Archive for జనవరి, 2010

శిలలపై శిల్పాలు…

జనవరి 28, 2010
విజయనగరసామ్రాజ్యం వైష్ణవ ధర్మోద్ధారణ కై శ్రీ విద్యారన్యుల వారిచే  హిందుత్వ ఉద్ధరణకై సృజించబడినది. హరి హర బుక్క రాయల చే స్తాపింప బడిన ఈ  హిందూ సామ్రాజ్యము దక్షిణాదిన ఏకైక మైనను ౨౦౦ యేండ్ల పైబడి ముస్లిం ఆక్రమణలను ఎదిరించుటలో గొప్ప విజయములు సాదించెను. అందు, కృష్ణదేవ రాయల కాలము స్వర్ణ యుగమని చెప్పవచ్చును.
దేశ భాషలందు తెలుగు లెస్స అనుటయే కాదు తన ఆస్తాన కార్య కలాపాలన్ని తెలుగు లోనే జరిపించిన భాషాభిమాని రాయలు.  భువన విజయము అందలి అష్ట దిగ్గజాలు ఆయన కవి పండిత పక్షపాతానికి నిదర్శనాలు. ఈ నాటికి నిలిచి ఉన్న హంపి శిదిలాలు ఆ కాలములో వారి ఉత్తమాభిరుచి కి నిదర్శనాలు. ఆ మహా నాయకుడు తన సామ్రాజ్యమును యావత్ దక్షినాదిని విస్తరించెను. ఎన్నో ప్రసిద్ధి వహించిన దేవాలయములను ఆయన నిర్మించెను.
 ఒక తెలుగు వాని గా రాయల ౫౦౦ వ పట్టాభిషేక ఉత్సవమున ఆ మహా పురుషునకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. తెలుగు జాతికి తెలుగు భాష కు ఆయన చేసిన సేవ ప్రాత: స్మరణీయము.

ఆముక్త మాల్యద

జనవరి 28, 2010

కృష్ణ దేవరాయలు ప్రభంద కర్త. ఆయన శ్రీకాకులమను ప్రాంతమున పురాతన మండపమున నిద్రించు సమయమున కలలో విష్ణువే ఆయనను తెలుగు న ప్రభంద రచన కు  పూరి గోల్పేనని ప్రసిద్ధి. ఆయన కాలము ప్రభంధ యుగమని ప్రతీతి. శృంగారము ఈ ప్రభంధముల లో ఎక్కువ. ౩౦ పద్యముల లో రాయలు గోదాదేవి సౌందర్యమును వర్ణించెను. విష్ణువు  కై ఆమె విరహమును ఆయన వర్షా కాలమున శీతాకాలమున వర్ణించిన విధము శృంగారమును అతిసయించెను.

గోదా విష్ణు కలయిక ను రాయలు ఆత్మ పరమాత్మ కలయిక వలె వర్ణించెను. ఆమె ప్రేమ ను మనుష్యుని మోక్ష సాధన వలె వర్ణించెను. ఈ కావ్యమున మరియొక ముఖ్య పాత్ర విష్ణు చిత్తుడు. విష్ణువు ఆయనను పాండ్య రాజునకు మోక్ష మార్గమును ఉపదేసించ మనెను. ఈ పాత్ర వలన ఈ కావ్యమునకు విష్ణు చిత్తీయము అని పేరు.
వైష్ణవమును జ్ఞాన మార్గమును ప్రభోదిన్చుటే ఈ ప్రభంధ ముఖ్య ఉద్దేశము., రాయలు కు సంస్కృతము మరియు కన్నడము న యందు కూడా ప్రవేశము కలదు.సంస్కుతమున ఆయన జాంబవతి కళ్యాణమును వ్రాసెను.

