Archive for మార్చి, 2010

అయిన వాళ్ళకు కంచాల్లో..కాని వాళ్ళకు ఆకుల్లో..

మార్చి 14, 2010
రాజీనామా చెయ్యలేదని తే.దే.పా ను రాజకీయ జాక్ నుంచి బహిష్కరించారు. కొదందారం చెప్పేదేమిటంటే వాళ్ళు ఎవరూ రాజీనామా చెయ్యడానికి ఇష్టపడలేదు కాబట్టి వాళ్ళు మన ఉద్యమానికి ఉపయోగపడరు అని. గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆయన పక్కన మన కే.సి.ఆర్. మరి ఆయన రాజీనామా చెయ్యక్కర్లేదా…ఇది కొంచెం పిడకల వేట బ్లాగ్ విషయమే కాని, అక్కడ జరిగేది రామాయణం కాదు..కొదందారం రాముడు కాదు కాబట్టి మంచి కామెడీ విషయమే..
ఇది అది కాదు అన్ని విషయాల్లో తెలంగాణా ను వెతుక్కుని అదేదో అనుకుని మనకేదో చెప్పి ఇంకొటేదో అయ్యాక వెనక్కు తగ్గటం మన జాక్ వాళ్ళకు అలవాటై పోయింది. ఇది ఒక మహోద్రుత ఉద్యమం దారి నుండి మంచి కామెడీ సీన్స్ పండించే, మన మీడియా వాళ్లకి మసాల న్యూస్ అందిచే వేదిక గ తయారయ్యింది.నా పాత బ్లాగ్ లో ( మేడి పండు…) చెప్పినట్టు, జనాలకు వీళ్ళ గోల అర్ధం కాకుండా పోయే రోజులు ఎన్నో రోజులు లేవు. మచ్చుకు తెలంగాణా ఇంటర్ పేపర్లు రుద్దటం తెలంగాణా లోనే జరగాలి అనటం, మల్ల జనం ఏమనుకుంటారో అని వెనక్కు తగ్గటం, ఆంధ్ర వస్తు భాహిష్కరణ అనటం, లిస్టు తాయారు చేస్తాం అని మల్ల అప్పుడెప్పుడో కే.ఏ.పాల్ అభ్యర్దుల లిస్టు పోయినట్టు  ఈ లిస్టు ఏ మయిందో కోడందరం కే తెలియాలి.  ఇంకో గొప్ప విషయం ఏమి టంటే గురు గారు తెలంగాణా వ్యతిరేకుల ఆస్తుల లిస్టు తాయారు చేస్తారట. ఇలాంటి చర్యల మాటల వెనుక ఏదో చేసేసేయ్యలని వుబలాటం ఉత్సుకత తప్ప సహేతుకత కన పడదు.
యదా జాక్ తధా క్రాక్   అనే పిచ్చి జనాలు చాల మంది…ధరలు పెరిగినాయ్ రా మగడా అని వాల్లెవరో ధర్నా చేస్తుంటే వాళ్ళ దగ్గర తెలంగాణా వూసేందుకు, నిర్హేతుకమే కదా…వాళ్ళ సభ ను అడ్డుకున్నదే కాక మల్లా మమ్మల్ని తన్నారు..క్షమాపణ చెప్పలే అని లొల్లి… వంక దొరకనమ్మ డొంక పట్టుకు ఏడ్చినట్టు..ఇంకో గొప్ప పని…చిరంజీవి విద్యుత్ సమస్యల పై వినతి పత్రం ఇవ్వటానికి విద్యుత్ సౌద కు వెళ్తే లిఫ్ట్ కి పవర్ ఆపేసి అదేదో ఘనకార్యం చేసి నట్టు టీ.వీ లకు ఎక్కే ప్రభుద్దులు..నా ఉద్దేశ్యం బాబు, చిరు గొప్ప వ్యక్తులని మంచి వాళ్ళని చెప్పటం కాదు….నిరసన తెలిపే పద్దతులు మాత్రం ఇవి కావని..
ప్రజాస్వామ్యం లో ప్రతి వ్యక్తి కీ భావప్రకటనా స్వేచ్చ ఉన్నప్పుడు మిగతా గొంతులు ఎందుకు నొక్కేస్తున్నారు..రాష్ట్రం లో ఒక్క తెలంగాణా వాదమే వినిపించాలి అనటం మన మెదళ్ళు బొద్దింక సైజు లో ఉన్నాయి అని మల్లి మల్లి చెప్పు కోవటమే…ఇలాంటి చర్యలు ప్రకటనలు ఆంధ్ర బాల్ థాకరే లనే గుర్తుకు తెస్తాయి…
ఈ పోకడలు జాక్ పూర్తిగా టీ.ఆర్.ఎస్ అజెండా లోకే వెళ్తుందని స్పష్టం చేస్తున్నాయి..అందరు రాజీనామా చెయ్యమనే కే.సి.ఆర్, తను చెల్లెమ్మ రాములమ్మ ఎందుకు రాజీనామా చెయ్యరో చెప్పరు. అయ్యవారు మరి లోక్సభ లో తెలంగాణా వాణి యిని పిస్తారేమో అని జనం మభ్య పడొచ్చు గాక…ఆయన  మంత్రి గా ఉన్నప్పుడే అటేపు పొతే వొట్టు…..మరి కొదందారం కి అలాటి బ్రమలేమన్న ఉన్నాయా…ఏమో…గదేందో తెలంగాణా టీ.వీ అంట వాళ్ళని కనోక్కొని మల్లా జెప్త….

