను ప్రతిబింబిస్తాయి.వంగవోలు ఒంగోలు అయినట్టే, దేవుని గడప కడప అన్నటు. కోల్కత్త పేరు మార్చినా, ముంబై పేరు మార్చినా నాకు నచ్చలేదు.ఎందుకంటె, రకరకాల కారణాలవల్ల ప్రాంతాల పేర్లు మార్పుకు లోను కావటం సహజం.కనట కెనడా అయినట్టు.మరి దానిని మల్ల కనట అనటం కొంచెం ఇబ్బందికరము, అనవసరము కూడా. మరి ఆ విషయమే అలావుంటే, మనం ఇంకొంచెం ముందడుగేసాము. పురాతన ప్రాంతాల పేర్లు మార్చి, మనోల్ల పేర్లు పెట్టుకుంటూ పొతే కొన్నాలకు ఒక విజయవాడ మిగలదు ఒక అమరావతి  మిగలదు.

మాయావతి బొమ్మలు పెట్టుకుందని నసిగే ముందు మనమేమి చేస్తున్నామో పునరావలోకనం చేసుకుంటే మంచిది.ఈ పేరు మార్పు వల్ల, ఎవరికి లాభం.ఒక్క కొత్త ఉద్యోగమైన పుడుతుందా.ఏమైనా వీసమెత్తు అభివృద్ధి జరిగిందా.బొమ్మలు పెట్టి పేర్లు మార్చి మనం సాదించే దేమిటో. రోడ్డు మీద ట్రాఫ్ఫిక్ సమస్యలు సృష్టించడం తప్ప.మన చరిత్ర మనమే మరిచి పోవడం తప్ప.అయినా ఈ నాటి నాయకులు ఇంకొక ఎన్నికల తర్వాత జనాలకు గుర్తుంటార అనేది వంద కోట్ల ప్రశ్న.అలాంటప్పుడు వందల ఏళ్ళ నుంచి వస్తున్న పేర్లని మార్చడం అవసరమా?? ఈ నాటి నాయకులలో  ఏ ఒక్కరికి అంత విషయం లేదు అనేది నిర్వివాదాంశం.

నా భయం ఏమి టంటే, మన పురాతన పార్టీ లో ముసలోల్లకేమి కొదవ లేదు.రేపో ఎల్లుండో ఎవరైనా బాల్చి తన్నేస్తే, ఈ సారి ఏ జిల్లాకు మూడుతుందో

6 వ్యాఖ్యలు to “ఇట్లు మీ శ్రేయోభిలాషి, రోశయ్య నగర్.”

  1. anand Says:

    nijam chepparu.

  2. శ్రీవాసుకి Says:

    >>ఈ నాటి నాయకులు ఇంకొక ఎన్నికల తర్వాత జనాలకు గుర్తుంటార అనేది వంద కోట్ల ప్రశ్న.

    చావు తెలివితేటలు ఉన్న వాళ్ళకి ఆ విషయం తెలుసు అందుకే మనం మరిచిపోకుండా ఉండటానికే జిల్లాలకు ఈ పేర్లు ఏర్పాటు. మనం నోర్మూసుకొంటే భారతదేశం సోనియాదేశం అవుతుంది.

  3. vasanth Says:

    asalu vellaki chritra ento daani avasaram ento teliste kada ysr em podichadani……………….

  4. raman Says:

    Our district should be named after “Ranga”Krishna dt.
    He was more popular and he did more than YSR in his trade of choice.
    At the end What counts is who has more heads (Trophies)hanging in their drawing rooms..
    Meanwhile Let us hang our heads.

  5. kvsv Says:

    ee paerlu pettukune durada emito naaku aiyite maatram ardham kaadu?

వ్యాఖ్యానించండి