దేశ భాషలందు తెలుగు లెస్స

జనవరి 27, 2010

కృష్ణ దేవ రాయల కాలం తెలుగు భాష కు సంస్కృతి కి  స్వర్ణ  యుగం…అష్ట దిగ్గజాలకు ఆలవాలమైన భువనవిజయం ఆయన ఆస్తానం..అష్టదిగ్గజాలు ఎనిమిది దిక్కులను మోసే ఎనిమిది ఏనుగులకు గుర్తు..వారు అల్లసాని పెద్దన,నంది తిమ్మన,  మాదయ్యగారి మల్లన, ధూర్జటి, అయ్యలరాజు రామంభాద్రుడు,  పింగళి సూరన, రామరాజభూషణుడు, మరియు తెనాలి రామకృష్ణుడు. అల్లసాని పెద్దన కు  ‘ఆంధ్ర కవిత పితామహుడు’ అన్న బిరుదు కలదు.మనుచరిత్ర ప్రభంధకర్త.దీని నాయన కృష్ణ దేవరాయలకు అంకితమిచ్చెను. నంది తిమ్మన పారిజాతాపహరణము ను రాయలకంకిత మిచ్చెను. మాదయ్యగారి మల్లన రాజశేఖర చరిత్రమును రాసేను.ధూర్జటి కలహాస్తీస్వర మహత్యమును,అయ్యలరాజు రామభద్రుడు రామభుద్యమును రాసెను. పింగళి సూరన రాఘవ పాండవీయమును, భట్టు మూర్తి వసుచారిత్రమును, తెనాలి రామలింగడు పాండురంగ మహత్యమును రాసెను. కృష్ణ దేవరాయలు కూడా గొప్ప కవి…ఆయన తెలుగు సంస్కృత భాషలలో రచనలు చేసెను…మరి ఆ విశేషాలు రేపు మాట్లాడుకుందాం…

జై ప్రకాశం….

జనవరి 25, 2010
ఇందుమూలముగా యావన్మంది ఆంధ్ర తెలంగాణా బ్లోగేర్ లందరికి తెలియజేయుటేమనగా….నేను ప్రత్యెక ప్రకాశం రాష్ట్రము కోసం డిమాండ్ చేస్తున్నాను…ఎందుకనగా..
1 . 1970 లో ఏర్పడ్డ జిల్లా లో ఇంత వరకు ఎటువంటి అభివృద్ధి లేకపోవటం…భాధాకరమైన  విషయం ఏమిటంటే..గుంటూరు, నెల్లూరు, కర్నూల్ జిల్లాలలో వెనుకబడ్డ ప్రాంతాలనుకలిపి మా జిల్లా ను ఏర్పాటుచేశారు…సరే వాటి అభివృద్ధి కి ఎటువంటి చర్యలు తీసుకోలేదు…
2 . 17626 కే.మీ వైశాల్యం తో ప్రపంచం లో ని ఎన్నో దేశాల కన్నా పెద్ద ప్రాంతం మాది…ఏమి లాభం 60 – 70 శాతం భూమి వ్యవసాయ యోగ్యం కాదు…వాటికి సాగునీరు లేదు..సాగు నీటికి ప్రనాలికయే  లేదు…ఎప్పటికి వస్తుందో తెలీదు..
౩. సాగునీటి విషయం దేవుడెరుగు…జిల్లా ప్రధాన కేంద్రం లో 60 శాతం జనాలకి తాగు నీరే లేదు…వారానికి 2 సార్లు నీళ్ళు వదులుతారు మునిసిపాలిటి..మీ టైం బాలేదా వారానికి ఒకరోజు ను లేదు…ఇంకా మిగత ప్రాంతాల సంగతి స్వామియే శరణం అయ్యప్ప…
4 . మా వాళ్ళ వలసలని పాలమూరు వలసలతో పోల్చవచ్చు….ఇక్కడ ఉద్యోగములు లేవు…ఉద్యోగ వ్యాపార అభివృద్ధి శూన్యము…సర్కారు వారు ఏమైనా చేస్తారా అంటే వాళ్ళ దగ్గర  ఇంత  వరకు ప్రనాలికే లేదు…ఇంకా పని ఎప్పటికి చెయ్యాలే…
5 . 2001 జనాభా లెక్కల ప్రకారం మా జిల్లా జనాభా 3,059,423 ……   కాని ఒక్క విస్వావిద్యాలయము లేదు…..మరి ప్రైవేటు విద్య అందరికి అందుబాటులో లేదు…
6 . ప్రధాన పట్టణాలని మేము చెప్పుకునే వాటికి రవాణా సౌకర్యాలు గగన కుసుమాలె…
7 . granite , వ్యాపార పంటలు అని వికీపీడియా లో కనిపించేవి జనసామాన్యం కి పనికి వచేవి కావు…మోతుబరులు బడ పారిశ్రామిక వేత్తల హక్కుబుక్తాలు…
ఇది ఒక రాయి వేసే ప్రయత్నం కాదు ..ఒకరి ఉద్యమంతో నాకు పోలిక లేదు…కాని అభివృద్ధి ప్రాతిపాదిక పై కొత్త రాష్ట్రాలు ఏర్పడితే మా కు ఒక ప్రత్యెక రాష్ట్రం కావాలి….

