Archive for ఫిబ్రవరి, 2010

మా తెలుగు తల్లికి మల్లెపూదండ….

ఫిబ్రవరి 22, 2010
లీడర్ మూవీ బానే ఉందని ఎవరో అన్నారు పొద్దున్న…శేఖర్ కమ్ముల మార్క్ మ్యూజిక్ expect చేస్తూ, ఇంటర్నెట్ లో  ఈ పాట విన్నాను..ఎందుకో ఎక్కడో చిన్న బాధ…ఒక ఆవేశం, కళ్ళకో చెమ్మ వచ్చేంత తెలీని ఫీలింగ్…ఒక సారి శంకరంబాడి  ని స్మరించుకోవాలి అనిపించి ఈ బ్లాగ్ రాస్తున్నాను…పక్కనే ఎవరో ఇదేదో చాల పాత మూవీ లోంచి remix  చేసినట్టునారు అని అడిగారు…మన దౌర్భాగ్యాన్ని  ని జంధ్యాల తిట్ల దండకం తో కడిగి పారేసిన సుఖం లేదేమో…
ఆ గీతం గీతకన్న పావనం …తల్లి ని గౌరవించిన ఒక అసలు సిసలు తెలుగోడి మనసు లోంచి పుట్టిన  పారిజాతం….ఆపాతమధురం…చిరస్మరణీయం..కనుచూపులో కరుణ నిండిన ఆ తల్లి తన గోదావరి కృష్ణ  స్తన్యధారలతో తన పిల్లలను పోషిస్తుంది..మురిపాలు పంచుతుంది..
ఈ గీతం ఒక్కటి చాలేమో తెలుగోడి చరిత్ర మొత్తం తెలుసుకోడానికి…అమరావతి నగర అపురూప శిల్పాలు మన చరిత్రకు వైభవానికి చిహ్నాలు..త్యాగయ్య గొంతులో తారడిన నాదాలు పక్క రాష్ట్రం లో నుండి విశ్వమంతా తెలుగు వెలుగులు పంచాయి..తిక్కన కలములోని తేట తెలుగు ధారలు అజరామరమై నిలిచాయి..రుద్రమ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి…
మా చెవుల రింగు మని మారు మొగేదాక నీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుతాం…
ఏమో…ఈ కాలం లో ముప్పాతిక మంది పిల్లలకు కాన్వెంట్ల దెబ్బకు తెలుగే రాని పరిస్తితి..ఇంకా తెలుగు లో పాటలు కూడానా…ఉట్టికి ఎగరలేనమ్మ చందం…మనోళ్ళకు ఆదివారం కూడా ఒక్క పూట సెలవు దొరుకుతుందో లేదో..ఆటలు కూడానా..
తెలుగు తల్లి నే తన్ని తరిమేసిన కొడుకులున్న కాలం..అన్న దమ్ముల్లా విడిపోదాం అని చెప్పే మేధావులు, సవతి తల్లులను సృష్టించే సమయం..బిడ్డలు ఆస్తి పంపకాలు చేసుకోవడం చూసాం కాని, మారు  తల్లుల్ని పుట్టించడం మనోల్లకే చెల్లు….ఈ వాదం పిడివాదమో , ఇంకోటో తెలీదు కాని, దీని వాళ్ళ వాళ్ళెం సాధించారో..వాళ్ళకన్నా తెలుసో తెలీదో..

