Archive for మే, 2009

ఏంది ఈ లొల్లి

మే 26, 2009
ఎందుకో నాకు ఈ జనాలని చూసి చిరాకొస్తుంది….అదేంటి కొత్త గ ఉండే అనుకుంటున్నారా…లేకపోతే ఎంటండి…ఆయనెవరో ఆంధ్రోల్లని బొంద పెడదాం అంటే జై అంటారు…ఇంకొకాయన రాయలసీమ మనదే అంటే జై అంటారు…మరొకాయన జై ఆంధ్ర అంటే దానికి జై అంటారు….చివరికేమైంది…..వాళ్ళు వాళ్ళు బానే ఉన్నారు…రాష్ట్రము లో ఇటు నుంచి అటు పోవడం కష్టం, కొత్త పరిశ్రమలు రావటం కష్టం, ఇంతెందుకు కొన్ని రోజులకి పొయ్యి లో పిల్లి లేగతం కూడా కష్టమే ఈ ధరలు చూస్తుంటే….ఇవన్ని పట్టవా ఈ నాయకులకు….పోనీ జనలకైన పడుతుందా….ఏమో ఆ ఏదో కొండల వాడికే తెలియాలి….సారీ మన బాసర సరస్వతి కో లేక పోతే సిమ్మద్రి అప్పన్న కో తెలియాలి (ఏ ఊరాయన నా బ్లాగ్ చదివి ఏమంటాడో మల్ల)