తెలుగు వారి తెగులు

జనవరి 22, 2010
ఇది ఎన్నాళ్ళ నుంచో మనసులో ఉన్న మాట…అదేంటో నండి..నేను, ఇంకొక ఆంధ్రా మహానుభావుడు అదేదో దిక్కుమాలిన ఆఫీసు లో పని చేస్తామండి..ఆయన ఎప్పుడు ఎడురుపడ్డా నోరార బావున్నారా అని అడిగామనుకోండి…ఐ అం ఫైన్ హౌ అరె ఉ అనే అంటాడు కాని…బావున్నాను మీరు ఎలా ఉన్నారు అంటే ఆయన సోమ్మేమన్న పోతుందా… సరే మన్ను మాసానాం చుట్టుపక్కల ఎవరైనా తెల్ల తోలోల్లు ఉన్నారా మన భాష లో మాట్లాడుకుంటే విని భాద పడతారు అని చుస్తే  అదేమీ లేక పాయిన అదే తంతు….మేమిద్దరం కార్ లో బైటకు పాయిన అదేమీ దరిద్రమో…అయ్యగారి నోట తెలుగు మాటే కరువు…మనం తెలుగు లో ఏమైనా అడిగిన ఆంగ్లమున దేబిరింతలు…
సరే అయ్యవారేమన్న abcd న అంటే అదీ కాదు…ఆ దిక్కుమాలిన IT బూం లో మూడు ఏళ్ళ క్రితం హైదరాబాద్ నుండి దిగుమతైన సరుకే…అప్పటి దాక అమీర్ పెట్ జంక్షన్ లో పిడత కింద  పప్పు తిన్న శాల్తీ యే….అమెరికా గాలి తగిలి తెలుగు మర్చి పోయారా…లేక మెదడు కేమైనా దెబ్బ తగిలి తెలుగు మర్చిపోయారా అన్నది million డాలర్ ప్రశ్న…
వెనకటికొకాయన అనకాపల్లి నుంచి అమెరికా వచ్చి..ఆవకాయ్ అంటే అదో కొరియన్ కార్ కంపెనీ అన్నాడంట…అలా వుంది మనోల్ల సంగతి…అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంటూ …ఇంకొద్దు లెండి….

అహో ఆంధ్రభోజా……..

జనవరి 18, 2010
ఈ విజయనగర సామ్రాజ్య శిధిలాలలో చిరంజీవి వైనవాయ…ఈ పాట మన ప్రభుత్వం మనసా వాచా కర్మణా నమ్మినట్టుంది…అయినా చిరంజీవులని స్మరించుకోవాలా…వాళ్ళ గురించి ఉత్సవాలు చెయ్యలా అని ఎదురు అడిగితె మనం చేసేదేమీ లేదు…అసలు విషయం…శ్రీ కృష్ణదేవరాయలు పట్టాభిషిక్తుడై ఐదువందల ఏళ్ళు పూర్తి కావొస్తుంది…కర్నాటక ప్రబుత్వం దీనిని ఒక పండుగ లా జరుపడానికి ఒక సంవత్సరం క్రితమే శ్రీకారం చుట్టింది…
రాయల వారి గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు…దేశ భాషలందు తెలుగు లెస్స అని నుడివిన భాషాభిమాని,తానే అముక్త మాల్యద లాంటి అద్భుత కావ్యం రాసిన కవి, దక్షిణ భారతదేశ పర్యంతం తన సామ్రాజ్యాన్ని విస్తరించిన ధీశాలి …మన బ్లాగెరులంతా కలిసి ఆయన గురించి పది రోజులు రాసినా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది…ఇంకా గొప్ప విషయం ఏమి టంటే ఘనత వహించిన ఆంధ్ర ప్రభుత్వం దీన్నొక ఉత్సవ  దినం గ అయినా గుర్తించినట్టులేదు…ఆ ఆత్మ గౌరవం, ఈ ప్రాంత పొగరు అని పిచ్చి కూతలు కూసే మన రాజకీయులకు ఇది పట్టినట్టులేదు…
ఇది చాల విచారించవలసిన విషయం…మన వాళ్ళు వుట్టి వెధవాయోలోయి  అన్న కవి ఇలాంటివి ఎన్నిచుసి అలా వాపోయదో తెలీదు…కాని మన వాళ్ళు దీన్ని ప్రతి విషయం లోను అదే పని గ నిరూపిస్తూ ఉంటారు…చరిత్ర మరచిన జాతి కి భవిష్యత్తు లేదు…
కానీ, ఇతరుల పై వేలు చూపే ముందు నా ఇల్లు చక్కబెట్టుకుంటాను, ఈ బ్లాగ్ లో జనవరి 27 28 29 తేదీలలో ఆంధ్రభోజుని విజయాలకు ఆయన తెలుగు భాష కు చేసిన సేవలు స్మరిస్తూ, ఆయనకు నమస్కరిస్తాను…ఆయన పోషించిన తేనెలూరు తెలుగు కు అసలైన వారసుడని పించుకోవడానికి ఉడతాభక్తి తో…..