ఒక్క మగాడు చిరంజీవి…

ఫిబ్రవరి 20, 2010
ఇన్నాళ్ళకు చిరంజీవి తన లెవెల్ కు తగ్గ పని చేసాడు. పార్టీ పెట్టిన ఇన్నాళ్ళనుండి ఒక్క సహభాష్ అనిపించుకునే పని చేసిన పాపాన పోలేదు. ఒక్క పార్టీ ప్రారంభ సభ తప్ప అన్నకు ఏది కలిసోచ్చినట్టు లేదు. కర్ణుడి చావు కు వేయి కారణాలైతే ముఠా మేస్త్రి పరాజయానికి లక్ష కారణాలు..పార్టీ లో మెగాస్టార్ చరిష్మ కన్నా మెగా మరిది ప్రభావం ఎక్కువై, అమావాస్య చంద్రునిలా దిన దినం క్షీణించి ఊక లో ఈక లా తయారయ్యాడు…..
కాని, ఇప్పుడు చిరంజీవి ని మెచ్చుకోవడానికి బలమైన కారణం ఉంది. తెలంగాణా విషయం లో అదే పనిగా ( బైట చెప్పుకో డానికైనా ) తెలంగాణా విముక్తి కోసం పుట్టిన తే రా సా కు, ఉద్యమాల కన్నా వోట్లు తక్కువ పడే communist పార్టీ లకు ఉన్న స్పష్టత మళ్ళా మెగా స్టార్ కే ఉంది…జాతీయ పార్టీ గా జబ్బలు చరుచుకునే కాంగ్రెస్, భయంకరం గా వేళ్ళూనుకున్న ప్రాంతీయ పార్టీ అని భుజాలు తడుముకునే తే దే పా. , జాతీయ స్తాయిలో ముక్కు పగల గొట్టించుకుని అక్కడక్కడ మెరుపుతీగలా కనపడే భా జ పా లు తెలంగాణా లో తెలంగాణా కు జై అని, సీమ ఆంధ్రల లో సమైక్యవాడులము అని సిగ్గు లేకుండా కండువాలు వేసుకుని తిరుగుతుంటే…మన మెగాస్టార్ కుండ బద్దలు కొట్టేసాడు…
ఇంకా ABVP , ఇంకా ఈ ఆహా ఓహో ధమాల్ దుమేల్ లాంటి తోక సంస్తలు, కోక మండళ్ళ సంగతి సరే సరి…ఏ ఎండ కా గొడుగు సామెత బాగా వంట బట్టించుకున్నారు…అదేమీ విడ్డూరమో కోస్తాలో ఓడ మల్లన్న అన్న పార్టీ లే తెలంగాణా వచ్చేసరికి బోడి మల్లన్న అనేస్తున్నాయి…
అబ్బే చిరంజీవి కి ఇంకా రాజకీయాలు వొంట బట్టలా అని మీరు కొట్టి పారేస్తే పరేయోచ్చు గాక…కానీ, ఈ విషయం లో చిరంజీవి రాష్ట్రం మొత్తం లో ఒక్క మగాడే….

చూపులు దేవుని మీద చిత్తం …….

ఫిబ్రవరి 13, 2010
ఈ మద్య మనోళ్ళంతా మంచోల్లై పోయారు…తెలంగాణా కోసం తల నరుక్కునే వాళ్ళు ఒకల్లైతే ( అబ్బే ఉత్తినే)  తలలు నరుకుతాం అనే వాళ్ళు ఒకళ్ళు…ఉన్నట్టుండి ఈ మద్యనే ఫ్రెష్ గ ఉద్యమం లో చేరి, నాకు వలసిన గౌరవం దక్కట్ట్లేదని వాపోయే వాల్లోకరైతే,  పలానా కులానికి గౌరవం దక్క కుంటే జాక్ గౌరవం దక్కదనే వాళ్ళోకళ్ళు..సరే ఉద్యమం లో ఇవన్ని మామూలే అనుకున్న…అదేదో నాటకం లో చెప్పినట్టు, అందరు మంచోల్లైతే అమ్మవారి మేడలో హారం ఏమైందని…అందరూ మంచోల్లైతే ఎందుకీ గొడవలు…ఇది దైవ రహస్యం..సర్లెండి మన మద్య రహస్యలేందుకు గాని…యినుకోండి…
నేను మంచోడ్ని సూపర్ మాన్ ని అనే కాకా, మొత్తానికి మొన్న బైట పడ్డాడు…అదేదో ప్రాజెక్ట్ కి వై ఎస్ ఆర్ ఆయన పేరు పెడతా అని హ్యాండ్ లో చేయి పెట్టి ప్రామిస్ చేసి మల్ల హ్యాండ్ ఇచ్చిన్దు అని…ఇలాంటి పేర్లు విగ్రహాలు ఎన్ని పెట్టించుకున్నా నువ్వు పోయాక నిన్నెవరు గుర్తుంచుకుంటారు కాకా..మల్ల కొన్నేళ్ళకి నీ పేరు జెప్తే జెనాలు గుర్తు పట్టాల..మల్ల జెప్పుడేందుకు జనాలే నిన్ను తల్చాలే..గట్లాంటి పని ఏమన్నా ఉంటె చేసి పెట్టు…జన్మ కో శివరాత్రి అన్నట్టు…పదవులు కోసమో, మల్ల ఆ ప్రాజెక్ట్ ఈ గవర్నర్ పదవో అని ఒండ్ర పెట్టుటేందుకు..
ఇంకా మన జాన రెడ్డి……మొన్న మద్య ఎవరో తెలంగాణా కోసం రాజీనామా చెయ్యమని ఎవరో నిలదీస్తే అన్న బైట పడిండు…పిచోల్లార ఈ ఉద్యమం యవ్వారం అంతా CM పోస్ట్ కోసమే నాకన్నా ఇంకెవరున్నారు…మల్ల ఇప్పుడు రాజీనామా చేస్తే మల్ల గెలుస్తానో లేదో 😉 అని…అయినా జానన్నా మన కే సి ఆర్ చేతులగ్గిట్ల  గాజులు తొడుక్కున్న డనుకున్నావ్…నీ పిచ్చ గాని మొన్నీ మద్య ఉద్యమం లో కొచ్చి ఇన్ని కళలు కన్తుడవే మరి ఇన్నాళ్ళు వేచి ఉన్న అన్న ఎమవ్వలె..
ఇంకా మన మంద భాగ్యుడు…ఈయన మొన్న జనాల్లో కి ఉద్యమం బాగా ఎక్కే దాక ఆ చుట్టూ పక్కల కనపల్లె…మల్ల ఇప్పుడు వచ్చి నాకు అది కావలె మా వాళ్ళకు ఇది కావలె అని లొల్లి…
యీల్లంతా కల్సి పాపం మన జాక్ ఆచార్యులు కోదండ రామున్ని ఏ మాన్యాలు పట్టిస్తారో అని నా బెంగంతా..వానర మూకె అడవికి పొమ్మంటే ఏమి చేస్తావో కోదండ రామా….

