జరా బద్రం అన్నో…

చిన్నప్పుడు చదుకున్న పంచతంత్రం కధ.ఒక వూళ్ళో ఒక సన్యాసి. ఆయన ఆ ఇల్లు ఈ ఇల్లు తిరిగి అడుక్కోచ్చిన దంతా ఒక జోలె లో పెట్టి, చిలక్కొయ్య కి తగిలించే వాడట. అదే ఇంట్లో ఒక ఎలకల గుంపు. హిరణ్యకుడనే వాడు దానికి రాజు. వాడు చిన్న చిన్న గా ఆ జోలె లో పదార్ధాలు కాజేయటం నేర్చుకున్నాడు. ఆ సన్యాసి అదేమీ పట్టించు కోలేదు. ఇక ఈ ఎలకల ఆగడాలు ఎక్కువయ్యాయి.అవే ఆ ఇంటి యజమానుల్లా ప్రవర్తించడం మొదలెట్టాయి.తిన్నంత తిని మిగతాది చుట్టూ చల్లి, జోలె కు కన్నాలు పెట్టి, నానా రభస చేసాయి.
అల జరుగుతుండగా, ఒక నాడు ఈ సన్యాసి స్నేహితుడొకడు అతన్ని చూడడానికి వస్తాడు. వీనితో మాట్లాడుతున్నా, మన సన్యాసి ద్యాసంతా ఆ జోలె మీదే ఉండింది. ఆ స్నేహితుడది గమనించి, విషయం కనుక్కుంటాడు. ఏదో మాయో పాయం చేసి, ఆ జోలె ఎలుకలకు అందకుండా చేస్తాడు. ఆ దెబ్బ కి ఎలుకల రాజు కి అతని పరివారానికి తిండి దొరక్క, పలాయనం చిత్తగిస్తారు. నిన్నా ఈరోజు జరిగిన జరుగుతున్న,సంఘటనలు  చూస్తుంటే, నాకు ఈ కధ గుర్తుకొచ్చింది.
పేనుకి పెత్తనం ఇచ్చినట్టు, ఇన్నాళ్ళు ఈ జనం మన ఘనత వహించిన నాయకుల ఉన్మత్త ప్రేలాపనలు ఊక దంపుల్లు విని విని విసిగెత్తి పోయి వున్నా తరుణం లో ఈ.సి నిజం గా శభాష్ ఐన పని చేస్తుంది. రౌతు చేతగాని వాడితే గుర్రం ౩ కాళ్ళ తో పరిగెత్తి ఇంకేదో భాగం తో సకిలించిందని మనోళ్ళు ఊరకే అనలేదు. మైకు కాన పడగానే అదేదో పిచ్చి కుక్క కరిసినట్టు వాళ్ళను వీళ్ళను వీలయితే అందర్నీ ఎసేస్తాం కుమ్మేస్తాం అనే వాళ్ళకు ఇది చెంపదెబ్బ. డబ్బు మద్యం వెదజల్లి ఏదో గెలిచాం అనిపించుకొని, చట్ట సభల్లో కేవలం ప్రమాణ స్వీకారం చెయ్యడానికే వెళ్లి, మల్ల ౫ ఏళ్ళు జనాలకు కనపడని వీళ్ళు ఎక్కడుంటే ఏముంది లెండి. ప్రజాస్వామ్యానికేమీ నష్టం కలగదు.కాని జనం కొంత కామెడీ మిస్ అవుతారు అంతే….

5 వ్యాఖ్యలు to “జరా బద్రం అన్నో…”

  1. NoName Says:

    విజయశాంతి ఏదో భాగంతో సకిలించిందనేగా అంటున్నారు?

  2. Kiran Says:

    మరి శ్రీనివాస్ డీ అన్నట్లు ” మున్నూరు కాపు ముఖ్యమంత్రి అవుతాడు ” అనటం తప్పు కాదా …. ఈ సి కి ఇది కనిపించలేదా ? ఈ వీ ఎం లు మారుతాయి .. ఈ సి లు పర పక్ష్యం వహిస్తూ … కోర్ట్ ల సహాయం తో గెలవడం సిగ్గు చేటు ….. నీ లాంటి వాళ్ళు దాస్తూ మాట్లాడటం …. దొంగ బుద్ది… నీకు న్యాయం ధర్మం లేదు … నీ తలపు కు అనుగుణం గా ఉంటే అది సరి… మేము నీ క్షమాపణలు అడుగుతున్నాం ….

    • sarathsworld Says:

      నేను ఎవరి పక్షం కాదు…నా పాత టపాలు చదివితే మీకు అర్ధం అవుతుంది. నేనెవరి పక్షం అని మీకు తెలుసు కోవాలని ఉంటె, చదవండి.నేను ప్రతి రోజు ఈ సమ్మె అని ఆ బంద్ అని మీ గార్దభ నాయకులు ఒండ్ర పెడితే ఆఫీసు కి వెళ్ళటానికి బస్సులు తిరక్క పొతే ఇబ్బంది పడే మద్య తరగతి పక్షం… పని పాటలు నష్ట పోయే సామాన్య ప్రజల పక్షం…చుట్టూ సమస్యలున్నా అన్యాయం జరుగుతుందని తెలిసినా తన జీవ యాత్ర కొనసాగించడంలో అలసి సొలసి ప్రతిఘటించా లేకున్నా నేలబారు భారతీయుడి పక్షం…ఇక మీ రన్న విషయం…బీ సి ముఖ్యమంత్రి అన్నా, ఇంకోటన్నా ఆయన భావం నేను కూడా రేస్ లో ఉన్నాను అని సిగ్గు లేకుండా అయన చెప్పడం, దాని గురించి మీరు నన్ను అడగటము, ఇంకేదాన్ని మంచి పని ఉంటె చూస్కోండి మాస్టారు…

  3. Kiran Says:

    Correction: గెలవడం కాదు .. …. గెలవాల్సి రావడం ….

వ్యాఖ్యానించండి