గొల్లపూడి గారు…నాకూ అర్ధం కాలేదు…

మార్చి 8, 2010
నేను ఈ విషయం మీద బ్లాగ్ రాద్దామని కొంచెం notes  చేసిపెట్టుకున్నా..కాని ఈ లోగా మన  గొల్లపూడి గారు తన బ్లాగ్ లో ఈ విషయం మీద  భేషైన వ్యాఖ్యానం రాసారు…మల్లా నేను రాసినా ఆయన కన్నా గొప్పగా చెప్పేదేమీ లేదు కాబట్టి…మీరే అది చదవండి ….
http://www.koumudi.net/gollapudi/030810_I_need_to_understand.html

పరమ గురుడు చెప్పిన వాడు పెద్దమనిషి కాదు రా..

మార్చి 6, 2010
రష్యా చరిత్ర లో ఒక సంఘటన. జార్ చక్రవర్తి పీటర్ ఖజానా నింపుకునేందుకు ఒక చిన్నచిట్కా వేస్తారు. ఎవరైతే కొన్ని అంగుళాల కన్నా ఎక్కువ గడ్డం పెంచుతారో వారు నెల వారి గా ప్రభుతవానికి పన్ను కట్టాలి. అప్పట్లో గడ్డం పెంచడం ఒక కులీనుల సరదా, అవసరమున్ను. యెంత గడ్డం ఉంటె అంత పెద్దమనిషి అన్నమాట. మరి చచ్చినట్టు అలాటి వాళ్ళంతా పన్ను కట్టేరు. ఆ డబ్బు వాళ్లతో  వీళ్ళతో యుద్దాలు చెయ్యడానికి మరి పీటర్స్ బుర్గ్ అనే గొప్ప నగరాన్ని కట్ట డానికి ఉపయోగపడింది.
ఈ మద్య నడుస్తున్న చరిత్రను చూస్తే ఎందుకో దీన్ని మన దేశానికి అన్వయిద్దాం అనిపించింది. ఈ రోజుల్లో మన దేశం లో గడ్డం పెంచితే బాబా జుట్టు పెంచితే స్వామీ. గీత, రామ అంటే పరమహంస. నేనే దేవుణ్ణి అంటే భగవాన్. దేవుడి పెళ్ళాం, అనుమానం ఎందుకు అమ్మ భగవాన్. ఇంకా నయం మరిది భగవాన్, కొడుకు భగవాన్ రాలేదెందుకో. వీళ్ళు పోయాక వాళ్ళేమో. ఈ లాజిక్ పనిచేస్తే ఇలా అవడం పెద్ద కష్టం కాదు. ఒక ౪ నెలలు క్షురకుడి దగ్గరకు వెళ్ళాక పొతే సరి…మీరే ఒక స్వామి. పైన పీటర్ లా ఆలోచించిన మన ఖజాన కి  ఎంతో కొంత డబ్బు రాక పోదు.
ఇంకో కధ. పూర్వం ఒక స్వామిజి వాళ్ళ శిష్యులతో  కలిసి అదేదో నది దాటుతున్నారట. అక్కడ ఒక అమ్మాయి నది దాటలేక అవస్త పడుతుంటే స్వామీజీ తన భుజాలపై ఎక్కుంచుకొని నది దాటిన్చారట. నది దాటాక వాళ్ళు నగరమంతా తిరిగి భిక్ష తీస్కుని ఒక చెట్టు కింద కూర్చున్నారు. కాని శిష్యులు సర్వ సంఘ పరిత్యాగి ఐన గురుజి ఇలా చెయ్యడం ఏంటి అని ఆలోచిస్తున్నారట. అప్పుడాయన అబ్బాయిలు నేను ఆ అమ్మాయిని ఎప్పుడో దిన్చేసాను. మీరు ఇంకా నెత్తి నెట్టుకున్నారెందుకు అని అడిగారట.