అందితే జుట్టు…అందకుంటే నాలుగు కొట్టు…

ఫిబ్రవరి 11, 2010
ఈ రోజుల్లో ఎవరు తగ్గేటట్టు లేరండి…అక్కడ ముంబై లో చూస్తే మన మరాట మానుస్ ధాకరే కుదుర్తే ముంబై చుట్టూ కంచే ఏర్పాటు చేసి ఇంకెవర్ని రానిచేటట్టు లేరు…ఇంకొన్నాళ్ళు పొతే ముంబై ని ధాకరే వాడి అనో రాజ్ నగర్ అనో మార్చేస్తారేమో…ఈ విపరీత వీర పిచ్చ ప్రవర్తనకి మచ్చుకి కొన్ని లక్షణాలు.. 
౧. పాకి ఆటగాళ్ళను ఐ పీ ఎల్ లో తీస్కోవాలి అన్నందుకు షారుఖ్ సినిమాలు ఆడకూడదు.
౨. ముంబై భారతీయు లందరిది అంటే సచిన్ ముఖేష్ చిదంబరం తదితరులంతా మరాఠా వాళ్ళను ఖూని చేసినట్టు రగడ చేయడం.
౩. ఆస్ట్రేలియా లో జరిగిన అల్లర్లకు ఆ క్రికెటర్స్ ఇండియా లో ఆడకూడదు.
౪. ఇది రాసి నందుకు నేను దొరికితే చదివినందుకు  మీరు మరాఠా ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇండియా అంతటికి ద్రోహం చేస్తున్నట్టే.. 😉
ఈ ధోరణి ఎక్కడో మరాఠా వాళ్ళదో ఇంకోల్లదో అని బాగా నవ్వు కుంటున్నారు కాదు…ఇంకా చూస్కోండి…మనోళ్ళు ఇందులో ఏమి తగ్గటం లేదు…నా దారి దొడ్డి దారి బెటర్ డోన్ట్ కం ఇన్ మై వే అనే వాళ్ళు మన రాష్ట్రము లో తక్కువేం  లేరు…మీరు వాళ్ళ అభిప్రాయం కన్నా ఒక్క ముక్క వేరుగా మాట్లాడారా అదేమీ కాదు డిఫరెంట్ గా ఆలోచించారు అంటే మీకు మూడిందన్న మాటే…మచ్చుకి..
౧. హైదరాబాద్ లో ఐ పీ ఎల్  జరక్క పొతే deccan chargers ఆడటం మానెయ్యాలని ఒక మంత్రి గారు వ్రాక్కిచ్చారు…రాజధాని లో గందరగోళాలు ఆపటం చేతకాక ఆడలేక డి జే కి మ్యూజిక్ సెన్స్ లేదు అన్నట్టుంది…
౨. మన ఘనత వహించిన శాసన సభ్యులొకరు శాసన సభ జరగనివ్వం అని డిసైడ్ అయిపోయారు…పేర్లోద్దు లెండి మల్ల అదో లొల్లి…
౩. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆంధ్రా వాళ్ళను హైదరాబాద్ లో అడుగుపెట్టనివ్వం అని ఒక ఆచార్యులు వీది రౌడీ లెక్క ఫర్మాన జారి చేసిండ్రు…
౪. ఇదెంత దూరం పోయిన దంటే ఈ మధ్య జరిగిన కేక లో అసమదీయులే తేడాలు మాట్లాడారని నీళ్ళ ప్యాకెట్ లతో కొట్టుకొనే దాక వెళ్ళింది…పోనిలే అక్కడితో ఆగారు…
అంటే చివరాఖరికి చెప్పేదేమంటే, ఈ దేశం లో ఒక బలవంతుడు ( మీరు పిచ్చి వాడు అని చదువుకోవచ్చు) ఒకటి అనుకోని డిసైడ్ అయిపోయాక దానికి మీరు అణువంత మాత్రం తేడా గా మాట్లాడారో మీకు మూడిందే…అసలు మీకు ఆలోచించే హక్కే లేదు…ఫాలో అయిపోవడమే…బ్రతికుంటే బన్ను తిని బతకచ్చు…ఇంకా మన ప్రజాస్వామ్యం ప్రభుత్వం పోలీసులు అని వెర్రి కలలు కంటున్నారేమో…ఎవరి ………..లు వారివి. ఎక్కువమాట్లాడితే ఎక్కడ వోట్లు సీట్లు వూడి పోతాయో అనే ప్రభుత్వం, అబ్బే నాకేం తెలీదు అనే ముఖ్య మంత్రి,, ప్రాంతాల వారిగా చీలిపోయి తన్నుకు చచ్చే ప్రెస్సు, ఇంకెవరు మిమ్మల్ని కాపాడేది…చచ్చినట్టు ఎవరు ఎదురు పడితే వాళ్లకు జై కొట్టండి…లేదో నా తర్వాత బ్లాగు చదివేదాక ఉంటారో లేదో 😦