చేపలు..మనుషులు…

జనవరి 17, 2010
చేపలు కొన్ని విషయాలని నెలల తరబడి గుర్తుంచుకున్తాయని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల పరిశోదనలో తేలింది..జాలర్లు తమను బుట్టలో వేసుకునేన్దుకు చేసే ప్రయత్నాలను కనీసం ఏడాది పాటు గుర్తుపెట్టుకొని తమ లోని దోషాలను సవరించుకోవడం ద్వారా మరో మారు తమపై ఆ తరహ దాడి జరగకుండా జాగ్రత్త పరిశోధకులు వహిస్తాయనితెలిపారు..జాలర్లు తమకు ఏరగా వేసే పదార్దాల పట్ల కూడా అప్ప్రమత్తంగ ఉంటాయని, రెండో సారి వలలో పడకుండా తమ ప్రవర్తన మార్చుకున్తాయని ఆయన వివరించారు.
నాకు వెంటనే ఆ శాస్త్రవేత్త కి మెయిలు పంపుదాం అని పించింది…ఆ చేపల మెదళ్ళు ఏమన్నా మనుషులకు అమర్చే అవకాశముందా అని…మన జనాలు గజనిలు కదా…నిన్న జరిగింది ఈ రోజు గుర్తుండదు…మన కళ్ళముందే అన్నిజరుగుతున్నా వెర్రి చేపల్లా కాదు కాదు మనుషుల్లా అదే వలలో పడిపోతుంటారు…అదే జాలర్లని మళ్లీ మళ్లీ నమ్మేస్తుంటారు.. మచ్చుకి రాష్ట్రంలోని ఇప్పటి పరిస్తితి నే తీస్కుందాం….సాద్యా సాధ్యాలు పక్కన పెడితే మొన్నటిదాకా ప్రతి పార్టీ ప్రత్తెలంగాణా ని ప్రత్యెక సమావేశాలు పెట్టి మరీ సమర్దించినదే….దీనికి అలుగు దేశం, మెగా భోజ్యం మినహాయింపు కాదు, మల్ల అదేందో రాత్రికి రాత్రి అందరు ప్లేట్లు  ఫిరాయిన్చేస్తారు….గజనిలు పోలో మని వెనకబడి సమైఖ్యాంద్ర అంటారు…మొన్నటిదాకా ఈ మగానుభావులు ఏమన్నారో ఎవరికి గుర్తుండదు…
ఇక మన సమితి అక్కడేనిమిశానికేమి జరుగునో ఎవరికీ తెలీదు…చింపుతం ఆరేస్తాం…పోస్టర్లు అంటించే వాళ్ళకు కట్ అవుట్ లు పెట్టె వాళ్ళకు ఓవర్ టైం కల్పిస్తాం, అంటారు చేస్తారు…ఒకనాడు అన్నిరకాలు గ వ్యతిరేకించే పార్టీ లతోనే పొత్తు పెట్టుకుంటారు..మల్ల సాయంత్రానికి వాళ్ళనే భాగో గో గో అంటారు…..కొన్ని రోజులు అజ్ఞాతవాసం చేస్తారు…మళ్ళా ఉన్నట్టుండి మేమోకల్లం ఉన్నాం…అదేప్పట్నించో మాకు అన్యాయం జరుగుతుంది అంటారు…మళ్ళా మన గజలి లు రెడీ…ఉరెస్కోటానికి…ఊర్లకు బస్సులకు నిప్పెట్టదానికి….
బాబ్బాబు ఇదంతా ఎందుక్కాని…మీరు కొంచెం వాకబు చెయ్యండి…ఎమ అర్జెంటు గా ఆ చేపల మెదళ్ళు ఒక 10 కోట్లు ఆర్డర్ చేద్దాం…మన గజనిలను మేల్కొలుపుదాం….