ఈ గురు వేవడో సత్తే కాలపు మనిషి లా మీకు అనిపించటం లో ఆశ్చర్యం లేదు. ఎందుకని పించదు. గురూజీ అంటే జనం ముందు గీత పారాయణం. రాత్రి కి ఏమిటో మీరీ పాటికి రకరకాల టీవీ చాన్నేల్లలో రక రకాలు గా చూసే ఉంటారు. ఆ nityananda కి నా స్నేహితులు చాల మంది మంచి ఫాన్స్. నన్ను కూడా విన మని రెండు మూడు సార్లు డీ వీ డీ లు గట్త్ర ఇచ్చారు. కాని, టైం కుదరకో టైం బాగుందో మరి నేను చూడలేదు. కాని nityananda చాల శక్తి వంతులు. ఆయన లీల వినోదం చూపించే తీరారు.
ఇక గడ్డం పెరిగిన భగవాన్. మత్తు మందులో మరో ప్రపంచం చూపించే కల్కి. ఆ మత్తు లో ప్రపంచం చూడటం ఏమి ఖర్మ, కొత్త  ప్రపంచం స్తాపించేయ్యోచ్చు. అనుమానమా, మన దాసాజిలను అడగండి. ఆత్మా పరమాత్మ సంగమం అంటే మంచిగా ౪ రౌండ్లు ప్రసాదం పుచ్చుకుంటే ఇట్లే అర్ధం అయిపోతుందట. అమ్మ భగవాన్ సంస్కృత ఘోష కూడా ఆంధ్ర దేశం అంతా విని తరించేసింది.
ఇవన్ని అనవసరం అండి, ఈ బాబా లు భగవాన్ లా వెంట పడి పోయే వాళ్ళందరికీ ఒకటే ప్రశ్న. సర్వ సంఘ పరిత్యాగి కి డబ్బులెందుకు. ప్రపంచాన్నే మార్చే భగవాన్ లకు పైసా లెందుకు. దర్శనం కి ఒక రేటు. ఇంకో డానికి ఇంకో రేటు, ఆ డబ్బులన్నీ పెట్టి అయ్యవారు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితే కొడుకు భగవాన్ ౬-౭ కంపెనీలు నడుపుతున్నారట. మన భక్తులు అది కూడా సమాజ ఉద్దరణ అంటారేమో.
నాకొక అనుమానం. మన nityananda రేపు మల్ల ఒక ప్రెస్ మీటింగ్ పెడతారేమో. ఆ అమ్మాయి కి కామి కాని వాడు మోక్ష గామి కాదు అని భోదిస్తుంటే మీడియా వక్రీకరించింది అని. ఇన్ని నమ్మిన గొర్రెలు అదీ నమ్మినా ఆశ్చర్యం లేదు….
కల్కి దర్శనం…nityanandam…nityanando ranjito rajnithaha 😉 