రాజు తలచుకుంటే…..

ఫిబ్రవరి 10, 2010
ముస్లిం రిజర్వేషన్స్ గురించి  హై కోర్ట్ , మతపరమైన రిజర్వేషన్స్ కూడదని తీర్పు ఇచ్చింది…కాని మన దేశం లో రాజకీయాలు జన సంక్షేమం వైపు కాక సరిగ్గా వ్యతిరేక దిశలో నడుస్తాయి కాబట్టిన్ను, ఘనత వహించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దెబ్బతో ముస్లిం వోట్ బ్యాంకు మరో పది పదిహేనేళ్ళు నిక్షేపంగా కాంగ్రెస్ కే ఉండాలన్న తీవ్ర మైన దీక్ష తో వున్నందుచేతను, ఈ నిర్ణయాన్ని supreme కోర్ట్ లో పెట్టి, అప్పటికీ వీలు కాక పొతే రాజ్యాంగ సవరణ చేయడానికి   భద్దులై ఉన్నట్టు కనబడుతుంది..
   మరి జైనులకు, యూదులకు,బౌద్ధులకు  మన దేశం లో రిజర్వేషన్స్ ఉన్నట్టు లేదు…మరి వాళ్ళు మైనారిటీ లే కదా….అంటే ఇందులో చిదంబర రహస్యం ఏమియును లేదు…వాళ్ళ సంఖ్యా తక్కువ…మరియు వాళ్ళు ఒకటి రెండు తప్ప పెద్దగా ఏ నియోజక వర్గం లో నిర్ణాయక శక్తీ గ లేరు…మరి వాళ్ళకు రిజర్వేషన్ లు ఎలా వస్తాయి…ఇంకొక విచిత్రమైన విషయం ఏమి టంటే, OC  మేల్ category  కి ఇప్పుడు అసలైన రిజర్వేషన్ అవసరం…ఎలా అంటారా…౩౩% ఆడవాళ్ళ రిజర్వేషన్, మిగత ౪౦-౫౦ % మిగత రిజర్వేషన్స్…పోగా, ఇంకా మిగిలేదేమిటి….ఈ నాడు ఒక oC మేల్ category లో కాలేజీ సీట్ సంపాదించాలన్న, ఒక ఉద్యోగం సంపాదించాలన్న హీన పక్షం ఒక సూపర్ మాన్ కావలసినదే…ఈ గోల పడలేక జనం ఆ దేశం ఈ దేశం పట్టి పోవడం లో తప్పు లేదు…తప్పేది లేదు…
               రిజర్వేషన్లు ఏనాడైతే పేదరికాన్ని కొలమానంగా తీసుకోలేదో ఆనాడే పక్కదారి పట్టి నాయి..ఇక వాటిని మరియు మన జనాన్ని అధోగతి పట్టించడం …మన రాజులకు వెన్నతో పెట్టిన పెసరట్టు…