ఒక అందమైన అనుభవం…

జనవరి 17, 2010

వారాంతం…బైట వర్షం…అన్ని పనులు ఆగిపోయాయని అనుకుంటూ మన కూడలి ఓపెన్ చేశా….నిన్నటి బ్లాగ్స్ లో ఎవరో ఒకరు వెన్నల్లో ఆడపిల్ల గురించి రాసారు…వెబ్లింక్ లో ఆ పుస్తకం సంగ్రహించా….వాన సన్నగా కురుస్తోంది…చాలా రోజులైంది వెన్నెల్లో ఆడపిల్ల చదివి…అప్పట్లో యండమూరి ని తెగ తిట్టుకునేవాడ్ని….ఆ కద దుఖాంతం అని…సరే చేసేపని ఏమి లేదు కదా అని మెల్లగా చదవడం స్టార్ట్ చేశా…

యండమూరి మీద నాకో కంప్లైంట్ ఎన్నాళ్ళనుంచో…అదేవిటో ఆయన పుస్తకం చదవటం మొదలుపెడితే ఆపలేము…మిగత అన్ని పనులు తర్వాతే…మా వరండా లో కూర్చున్నా…పక్కింట్లో నుంచి కిషోర్ పాటలు సన్నగా వినిపిస్తున్నాయ్…ఏదో చాల కాలం తర్వాత మంచి స్నేహితుడెవరో కనపడి పలకరించినట్టు అనిపించింది ఆ అనుభవం….వెన్నెల్లో ఆడపిల్ల కొంచెం సూపర్ ఫాస్ట్ త్రిల్లెర్ లాంటిదే…తర్వాత పేజి లో ఏం జరుగుతుందో అన్నట్టే ఉంటుంది…అదేదో మన ముందే జరుతుననట్టు ఆ రేవంత్ కి మనమే ఒక క్లు నో ఇస్తే పోతుంది అనిపిస్తుంది…మనం ఆ చిక్కు ముడులు విప్పక పాయిన తర్వాత పేజి చూసి కనుక్కో గలం కదా 😉
ఈ నవల ఎన్ని రోజుల తర్వాత చదివిన ఏదో కొత్త గానే ఉంటుంది…ఆ పాత్రలు, సంభాషణలు నిత్య నూతనం గానే ఉంటాయి…ఈ ఫోన్ లో అమ్మాయి అబ్బాయి ని ఏడిపించడం అనే కాన్సెప్ట్ చాల సినిమాలలో వచ్చిన రచయితా దీన్ని నడిపిన బిగువు వినుత్నం…ఇక చివరికొస్తే ఈ గొప్ప విషయానికైనా ముగింపు ఉండాల్సిందే…కాని ఈ ముగింపు మనల్ని చాల సేపు ఆలోచింపచేస్తుంది…అంతసేపు తన తెలివి తేటలతో చాకచక్యం తో కధ ను ఎన్నోఊహించని మలుపులు తిప్పిన  రమ్య పాత్ర చివరి మలుపు లో అర్దంతరం గ ముగిసిపోవడం భాదేస్తుంది…..ఈ కధ కు ముగింపు ప్రేక్షకులకే వదిలేస్తే బావుండేదేమో అనిపించింది…ఈ విషయం లో మాత్రం నేను రచయితతో ఎప్పటికి ఏకీభ విన్చలేనేమో….