మేడి పండు మెదళ్ళు…

మార్చి 2, 2010
పొద్దున్నే మన తెలంగాణా జాక్ వాళ్ళు భలే డిమాండ్ చేసారు. ఒక్క కొదందారం( చదివాను, కాని కావాలనే సరిచేయ్యలేదు) ఒక్కడే వీళ్ళలో బుర్ర వాడుతాడు కదా అని టి.వి లో ఆయన ఏదో మాట్లాడుతుంటే విన్నా.విన్నాక అనిపించింది. ఈయనకు fuse పోయింది అని. పక్కనే సినిమాల బంద్ కవితక్క, గజని మొహమ్మద్ ల ఎన్ని సార్లు నిలబడ్డా ఈ మద్య కాలం లో ఒక్క election గెలవలేక చావు తెలివి తో జై తెలంగాణా అంటున్న విద్యాసాగర్.
ఇంతకీ డిమాండ్ ఏమి టంటే, తెలంగాణా ఇంటర్ పేపర్లు తెలంగాణా లో నే రుద్దాలంట. లేక పొతే ఆంధ్ర ఉపాద్యాయులు వీళ్ళని ఫెయిల్ చేస్తారని వీళ్ళ భాద. ఇదెక్కడి విడ్డూరం. కామెర్ల రోగులకు లోకమంతా పచ్చగా అంటే ఇదేనేమో..సరే, పదవి కోసం ………తినే రాజకీయులు అల అన్నారంటే సరే మరి కొదందారం కి ఏమయ్యింది..బుర్ర కడగ బడ్డ దా లేక..కే.సి.ఆర్. డబ్బుతో కొట్టాడ అయ్యవారిని.ఆయన ఉపాధ్యాయుని  గానే ఉన్నారు కదా..రేపో ఎల్లుండో రిటైర్ అయ్యే లా ఉన్నాడు. మరి అయ్యవారు కూడా ఆంధ్ర విద్యార్దులని పని గట్టు కొని ఫెయిల్ చేసేవార?? మరి లేకుంటే ఈ ఆలోచేనలేల వచ్చాయి. ఈ గుంపు లో ఒక్క చుక్కా రామయ్య ఒక్కడే దీన్ని వ్యతిరేకించాడు. తెలంగాణా మీద ఆయన అలోచెనలు పక్కనెడితే సహభాష్ అనిపించుకున్నాడు.
అయ్యా…ఉపాద్యాయ  వృత్తి ఇంకా అంత దిగజారలేదు..మీవంటి మేడిపండు మెదళ్ల సాయం ఇక్కడేవరికి అక్కర్లేదు. నేను కొన్నేళ్ళు ఉపాద్యాయ వృత్తి లో ఉన్నాను..ఎక్కడైనా ౧-౨ మార్కులు తగ్గితే పేపర్ మొత్తం వెతికి ఎక్కడ ఆ మార్కులు కలిపితే విద్యార్ధి పాస్ అవుతాడు  అని చూసే వాళ్ళను చూసా కాని ఇలా ఆలోచించే వాళ్ళను మిమ్మల్నే చూసాను. ఇందులో తెలంగాణా ఆంధ్ర ప్రస్తావనే లేదని మనవి. ఇంకా మీకు అలా అనిపిస్తుంటే, ఒక్క సారి ఫెనొఎల్ తో మెదడు కడుక్కోవలసిన అవసరం మీకు ఎంతైనా ఉంది.
ఇలాంటి వెర్రి మొర్రి అలోచేనలతో డిమాండ్ ల తో జనం లో ఉన్న కొంచెం సానుభూతి జాక్ కోల్పోతుంది.. జనం వీళ్ళను గుర్తెరిగి తన్ని తరమేసే కాలం ఎంతో కాలం లేదు. ఆ కాలం త్వరలో రావాలని ఆశిస్తూ..జై తెలుగు తల్లి..