పదండి చింపి పారేద్దాం..రాష్ట్రం లో మరో ఉద్యమ స్ఫూర్తి :)

ఫిబ్రవరి 6, 2010
ఉత్తర భారత దేశం లో జనం అంతా ఆర్యులు, దక్షిణ భారతదేశం లో ని ద్రవిడులు కలిసుండటం సాద్యం కాదు కాబట్టి..దేశం రెండు దేశాలు గ విడి పోతె ఇక వైరుధ్యాలు ఉండవు కావున భలే గా అభివృద్ధి చెందిపోవచ్చని మన  కృష్ణ బాబు  తే దే పా మాజీ ఎమ్మెల్యే గారు డిసైడ్ అయిపోయారు…సరే ఆయన అయిపోయారు అయిపోయిన పెద్దమనిషి ఇంట్లో వాళ్లకు చెప్పి గమ్మునున్నాడా లేదు…ఐన దానికి కాని దానికి మన మీడియా వాళ్ళు ఉన్నారు కదా ఒక ప్రకటన వదిలేసిపారేసారు…
 
వీల్లండి మన ప్రజా ప్రతినిధులు…అదేదో సినిమాలో చెప్పినట్టు, పెళ్లి చెయ్యడం కష్టం కాని చేడకోట్టడం యెంత సేపు ??? ఈ దేశం భిన్నత్వం లో ఏకత్వం మన తత్త్వం అని చాటి చెప్పిన దేశం. ప్రపంచ  దేశాలే ముక్కున వేలేసుకుని చూసేటట్టు కలిసి ఉన్న దేశం. ఈ వైరుధ్యాలు భిన్న భాషలు మతాలు కలిసిన ఇంద్ర ధనుస్సు…నాయన కృష్ణ బాబు…ఏమి తోచక పోతె తోట పని చేస్కో…లేదంటావా ఇప్పటికే చాల విభజన ఉద్యమాలున్నాయి….వాటిలో జనం లేక  భాదపడుతున్నారు…పోయి వాటిలో చేరు…ఇంకా అర్ధం కాక పోతె విశాఖ లోనో ఎర్రగడ్డ లోనో ఒక బెడ్డు ఖాలీ లేక పోదు…

మాయాబజార్ కలర్ లో ( కవితక్క కి చెప్పకండే ;) )