మంత్రాలకు చింతకాయలు…

జనవరి 15, 2010
నిన్న ఎదాలాపంగా ఈనాడు తిరగేస్తుంటే ఒక వార్త నన్నుకట్టి పడేసింది…కాసేపు ఆలోచించాను…ఇదేలాగాబ్బా అని…ఉహు ఒక పట్టాన కోరుకున పడలేదు….మా రాజకీయ విశ్లేకడుని అనుకునే 😉 ఒక దోస్తుకు ఫోన్ చేసి మరీ వాడి అభిప్రాయం అడిగాను..ఈ వార్త గురించి….వాడు అటు కాని భాషలో ఏదో అన్నాడు…అదిక్కడ ఎందుకు లెండి…మళ్ళా పదిమంది చూడాల్సిన బ్లాగు కదా….
ఇంతకీ విశేషం ఏంటంటే పలానా సినిమాను పలానా చోట ప్రదర్శించకుండా అడ్డుకున్టారట…ఆ కుంటే అని మీరు అడగచు…అడిగే వాడికి బ్లాగర్ లోకువ అన్నట్టు…అదే కదా కిటుకు….అలా చేస్తే ఏమవుతుంది….ఫలానా జనం అడుగుతున్నా ఫలానా చింతకాయ ( అందరు క్షమించాలి…నేనే పక్షము కాదు…ఈ చర్య నాకు అలాగే అనిపించింది) రాలుతుందా అంటే…మంత్రాల మరిడయ్యనో…తంత్రాల మరిడమ్మ నో అడగాల్సిందే…
అయ్యా సినిమాలు కూడా వదలరా…ఆ రాష్ట్రము ఈ రాష్ట్రము అని ఆంధ్ర దేశం లో ( అదే లెండి తెలంగాణా మరియు ఆంధ్ర ) జనాలకి తిండి పెట్రోలు లేకుండా చేసింది చాలదూ..మీ గోల తట్టుకోలేక ఏదో ఒక సినిమాకు కూడా వెళ్ళకుండా చేస్తే జనం ఎక్కడ చావాలి…జనం ఏమి చూడాలి…ఏమి చెయ్యాలి అనికూడా మీరే డిసైడ్ చేస్తే, కొన్నాళ్ళకి ఈ రోజు మీ ఇంట్లో ఫలానా తెలంగాణా పచ్చి పులుసే తాగండి..లేక పోతే నాలుగు తంతాం అనేటట్టున్నారు….

జంధ్యాల కు హాస్యాంజలి

జనవరి 14, 2010
చిన్నప్పుడెప్పుడో లాగులేస్కునే వయసులో చూసిన సినిమా ” అహ నా పెళ్ళంట”. నాకు జంధ్యాల తో తోలి పరిచయం. విశేషించి అరగుండు నత్తి గోల , కోట పిసినరిత్వానికి పరాకాష్ట…వారిరువురి మద్య పండిన కామెడీ చర్వితచర్వణం. ఆ పాత్రలు ఇంకా గుర్తుకొస్తూనే ఉంటాయ్…వెరైటీ మనుషులు కనపడ్డప్పుడల్లా, జంధ్యాల అలా గుర్తుకొస్తూనే ఉంటాడు…
నేను ఆయన సినిమాలు అన్ని చూసాను…ఒక నాలుగు స్తంభాలాట, ఒక చంటబ్బాయి, ఒక ఆనంద భైరవి..ఒక్కటేమిటి ప్రతీది వందేళ్ళ సినిమా నే…అంటే వందేళ్ళ తర్వాత కూడా ఆ సినిమా ని చూసి ఆహా నా రాజ అనుకోవచ్చు.
జంధ్యాల  గురించి చెప్పడానికి నేను చాల చిన్న వాడ్ని….కానీ, నా దృష్టిలో ఆయన  ఒక సంపూర్ణ కళాకారుడు…మాటలు, స్క్రీన్ప్లే, దర్సకత్వం, నటన ఒకటేమిటి అన్ని రంగాల్లో శహభాష్ అని పించుకున్న వ్యక్తి. నేను ఆయన వీరాభిమాని అని చెప్పడం కాదు కానీ మనుష్యుల స్వభావాలు  ప్రవర్తనలు, వాళ్ళ వెరైటీ చమక్కులు జంధ్యాల మాస్టారు పట్టుకుని మూవీ లో పండించే వాళ్ళు . 
నాకప్పుడప్పుడు అనిపిస్తుంది…అయన ఇంకొన్నాళ్ళు  బ్రతికుంటే ఎన్ని కళా ఖండాలు తీసేవారో. అలాంటి దర్శకులు ఇంకొకరు  ఈ నాటికి తెలుగు దర్శకులలో ఎవరు లేక పోవడం మన దురదృష్టం.