ఆంధ్ర ప్రదేశ్–ఒక పిచ్చి వాళ్ళ స్వర్గం

మార్చి 2, 2010
ఒక సారి ఆలోచించండి…ఆలోచనే వెరైటీ గ ఉన్నా, అక్కడ జరుగుతుంది అదే…కారణాలు,ఉద్దేశాలు ఏవైనప్పటికీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పిచ్చి..కోస్తా రాయలసీమలలో నాయకులు సమైక్య ఆంధ్ర గోల..ఈ మద్య కొంచెం తగ్గారు కాని, మొన్నటిదాకా బస్సులు, రైళ్ళు ఆపేసి నారు. విచిత్రం ఏమిటంటే ఈ తెలంగాణా statement ముందు అందరు అధిష్టానం ఆదేశాలు పాటిస్తాం అని శపధాలు  చేసేసినోల్లె. అమావాస్య కి పౌర్ణమి కి టి.జి. లాంటి వాళ్ళు వేర్రేతినట్టు మాకో రాయలసీమ కావలోచ్ అని అరిసేస్తుంటారు. సోమిరెడ్డి మరియు ఆనం అన్నదమ్ములు మొన్నటిదాకా సోనియమ్మ అని..ఇప్పుడు ఇంకొటేదో  అంటున్నారు..ఇక సందట్లో సడేమియా లా ఆమంచి లాంటి వాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళున్నారు..
ఇంకాస్త పైకొస్తే లగట పాటి ఇప్పుడేదో లక లక లక అంటున్నారు కాని ఈ తెలంగాణా నిర్ణయం ఆయనకు ముందు నుంచి తెలీద అనేది ఒక నూరు పైసల ప్రశ్న…మరి ఈ లోల్లేదో ముందు నుంచి చెయ్యొచ్చు గంద…అదేదో కే.సి.ఆర్ దీక్ష గురించి పెద్ద ప్రకటనలు చేసి ఈ యన గారు చేసిందేమిటో ఆంధ్ర అంటా తెలుసు…చిరంజీవి ఇప్పుడేదో అంటున్నాడు గాని సామాజిక తెలంగాణా అని గ్రాండ్ గ మానిఫెస్టో లో పెట్టింది ఆయనే గంద…ఇక వసంత, హరి రామ జోగయ్య లాంటి వాళ్ళదో లోకం…ఇక బొత్స గారికి మొన్న కలలో ఆంధ్ర CM కుర్చీ కనపడ్డట్టుంది…మాస్టారు యమ అర్జెంటు గ  U turn తీసుకున్నారు..ఆ అదేదో ఇస్తే తప్పేంటి అని ప్రకటించేశారు.
ఇక తెలంగాణా కొస్తే, చిన్చేస్తం ఆరేస్తాం అని కేకలేసిన కాంగ్రెస్ వాళ్ళు టి.డి.పీ వాళ్ళు రాజీనామా దగ్గరికొచ్చేటప్పటికి అబ్బే మేమలా ఆనలే అని తప్పుకున్నారు.. ముందు నుంచి అందరు రాజీనామా చేసేయండి గొంతులు కోస్కోండి అని అరిచి గీ పెట్టిన కే.సి.ఆర్, రాములమ్మలు రాజీనామా లలో కాసి మజిలి కధలు రాసి పంపారు…జాక్ వాళ్ళు ఇంకో గందరగోళం లో ఉన్నారు….పండగలకి పబ్బాలకి తెలంగాణా రంగులేసేస్తున్నారు…ఎక్కువ మాట్లాడితే మీ అస్తులు లేక్కేసేస్తాం అని ఫర్మానాలు ఇంస్తున్నారు..మజ్లిస్ వాళ్ళకి కే.సి.ఆర్ కి లెక్కల్లో తెడలోచ్చాయో…లేక తెలంగాణా వస్తే అన్న కే.సి.ఆర్ చేక్రం తిప్పుతాడనుకున్నారో గాని  ఈ పౌర్ణమి కి వాళ్ళు సమైక్యంద్ర కే వోటు వేస్తున్నారు…బాబు గారేమో ఏమి అడిగిన బిత్తర చూపులు చూస్తున్నారు..మన బియ్యం గో డౌన్ గుమస్తా గారు అన్ని చూస్తున్నారు…ఏమన్నా అడిగితె నాకేమి తెలీదు అంటున్నారు……
ఇన్ని చెప్పిన ఇంకా ఆంధ్ర కేల్తున్నారా..జరా బద్రం సారూ..