ఫిబ్రవరి 6, 2010

మీరంతా మాయ బజార్ కలర్ లో అని న్యూస్ లో పేపర్ లో చూసే ఉంటారు…యెంత గొప్ప ఆలోచన …కలర్ లో ఆ ఛాయా గ్రహణం, ఆ సెట్టింగ్లు, ఆ ఘటోత్కచ మాయలు ఆహా చూడాల్సిందే కాని చెప్పేది కాదు…నేనైతే మిస్ కాకుండా చూడలనుకుంది సావిత్రి ని, ఏంటి ఓడిని, మన ఎస్వీఆర్ ని…ముగ్గురు ముగ్గురే హేమహేమిల్లాంటి నటులు…వాళ్ళనోక్కసారి కలర్ లో చూసి తరించి పోదాం అనిపించింది….అంటే అంతకు ముందు చూడలేదా అని మీరు అడగచ్చు ..ఎంతైనా మాయ బజార్ మాయ బజార్ ఏ కదండీ…ఏంటి ఓడు కృష్ణుడి వేషం కడితే జనం ఎడ్ల బండ్లు కట్టుకుని మైళ్ళ కి మైళ్లు వెళ్లి చుసోచ్చేవల్లంట…సినిమా చూస్తుంటే అలాచేయడం సబబే అనిపిస్తుంది…
ఇంకో విషయం….మనలో మాట…ఈ ముక్క మన కవితక్క కి చెప్పకండే…ఏ కవితక్క??? అమ్మా …యెంత దైర్నం ఉంటే అలా అడుగుతారు…అదేనండి మన తెలంగాణా కవితక్క ….మరి ఇంకా ఈ ముక్క ఎవరు అనలేదో…లేక బుర్రకెక్కలేదో…ఇందులో నటీ నటులు నూటికి తొంభై శాతం సో కాలుడ్ ఆంధ్ర వాళ్ళే…మరి అదుర్స్ సినిమా ఆపిస్తం అని ధుమ్ ధాం డాం డూం అని ఎగిరిన అక్క కీ విషయం ఇంకా తెలిసినట్టు లేదు…
మరి అక్క లెక్క ప్రకారం దీన్ని ఆపాలే గంద….ఇదేమి కిరి కిరి…అంటే మస్తు హుషారు జేస్తే జనం తంతారని ఆగిందో ఏమో…మల్ల తెలంగాణా లో ఈ కాస్ట్ కి మస్తు ఫాన్స్ ఉండారని ఎవ్వరన్న జెప్పిండ్రో….అక్క గిట్ల చప్పుడు జేయక గమ్మునుంది….
కళల కు కళా కారులకు ఎల్లలు ఉండవు…ఉంటాయి ఎల్లలు గీస్తం అనుకుంటే అది మూర్ఖత్వానికి పరాకాష్ట…మన సినిమాలు పాకిస్తాన్ లో కూడా జనం దొంగచాటు గ చూస్తారంట….అక్కడ ఇలాంటి ఛండాలపు ప్రభుత్వం తగలబడింది కాబట్టి…మరి ఖర్మ కాలి రేపు తెలంగాణ ఇలాంటి నాయకత్వం లో వస్తే జనం గిట్ల దొంగతనం గ తెలుగు సినిమాలు చూడాలేమో……ఔ మల్ల…

ఒకటో కృష్ణుడు…రెండో కృష్ణుడు..మూడో…నాలుగో CM

ఫిబ్రవరి 1, 2010
మేఘాలయ లో కాంగ్రెస్ మార్కు రాజకీయం నడుస్తోంది. ఇదేదో పాత మార్కు రాజకీయం కాదండోయ్…రాహుల్ గాంధీ, కొత్త వారసులు , కొత్త రాజకీయం అని ఈ మద్య ఊదర గొట్టిన కాంగ్రెస్ వాళ్ళు,  మేఘాలయ లో 4 గురికి ముఖ్యమంత్రిత్వం కట్ట బెట్టారు…కళ్ళు నులుముకొని చదవక్కరలేదు..నేను కరెక్టే రాసాను..మీరు కరెక్టే చదివారు…సప్పోస్ పర్ సప్పోస్ అని అదేదో సినిమా లో రావు గోపాల రావు అన్నట్టు..వీల్లదేదో నిజమే చేసిపారేసారు..
ఇంకా వివరాలలో కెళ్తే, పార్టీ అద్యక్షుడు లింగ్డో , పాత కాపు లపాంగ్ కి అదే చేత్తో ప్రణాళిక బోర్డు చైర్మన్ కి , ఆర్ధికాభివృద్ధి బోర్డు చైర్మన్  కూడా ముఖ్యమంత్రిత్వం వెలగ బెడతారని ప్రకటన చేసి పారేసారట.మీకీ పాటికి అర్ధం అయ్యేవుంటుంది..ఇందులో చిదంబర రహస్యం ఏమి లేదు…ఆ  4రు CM ల లో 2 రు ఘనత వహించిన కాంగ్రెస్ వాదులు..మరో ఇద్దరు మిత్రపక్షం…అధికారం ఇద్దరిది…ఈ ఒకటో కృష్ణుడు రెండో CM నాటకం చూసి తరించే ఖర్మ జనాలది….అధికారం కోసమో, సర్దుబాట్ల కోసమో మన వాళ్ళు ఇలాంటి నాటకాలు వేయడం కొత్త కాదు కాని…ఇదేదో శ్రుతి మించి రాగాన పడుతున్నట్టు లెదూ…